Bigg Boss: ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రభాస్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్ కంటే పాపులర్- బాలనటి నుంచి సీరియల్ హీరోయిన్!
Bigg Boss Contestant Popular Than Prabhas Allu Arjun: ఎంత బిగ్ బాస్‌లో పాల్గొన్నా కూడా స్టార్ హీరోల రేంజ్‌ను బీట్ చేయలేరు. కానీ, ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా ప్రభాస్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్, కరీనా కపూర్ వంటి స్టార్ హీరోహీరోయిన్లు దాటేసి పాపులర్ అయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా?
Bigg Boss Contestant Popular Than Prabhas Allu Arjun: ఇప్పుడు బిగ్ బాస్ ఫీవర్ అటు సౌత్, ఇటు నార్త్ రెండువైపులా జోరుగా నడుస్తోంది. ఒకేరోజు (సెప్టెంబర్ 6) తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ, హిందీ, బంగ్లా 6 భాషల్లో బిగ్ బాస్ గ్రాండ్‌గా ప్రారంభమైంది.

బిగ్ బాస్ 20లోకి 16 మంది కంటెస్టెంట్స్
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తున్న 'బిగ్ బాస్ 20' రియాలిటీ షో 'ఎక్స్‌ట్రా జీవన్ దాన్' అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో లాంచ్ అయింది. 'అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్' ఫాంటసీ శైలిలో రూపొందించిన ఈ భారీ సెట్‌లోకి 16 మంది పోటీదారులు అడుగుపెట్టారు.
అయితే బిగ్ బాస్ హిందీ 20 కంటెస్టెంట్ల లైనప్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, ఒక చిన్నది మాత్రం తన సోషల్ మీడియా బలంతో అగ్ర హీరోలకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ప్రభాస్, అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఫాలోవర్లు!
బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన 23 ఏళ్ల అరిష్ఫా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో సృష్టిస్తున్న సంచలనం సామాన్యమైనది కాదు. ఈమెకు సోషల్ వేదికపై ఏకంగా 2.91 కోట్ల మంది (29.1 మిలియన్లు) ఫాలోవర్లు ఉన్నారు. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు 2.79 కోట్ల మంది, రెబెల్ స్టార్ ప్రభాస్‌కు 1.39 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, వారిని మించి అరిష్ఫా ఫాలోయింగ్ తెచ్చుకోవడం విశేషం.
బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్ (2.67 కోట్లు), కరీనా కపూర్ (1.39 కోట్లు) కూడా అరిష్ఫా ఖాన్ వెనుకే నిలిచారు. వెండితెరపై పెద్ద సినిమాలు ఏవీ చేయకుండానే కేవలం బుల్లితెర సీరియళ్లు, డిజిటల్ కంటెంట్‌తో ఈ స్థాయిలో అభిమానులను సంపాదించుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం.
స్టంట్ ఉమెన్ కుమార్తె నుంచి కథానాయికగా..
2003లో జన్మించిన అరిష్ఫా ఖాన్, 2012లో చిన్నారిగా నటన ప్రారంభించింది. 'ఛల్ - షేహ్ ఔర్ మాత్', 'వీర్ కీ అర్దాస్... వీరా', 'ఉత్తరన్', 'యే హై మొహబ్బతీన్', 'గంగ' వంటి హిట్ సీరియళ్లలో బాలనటిగా ప్రేక్షకులను అలరించింది.
అరిష్ఫా తల్లి ఒక స్టంట్ ఉమెన్‌గా పనిచేసేవారు. షూటింగ్ స్పాట్‌కు తల్లి వెంట వెళ్తూ మెల్లగా నటనపై మక్కువ పెంచుకుంది. 2018లో 'పాపా బై ఛాన్స్' సీరియల్‌లో మొదటిసారి ప్రధాన పాత్ర పోషించింది అరిష్ఫా ఖాన్.
హీరోయిన్‌గా మొదటి సీరియల్
"2018లో నాకు హీరోయిన్‌గా మొదటి సీరియల్ వచ్చినప్పుడు మా అమ్మ నన్ను హత్తుకుని ఏడ్చేసింది. ఒక స్టంట్ ఉమెన్ కూతురు హీరోయిన్ అయిందని చుట్టుపక్కల వాళ్లు పొగుడుతుంటే మా అమ్మ గర్వంతో ఉప్పొంగిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు" అని అరిష్ఫా ఖాన్ తెలిపింది.
"14 ఏళ్ల వయసులోనే పెళ్లయిన మహిళగా నటించాను. అంత చిన్న వయసులో ఆ భావోద్వేగాలు పండించడం కష్టమైనా, ఇంట్లోని పెద్దవాళ్లను గమనిస్తూ నేర్చుకున్నాను" అని గతంలో ఓ ఇంటర్వ్యూలో అరిష్ఫా ఖాన్ పంచుకున్నారు.
టిక్‌టాక్ నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు!
బుల్లితెరపై మెరిసిన తర్వాత డిజిటల్ మాధ్యమాల్లోకి అడుగుపెట్టింది అరిష్ఫా. టిక్‌టాక్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో తన షార్ట్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆపై ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరైంది. పలు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి తనదైన ముద్ర వేసింది అరిష్ఫా ఖాన్.
హౌస్‌లో అందరికంటే టాప్ ఈమెనే!
బిగ్ బాస్ 20 హౌస్‌లోని మిగతా పోటీదారులతో పోలిస్తే అరిష్ఫా సోషల్ మీడియా బలం చాలా ఎక్కువ. యూట్యూబర్, గేమర్ తన్మయ్ సింగ్ (కనిక మాన్) 73 లక్షల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్‌కు 20 లక్షలు, నటి మహీ విజ్‌కు 22 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇక హౌస్‌లో పోటీదారుల మధ్య అప్పుడే గొడవలు, శత్రుత్వాలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ అపారమైన ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని అరిష్ఫా ఖాన్ హౌస్‌లో ఎంతకాలం నిలదొక్కుకుంటుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


