Ameer Log: మా డైరెక్టర్ అత్తగారి ఇల్లు బస్తీలోనే షూటింగ్, ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన ఆపేవాళ్లం.. అమీర్ లోగ్ హీరోలు
Ameer Log Heroes MC Hari Manoj Shashidhar About Movie: టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమీర్ లోగ్. ఈ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు హీరోలుగా చేశారు. ఆగస్ట్ 21న విడుదల కానున్న అమీర్ లోగ్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ముగ్గురు హీరోలు పంచుకున్నారు. అవేంటో చూద్దాం.
Ameer Log Heroes MC Hari Manoj Shashidhar About Movie: తెలుగులో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు హీరోలుగా నటించిన సినిమా అమీర్ లోగ్. వీరితోపాటు వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. అమీర్ లోగ్ సినిమాను 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించారు.

రానా దగ్గుబాటి సంస్థ
ఈ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' అమీర్ లోగ్ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది.
ఈ క్రమంలో అమీర్ లోగ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోలు ఎంసీ హరి, మనోజ్, శశిధర్ మూవీ విశేషాల్ని పంచుకున్నారు. మరి వారు చెప్పిన సంగతులివే. వీటిపై ఓ లుక్కేద్దాం.
బస్తీలో జీవిస్తున్నట్లుగా
* ‘అమీర్ లోగ్’ ఎంతో నేచురల్‌గా ఉంటుంది. సినిమాని చూసినట్టుగా ఉండదు. హైదరబాద్ బస్తీలోకి వెళ్లినట్టుగా, ఆ బస్తీల్లో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మా డైరెక్టర్ గారి అత్తగారి ఇల్లు, ఆ బస్తీలోనే షూటింగ్ చేశాం. అక్కడి వాళ్లంతా మా అందరినీ ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు.
* సింక్ సౌండ్‌లో ఈ మూవీని చేశాం. అందుకే ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా షూటింగ్ ఆపేవాళ్లం. పైనా విమానం వెళ్లినా, ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఆపేవాళ్లం. రోడ్ల మీద తీసిన సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పాం. అది కూడా దాదాపు ఐదు శాతం మాత్రమే ఉంటుంది.
రియల్ లైఫ్ క్యారెక్టర్లకు దగ్గరిగా
* మేం బస్తీల్లోనే పెరిగాం. తెలంగాణ యాస, బస్తీ లైఫ్ కథ అవ్వడంతో మాకు చాలా సులభంగా మారింది. మా పాత్రలు రియల్ లైఫ్ కారెక్టర్స్‌కి దగ్గరగా అనిపించాయి. రమణ అన్న ఎంతో నేచురల్‌గా, ఎంతో సింపుల్‌గా సినిమాని తీశారు.
* ‘అమీర్ లోగ్’ సినిమాలో బిర్యానీ అనేదే మెయిన్ పాయింట్. ఆ బిర్యానీ చుట్టూనే మా పాత్రలు తిరుగుతాయి. అది ఏంటి అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని చూస్తే బిర్యానీ వాసన వస్తుంది. సెకండాఫ్‌లో బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. క్లైమాక్స్‌కి కడుపు నిండినట్టు అనిపిస్తుంది.
మాకు సీన్స్ లేకుంటే కిచెన్‌కి వెళ్లి పని
* షూటింగ్‌లోనే ఓ క్లౌడ్ కిచెన్ ప్రారంభించాం. అక్కడ వండిన వంటలే అందరం తిన్నాం. మాకు సీన్స్ లేకపోతే కిచెన్‌కి వెళ్లి పని చేసేవాళ్లం. మాకు వంట వండటం కూడా అలవాటు అయింది.
* తెరపై మేం ముగ్గురం ఎక్కువగా కనిపించినా.. మా సినిమాలో మహిళా పాత్రలే కీలకంగా ఉంటాయి. అమ్మానాన్నలు, అక్క, అన్న, వదిన, పక్కింటి పాత్రలు ఇలా అన్ని కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా, అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. మా సినిమా అంతా కూడీ ఫీమేల్ సెంట్రిక్‌గా ఉంటుంది.
అనుకున్నట్లుగా తీయగలిగారు
* ‘అమీర్ లోగ్’ అవుట్ పుట్ చూశారు కాబట్టే మా దర్శకుడు రమణన్న గారు అంత కూల్‌గా ఉంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగారు. సినిమా చూశాక మా అందరికీ ఎంతో కాన్ఫిడెంట్ వచ్చింది. మంచి ప్రొడక్ట్ మా చేతుల్లో ఉంది. దాన్ని ఇలా ప్రమోట్ చేసుకుంటున్నాం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


