Chennai Love Story BO: కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి తొలి రోజు 7.56 కోట్లు.. హిట్ కొట్టేందుకు ఎన్ని కోట్లు రావాలంటే?

Chennai Love Story Box Office Collection Day 1: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తొలిరోజే కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టి ఈ సినిమా హిట్ కొట్టాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 25, 2026, 12:39:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chennai Love Story 1st Day Worldwide Box Office Collection: 'కః', 'కే ర్యాంప్' చిత్రాల విజయాల తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా తొలిరోజే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది.

కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి తొలి రోజు 7.56 కోట్లు.. హిట్ కొట్టేందుకు ఎన్ని కోట్లు రావాలంటే?
కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి తొలి రోజు 7.56 కోట్లు.. హిట్ కొట్టేందుకు ఎన్ని కోట్లు రావాలంటే?

జన నాయగన్‌తో పోటీ

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' వంటి భారీ చిత్రం పోటీలో ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో 'చెన్నై లవ్ స్టోరీ' సాధిస్తున్న ఆక్యుపెన్సీ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినిమా మేకర్స్ ముందుగానే నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్లకు మంచి ఆదరణ దక్కడం ఈ చిత్రానికి కలసివచ్చింది.

అనాథగా పెరిగి, సినిమా దర్శకుడు కావాలని కలలుకనే ఓ యువకుడు.. పెళ్లి ఆగిపోయిన బాధ నుంచి కోలుకుంటూ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకునే ఓ యువతి.. వీరిద్దరి మధ్య సాగే ఎమోషనల్ ప్రయాణమే ఈ చిత్ర మూలకథ. ఈ కథ నేటి యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

కలెక్షన్ల సునామీ.. కిరణ్ కెరీర్‌లోనే రికార్డు ఓపెనింగ్స్

విడుదలైన తొలిరోజే 'చెన్నై లవ్ స్టోరీ' ప్రపంచవ్యాప్తంగా రూ. 7.56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రముఖ ట్రేడ్ పోర్టల్ నివేదిక ప్రకారం, భారతదేశ వ్యాప్తంగా మొదటి రోజు చెన్నై లవ్ స్టోరీ సినిమా రూ. 4.40 కోట్ల నెట్ (సుమారు రూ. 5 కోట్ల గ్రాస్) వసూలైంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో దాదాపు రూ. 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ఓపెనింగ్‌గా నిలిచింది.

బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

ఈ చిత్రాన్ని సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, థియేట్రికల్ బిజినెస్ విలువ రూ. 23 కోట్లుగా జరిగింది. చిత్ర నిర్మాతలు నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే పెట్టిన పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని రాబట్టుకున్నారు. ఓటీటీ (OTT) హక్కుల ద్వారా రూ. 4 కోట్లు, ఆడియో హక్కుల ద్వారా రూ. 5 కోట్లు సమకూరినట్లు సమాచారం.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. వీకెండ్ కావడం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ టార్గెట్‌ను సులువుగానే చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

యాక్టింగ్, టెక్నికల్ వేల్యూస్ అద్భుతం

ఎస్ కే ఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరించిన చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి సాయి రాజేష్ అందించిన కథ ప్రధాన బలంగా నిలిచింది. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. ముఖ్యమైన పాత్రలో త్రిగుణ్ ఆకట్టుకున్నారు.

"చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన కృతజ్ఞతలు తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More