OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ కామెడీ మూవీ- అత్తగా హీరోయిన్ రాశి- జాతకాల పిచ్చి అల్లుడితో తంటాలు!
Jathi Rathanam OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం జాతిరత్నం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సీనియర్ హీరోయిన్ రాశి అత్తగా, నటుడు శశాంక్ జాతకల పిచ్చి గల అల్లుడుగా నటించారు. సస్పెన్స్, ఎమోషన్స్, కామెడీ కలయికతో తెరకెక్కిన జాతిరత్నం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Jathi Rathanam OTT Release Today: ఇటీవల కాలంలో తెలుగు కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ఎక్కువగానే వస్తున్నాయి. అందులోనూ ప్రతి ఆదివారం సరికొత్త కంటెంట్‌తో తెలుగు ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ (జూలై 26) ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఒకటి రిలీజ్ అయింది.

అత్తగా హీరోయిన్ రాశి
ఆ సినిమా పేరే 'జాతి రత్నం'. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస విజయాలతో అలరించిన నటి రాశి, ప్రతిభావంతుడైన నటుడు శశాంక్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో హీరోయిన్ రాశి అత్తగా చేస్తే.. జాతకాలు పిచ్చి అల్లుడుగా శశాంక్ యాక్ట్ చేశాడు.
అదృష్టం వెంటపడే మనిషి జీవితం
జాతకాలు, మూఢనమ్మకాలు, అదృష్టం వెంటపడే ఒక మనిషి జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. కథానాయకుడు విక్రమ్ తన జీవితాన్ని నక్షత్రాలు, రాశిఫలాలు, దురదృష్టం అనే భయాల చుట్టూ బంధించేసుకుంటాడు.
ప్రతీ చిన్న విషయానికీ అదృష్టాన్నే నమ్ముకునే అతని ప్రవర్తన, ఇంట్లో తీవ్ర వివాదాలకు దారితీస్తుంది. కూతురుని ఇచ్చి అత్తకు తంటాలు తీసుకొస్తుంది. పెళ్లయిన మూడేళ్లకు కూడా బిడ్డకు జన్మనివ్వలేదని, జాతకాలు, నమ్మకాలను పట్టుకుని కూర్చుంటే ఎలా అని కూతురుతో తల్లి రాశి మొరపెట్టుకుంటుంది.
ముహుర్తం కోసం
రోజులు గడిచిన తర్వాత కూతురు గర్భవతి అవుతుంది. దాంతో విక్రమ్ తన జీవితంలో అమితమైన సంతోషాన్ని పొందుతాడు. కానీ, ఓ రోజు అనుకోకుండా విక్రమ్ భార్య ఇంట్లోనే ప్రమాదానికి గురి అవుతుంది. త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, విక్రమ్ మాత్రం అదంతా పట్టించుకోకుండా మంచి ముహుర్తం ఉన్న టైమ్ కోసం ఎదురుచూస్తుంటాడు.
ఆకట్టుకునే సస్పెన్స్..
మరి విక్రమ్ తన భార్యను, బిడ్డను కాపాడుకున్నాడా? జీవితం చావుబతుకుల మధ్య నిలిచినప్పుడు విక్రమ్ తన అంతర్గత భయాలను ఎలా ఎదుర్కొన్నాడు? తన మూఢనమ్మకాల వల్ల చేతికి వచ్చిన అద్భుతాన్ని కోల్పోయాడా లేక తప్పు తెలుసుకుని నిజాన్ని గ్రహించాడా అనేదే ఈ చిత్ర అసలు కథ.
విక్రమ్‌గా శశాంక్, అతని అత్తగా రాశి పోటీపడి నటించారు. 'సై', 'అనుకోకుండా ఒక రోజు' వంటి సినిమాలతో మెప్పించిన శశాంక్, సుదీర్ఘ విరామం తర్వాత ఈ తరహా విభిన్నమైన పాత్రలో కనిపించడం జాతిరత్నం సినిమాకు ఇంట్రెస్టింగ్ విషయం.
అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు
ఈ 'జాతి రత్నం' చిత్రానికి వర ముళ్లపూడి దర్శకత్వం వహించారు. ఆసమ్ శ్రీనివాస్ అందించిన కథను తెరపై ఎంతో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. 24 సినిమా స్ట్రీట్ పతాకంపై అనుపమ చంద్ర కొడూరి, శరత్ చంద్రరెడ్డి గుర్రాల ఈ చిత్రాన్ని నిర్మించారు.
మురళీ మోహన్ చేగు కెమెరా బాధ్యతలు నిర్వహించగా, సాయి మధుకర్ చక్కని సంగీతాన్ని సమకూర్చారు. రాఘవేంద్ర వర్మ ఎడిటర్‌గా వ్యవహరించారు. మాస్టర్ దక్షేష్, అన్విష, మణి కేఎల్కే, రవి బయ్యావరపు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
ఈటీవీ విన్‌లో జాతిరత్నం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ కథా సుధా సిరీస్‌లో భాగంగా ఇవాళ జాతిరత్నం ఓటీటీ రిలీజ్ అయింది. ఎమోషన్స్, సస్పెన్స్, కామెడీ కలగలిపిన మంచి కంటెంట్ సినిమా చూడాలనుకునే వారికి ఈటీవీ విన్ ఓటీటీ మూవీ జాతిరత్నం బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


