Chennai Love Story Review: చెన్నై లవ్ స్టోరీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే? ఆత్మలతో ట్విస్ట్!

Chennai Love Story Review: డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ, ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు హీరో కిరణ అబ్బవరం. 'బేబీ' ఫేమ్ సాయి రాజేష్ కథ-స్క్రీన్‌ప్లే అందించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు థియేటర్లకు వచ్చాడు. మరి ఈ రోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.

Published on: Jul 24, 2026, 18:26:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chennai Love Story Review:

చెన్నై లవ్ స్టోరీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే? ఆత్మలతో ట్విస్ట్! (x/MassMovieMakers)
చెన్నై లవ్ స్టోరీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే? ఆత్మలతో ట్విస్ట్! (x/MassMovieMakers)

సినిమా పేరు : చెన్నై లవ్ స్టోరీ

నటీనటులు : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ తదితరులు

డైరెక్టర్ : రవి నంబూరి

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

ప్రొడ్యూసర్లు : ఎస్కేఎన్, సాయి రాజేశ్

రిలీజ్ డేట్ : జూలై 24, 2026

రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో 'బేబీ' వంటి సంచలన విజయం తర్వాత సాయి రాజేష్ కథందించిన 'చెన్నై లవ్ స్టోరీ'లో అతను నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే ఇక మైక్ అందుకోనంటూ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ సంచలన కామెంట్లు కూడా చేశాడు. మరి ఈ చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎలా ఉంది? కిరణ్ కు మరో హిట్ దక్కిందా? అనేది ఈ రివ్యూలో చూసేయండి.

స్టోరీ ఏంటంటే?

నివేదిత అలియాస్ నివి (శ్రీ గౌరీ ప్రియ) కాలేజీ రోజుల నుంచి అజయ్ (త్రిగుణ్)ను ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ పెళ్లి ముహూర్తానికి ముందు నివికి త్రిగుణ్ బ్రేకప్ చెప్తాడు. దీంతో ఆడ దేవదాసులా నివి మందుకు అలవాటు అవుతుంది. నివి బాధను పోగొట్టేందుకు ఆమె ఫ్రెండ్స్ తనను చెన్నై తీసుకెళ్తారు.

ఇక అనాథ అయిన స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడు కావాలనే కలతో చెన్నై చేరుకుంటాడు. నివి ఫ్రెండ్స్ కారణంగా అతను కూడా వాళ్లతో పాటే ఉంటాడు. ప్రారంభంలో స్టీవెన్ వైఖరి నివేదితకు నచ్చకపోయినా.. అతనిలోని నిజాయితీ, మంచి మనసును చూసి నెమ్మదిగా అతనితో ప్రేమలో పడుతుంది. అంతా సజావుగా సాగుతోందనుకునే లోపే మరో ఊహించని ట్విస్ట్ వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటీ? వీరి ప్రేమకథ ఏ తీరానికి చేరిందనేది మిగతా కథ.

విశ్లేషణ

లవ్ లో ఫెయిల్ అయి మందుకు బానిసలయ్యే అబ్బాయిలను ఎంతోమందిని చూసి ఉంటారు. కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమాలో మాత్రం రివర్స్ జరుగుతుంది. ఇక్కడ అమ్మాయి దేవదాసులా మారుతుంది. అలాంటి అమ్మాయితో పరిచయం, ఆ అమ్మాయిని బాధ తొలగించేందుకు హీరో చేసే ప్రయత్నాలు, తన కల కోసం పడే పాట్లతో ఫస్టాఫ్ సాగిపోతుంది.

ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే షాక్ కలిగిస్తుంది. ఇలా ఫస్టాఫ్ ఎంగేజింగ్ గా, ఫన్నీగా, కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. దీంతో సెకండాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత మూవీ ఆ గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ ను కొనసాగించలేకపోయింది. ఆత్మలు అనే ఫాంటసీ పాయింట్ తేవడంతో కథ అంత కన్విన్సింగ్ గా అనిపించదు.

ఇక నివి కోసం అజయ్ తిరిగి రావడంతో స్టోరీ మళ్లీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కానీ ఎమోషనల్ గా సాగిన క్లైమాక్స్ ఊహించేలా ఉండటం మైనస్ పాయింట్.

యాక్టింగ్

మాస్, కమర్షియల్ పాత్రలను పక్కనపెట్టి కిరణ్ అబ్బవరం ఇందులో చాలా సెటిల్డ్ నటనను కనబరిచాడు. అనాథగా, ఆశయాలు ఉన్న యువకుడిగా ఒదిగిపోయారు. ఇక సినిమాలో శ్రీ గౌరీ ప్రియ యాక్టింగ్ కచ్చితంగా క్లాప్స్ కొట్టిస్తుంది. నివేదిత పాత్రలో శ్రీ గౌరి ప్రియ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో, హృదయ విదారక సన్నివేశాల్లో ఆమె చూపించిన పరిణతి ఆకట్టుకుంటుంది.

టెక్నికల్

మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం (BGM), పాటలు చెన్నై లవ్ స్టోరీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. విశ్వాస్ డేనియల్ కెమెరా పనితనం చెన్నై సముద్రపు తీరాలను విజువల్‌గా చాలా అందంగా చూపించింది. సంతోష్ నాయుడు ఎడిటింగ్ సెకండాఫ్‌లో మరింత పదునుగా ఉండాల్సింది. కత్తిమీద సాములాంటి సంక్లిష్టమైన లవ్ సబ్జెక్ట్‌ను దర్శకుడు రవి నంబూరి పర్వాలేదనిపించేలా హ్యాండిల్ చేశాడు.

ఫైనల్ గా

'చెన్నై లవ్ స్టోరీ' అనేది డిఫరెంట్ పాయింట్‌తో వచ్చిన ఒక డీసెంట్ రొమాంటిక్ డ్రామా. ఆకట్టుకునే ఫస్టాఫ్, మణిశర్మ మ్యూజిక్, కిరణ్ అబ్బవరం - శ్రీ గౌరి ప్రియల అద్భుత నటన ఈ సినిమాకు బలం. సెకండాఫ్‌లో వచ్చే కామెడీ, క్లైమాక్స్ ట్రీట్‌మెంట్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు, కానీ రొమాంటిక్ జోనర్‌లో కొత్త కథలను కోరుకునేవారికి ఇది ఒక మంచి ఛాయిస్.

రేటింగ్: 3 / 5

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More