Kiran Abbavaram OTT: ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ఎంట్రీ- బిగ్గెస్ట్, సర్‌ప్రైజ్ అవుతారన్న హీరో- 10 రోజుల్లో షూటింగ్ పూర్తి!

Kiran Abbavaram On OTT Entry: చెన్నై లవ్ స్టోరీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాడు. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పిన కిరణ్ అబ్బవరం తన సిరీస్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

Published on: Jul 26, 2026, 09:01:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kiran Abbavaram About OTT Entry: 'క', 'కే-ర్యాంప్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకుని తనదైన ముద్ర వేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కథల ఎంపికలో వేగం కన్నా నాణ్యతకే ప్రాధాన్యమిస్తూ, నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు.

ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ఎంట్రీ- బిగ్గెస్ట్, సర్‌ప్రైజ్ అవుతారన్న హీరో- 10 రోజుల్లో షూటింగ్ పూర్తి!
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ఎంట్రీ- బిగ్గెస్ట్, సర్‌ప్రైజ్ అవుతారన్న హీరో- 10 రోజుల్లో షూటింగ్ పూర్తి!

కిరణ్ అబ్బవరం ఓటీటీ ఎంట్రీ

ఈ క్రమంలోనే తాజాగా చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా చేసిన చెన్నై లవ్ స్టోరీ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఇటీవల జూలై 24న థియేటర్లలో విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

అయితే, చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తున్నారు హీరో హీరోయిన్ కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలిపాడు హీరో కిరణ్ అబ్బవరం. "తమ్మి నువ్వెందుకు వెబ్ సిరీస్‌ల దిక్కు కనబడతలేవు ఎందుకు" అని యాంకర్ అడిగారు.

బిగ్గెస్ట్ వెబ్ సిరీస్

"చేస్తున్న ఇప్పుడు ఒకటి చేస్తున్నా. చాలా బాగుంటది అది, చాలా సర్‌ప్రైజ్ అవుతారు మీరు. భరత్ కమ్మాతో ఒకటి చేస్తున్నా. డియర్ కామ్రెడ్ డైరెక్టర్. అమెజాన్ వాళ్లతో. బిగ్గెస్ట్ వెబ్ సిరీస్. చాలా మంచిగా అవుతోంది" అని హీరో కిరణ్ అబ్బవరం తెలిపాడు.

"షూటింగ్ స్టార్ట్ అయిందా" అని యాంకర్ అడిగితే.. "అయిపోయింది.. ఇంకో పది రోజుల్లో పూర్తిగా అయిపోతుంది" అని కిరణ్ అబ్బవరం చెప్పాడు. దాంతో "హో.. ఒకదాని తర్వాత మరోటి విడుదల చేస్తూనే ఉన్నడు అని నేను చెప్పినగా" అని యాంకర్ తన స్టైల్‌లో అన్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఇలా తన ఓటీటీ ఎంట్రీ సిరీస్‌పై కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అయితే, కిరణ్ అబ్బవరం ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ పేరు "గువ్వల చెరువు ఘాట్". అమెజాన్ ప్రైమ్‌లో గువ్వల చెరువు ఘాట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇది వరకు నాలుగు నెలల క్రితమే ఓటీటీ సిరీస్ గువ్వల చెరువు ఘాట్ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

గువ్వల చెరువు ఘాట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కినట్లు సమాచారం. రాయలసీమ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పగ, ప్రతీకారాలు, రాజకీయం ఈ కథలో ప్రధానాంశాలుగా ఉండనున్నాయని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

పవర్.. ప్రామిస్.. తీరని కసి!

దక్షిణ భారతదేశంలోని గువ్వల చెరువు అనే ఒక ఫ్యూడల్ టౌన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కోల్పోయిన తన సొంత గుర్తింపును, రాజ్యాధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఒక వారసుడు ఎలాంటి వినాశనానికి దారితీశాడు, స్నేహం, ప్రేమ, విధేయతలను ఎలా ఆయుధాలుగా మలుచుకున్నాడనేది ఓటీటీ సిరీస్ కథాంశం.

మొదట ఒక సాధార‌ణ ఫొటోగ్రాఫర్‌గా కనిపించే కిరణ్ అబ్బవరం పాత్ర, ఆ తర్వాత ఊహించని మలుపులు తిరుగుతుంది. "ఈ కంటెంట్ ఏ రోజు బయటకు వస్తుందో తెలీదు కానీ, వచ్చిన రోజు మాత్రం మీరందరూ గర్వంగా ఫీల్ అవుతారు" అని ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.

గువ్వల చెరువు ఘాట్ ఓటీటీ రిలీజ్ డేట్

డ్రీమ్ ఫార్మర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్ ఈదర అత్యంత భారీ వ్యయంతో ఈ తెలుగు వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా మలయాళ భామ, టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఓటీటీలోకి అడుగుపెడుతుండడం విశేషం.

అలాగే, ఈ ఓటీటీ సిరీస్‌లో తిరువీర్, తేజస్వీ రావు, సిద్ధిక్, ఆడుకలం నరేన్, వికాస్ దర్శన్, మహర్షి విద్యా, మంజు భార్గవి, వినోద్ కిషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, గువ్వల చెరువు ఘాట్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More