Actor Manoj: హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందంటే అమీర్ లోగ్ చూపించండి.. యంగ్ హీరో మనోజ్ కామెంట్స్

Actor Manoj On Ameer Log In Awwal Dawath Song Launch: ముగ్గురు హీరోలు ఒక హీరోయిన్‌తో తెరకెక్కిన హైదరాబాదీ చిత్రం అమీర్ లోగ్. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన అమీర్ లోగ్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటనతోపాటు అవ్వల్ దావత్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jul 26, 2026, 12:29:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actor Manoj On Ameer Log In Awwal Dawath Song Launch: తెలుగులో వస్తున్న సరికొత్త హైదరాబాదీ చిత్రం అమీర్ లోగ్. 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.

హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందంటే అమీర్ లోగ్ చూపించండి.. యంగ్ హీరో మనోజ్ కామెంట్స్
హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందంటే అమీర్ లోగ్ చూపించండి.. యంగ్ హీరో మనోజ్ కామెంట్స్

రానా దగ్గుబాటి సంస్థ ద్వారా రిలీజ్

మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన అమీర్ లోగ్ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా, వేధా జలంధర్ హీరోయిన్‌గా చేశారు. రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర పాత్రలు పోషించారు. అమీర్ లోగ్ సినిమాను ఆగస్ట్ 21న రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుంది.

ఈ సందర్భంగా అమీర్ లోగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు అవ్వల్ దావత్ అనే సాంగ్‌ను కూడా విడుదల చేశారు. ఈ మేరకు జూలై 25న అమీర్ లోగ్ రిలీజ్ డేట్ ప్రకటన, అవ్వాల్ దావత్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బస్తీలోని అందమైన బంధాలను

హీరోయిన్ వేదా జలంధర్ మాట్లాడుతూ .. "‘అమీర్ లోగ్’ ప్రపంచంలోకి అందరినీ స్వాగతించేందుకు మేం ఈ రోజు ఇక్కడకు వచ్చాం. మా డైరెక్టర్ రమణా రెడ్డి గారు బస్తీలోని అందమైన బంధాలను మరింత అందంగా తెరపై చూపించారు. మూవీని చూసిన వారంతా ఇది మా కథే అని రిలేట్ అవుతారు. ఆగస్ట్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అని కోరారు.

"‘అమీర్ లోగ్’ నుంచి ఇప్పుడు రిలీజ్ చేసిన ‘అవ్వల్ దావత్’ సాంగ్ అదిరిపోయింది. ఆగస్ట్ 21న మా సినిమా రాబోతోంది. థియేటర్లోకి వచ్చిన తరువాత మా ప్రపంచంలోకి, మా బస్తీలోకి తీసుకు వెళ్తాం. అందరినీ ఆకట్టుకుంటాం" అని ఆశాభావం వ్యక్తం చేశారు హీరో ఎంసీ హరి.

అమీర్ లోగ్ చూపించండి

అప్‌కమింగ్ హీరో మనోజ్ మాట్లాడుతూ .. "‘అమీర్ లోగ్’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన రమణా రెడ్డి గారికి థాంక్స్. ఈ మూవీ అందరికీ రిలేట్ అవుతుంది. హైదరాబాద్‌లో మనుషులు ఎలా ఉంటారు.. బిర్యానీ ఎలా ఉంటుంది.. క్రికెట్ అంటే ఎంత ప్యాషన్ ఉంటుంది అని ఎవరైనా అడిగితే అందరికీ ‘అమీర్ లోగ్’ సినిమా చూపించండి" అని పేర్కొన్నారు.

శశిధర్ మాట్లాడుతూ .. "‘అమీర్ లోగ్’ నుంచి ఇప్పుడే ‘అవ్వల్ దావత్’ అనే పాటను రిలీజ్ చేశాం. స్మరణ్ అన్న మ్యూజిక్, మనోజ్ అన్న లిరిక్స్, రాహుల్ అన్న గాత్రం అదిరిపోతుంది. ఇది పక్కా తెలుగు, హైదరబాదీ చిత్రం. ఆగస్ట్ 21న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి" అని తెలిపారు.

హైదరాబాద్‌లోని సోల్ చూపించాం

సాయి యోగి మాట్లాడుతూ .. "ప్రపంచంలో హైదరాబాద్ ఎంత ఫేమస్సో.. మా ‘అమీర్ లోగ్’ కూడా అంతే ఫేమస్ అవుతుంది. హైదరాబాద్‌లోని సోల్‌ని ఇందులో చూపించాం. స్మరణ్ సాయి మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. రమణన్న ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు" అని చెప్పారు.

"‘అమీర్ లోగ్’లో పాటలు రాసే అవకాశం ఇచ్చిన రమణా రెడ్డి గారికి, స్మరణ్ అన్నకి థాంక్స్. కట్టర్ హైదరాబాదీ అయిన నేను దక్కనీలో పాటను రాయడం ఆనందంగా ఉంది" అని వెల్లడించారు లిరిసిస్ట్ మనోజ్ కుమార్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More