Serial Hero: బుల్లితెర స్టార్ హీరోకు కారు యాక్సిడెంట్.. ఓటీటీ సిరీస్ ప్రమోషన్స్ ముగించుకుని వస్తుండగా ఘటన!

Serial Actor Arjun Bijlani Car Accident: ప్రముఖ టీవీ నటుడు అర్జున్ బిజ్లానీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నైట్‌ఫ్లిక్స్ కొత్త ఓటీటీ సిరీస్ చుంబక్ ప్రమోషన్స్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయం ఇప్పుడు హిందీ బుల్లితెర ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసింది.

Published on: Aug 21, 2026, 14:45:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serial Actor Arjun Bijlani Car Accident: బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్ర హీరో అర్జున్ బిజ్లానీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన నటించిన కొత్త ఓటీటీ సిరీస్ 'చుంబక్' ప్రమోషన్ల కోసం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం (ఆగస్ట్ 20) షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా అర్జున్ బిజ్లానీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

బుల్లితెర స్టార్ హీరోకు కారు యాక్సిడెంట్.. ఓటీటీ సిరీస్ ప్రమోషన్స్ ముగించుకుని వస్తుండగా ఘటన!
బుల్లితెర స్టార్ హీరోకు కారు యాక్సిడెంట్.. ఓటీటీ సిరీస్ ప్రమోషన్స్ ముగించుకుని వస్తుండగా ఘటన!

గేమ్ షో షూటింగ్ ముగించుకుని వస్తుండగా ప్రమాదం

కామెడీ క్వీన్ భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న 'ఇండియన్ గేమ్ షో' సెట్‌కు అర్జున్ బిజ్లానీ వెళ్లారు. ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న తన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'చుంబక్' ప్రమోషన్స్ కోసం అర్జున్ బిజ్లానీ ఈ షోలో పాల్గొన్నారు.

షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణమవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే, ఈ కారు ప్రమాదం నుంచి సీరియల్ స్టార్ హీరో అర్జున్ బిజ్లానీ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, అర్జున్ బిజ్లానీకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

'చుంబక్ కాలనీ' హంగామా..

ఆయనతో పాటు కారులో ఉన్న ఇతర సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని సమాచారం అందింది. అర్జున్ బిజ్లానీ కీలక పాత్రలో నటించిన చుంబక్ ఓటీటీ సిరీస్‌లో సీనియర్ నటి నీనా గుప్తా, దేవన్ భోజాని, హెల్లీ షా, మానసి పరేఖ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒకే కాలనీలో నివసించే ఐదు విభిన్నమైన కుటుంబాల మధ్య జరిగే గొడవలు, కామెడీ, ఇరుగుపొరుగు వారి అనుబంధాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

ఒక కుటుంబంలా కలసిమెలసి

"పూర్వపు రోజుల్లో ఇరుగుపొరుగు వారు ఒక కుటుంబంలా కలసిమెలసి ఉండేవారు. ఎలాంటి ఆహ్వానం లేకుండానే ఒకరింటికి మరొకరు వెళ్లి ఆప్యాయతలు పంచుకునేవారు. అలాంటి ఒక అందమైన, అల్లరితో కూడిన నైబర్‌హుడ్ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేయడానికే ఈ ఓటీటీ సిరీస్ తీశాం" అని షో రన్నర్లు జేడీ మజేతియా, అతీష్ కపాడియా పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితమే ఈ వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్‌ను అర్జున్ బిజ్లానీ సోషల్ మీడియాలో పంచుకుంటూ నెట్‌ఫ్లిక్స్ కుటుంబంలో చేరడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు.

రియాలిటీ షోల కింగ్.. అర్జున్ కెరీర్

బుల్లితెర రంగంలో అర్జున్ బిజ్లానీకి మంచి గుర్తింపు ఉంది. 2021లో వచ్చిన 'ఖత్రోన్ కే ఖిలాడీ 11' రియాలిటీ షో టైటిల్ గెలుచుకున్న అర్జున్, ఆ తర్వాత కరణ్ జోహార్ చిత్రం 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ'లోనూ మెరిశారు.

ఇటీవలే అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో వచ్చిన 'రైజ్ అండ్ ఫాల్' రియాలిటీ షోలోనూ విజేతగా నిలిచి తన సత్తా చాటారు అర్జున్ బిజ్లానీ. ఇంతేకాకుండా నాగిన్ తెలుగులో నాగిని సీరియల్‌తో చాలా పాపులర్ అయ్యారు.

అర్జున్ బిజ్లానీ ఇతర సీరియల్స్

మేరీ ఆషికీ తుమ్సే హై, ఇష్క్ మే మర్జావాన్, శక్తి అస్థివా కే ఎహసాస్ కీ, ప్యార్ కీ పెహలా అధ్యాయా వంటి సీరియల్స్‌తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అర్జున్ బిజ్లానీ.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్‌తో

ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘చుంబక్’తో మరోసారి ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More