Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విటర్ రివ్యూ.. ఫస్ట్ హాఫ్ కేక కానీ సెకండాఫ్ అంటూ ఆడియెన్స్ రివ్యూ

Chennai Love Story Twitter Review: కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ లీడ్ రోల్స్ లో నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ శుక్రవారం (జులై 24) థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ఆడియెన్స్ ఎక్స్ (ట్విటర్) ద్వారా తమ రివ్యూలు ఇస్తున్నారు. మూవీ చూడాలనుకునే ముందు వాళ్లు ఏమంటున్నారో చూడండి.

Published on: Jul 24, 2026, 10:19:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chennai Love Story Twitter Review: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. 'బేబీ'లాంటి కల్ట్ హిట్ అందించిన ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. థియేటర్ల నుంచి వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విటర్ (X) రెస్పాన్స్ ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన రాబట్టుకుంటోంది.

Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విటర్ రివ్యూ.. ఫస్ట్ హాఫ్ కేక కానీ సెకండాఫ్ అంటూ ఆడియెన్స్ రివ్యూ
Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విటర్ రివ్యూ.. ఫస్ట్ హాఫ్ కేక కానీ సెకండాఫ్ అంటూ ఆడియెన్స్ రివ్యూ

చెన్నై లవ్ స్టోరీ కథేంటంటే?

చెన్నై లవ్ స్టోరీ మూవీ కథ విషయానికి వస్తే.. నివి (శ్రీ గౌరీ ప్రియా) తనను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు అజయ్ (త్రిగుణ్) పెళ్లి రోజే హ్యాండ్ ఇవ్వడంతో తీవ్రమైన డిప్రెషన్‌కు గురవుతుంది. ఆ బాధను తట్టుకోలేక చెన్నైకి షిఫ్ట్ అయి మద్యానికి బానిసగా మారుతుంది.

ఆ క్రమంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి చెన్నై బీచ్‌లో ఉన్నప్పుడు స్టీవెన్ శంకర్ అలియాస్ దేవుడు (కిరణ్ అబ్బవరం) పరిచయం అవుతాడు. సినిమా డైరెక్టర్ కావాలనే కసిగా తిరిగే స్టీవెన్.. నివి జీవితంలోకి అడుగుపెట్టి ఆమెను ఎలా మార్చాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.

నటన నెక్ట్స్ లెవెల్

సీనియర్ రైటర్ రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా శ్రీ గౌరీ ప్రియా తన సహజసిద్ధమైన నటనతో ఎమోషనల్ సీన్లలో ఒదిగిపోయిందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. బ్రేకప్ బాధను, ఆ తర్వాత మానసిక వేదనను ఆమె ఎక్స్‌ప్రెస్ చేసిన తీరు సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.

మరోవైపు కిరణ్ అబ్బవరం తన క్యారెక్టర్‌లో చాలా మెచ్యూర్డ్‌గా కనిపించినట్లు ఆడియెన్స్ ట్విటర్ లో చెబుతున్నారు. అమాయకత్వం, కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ డ్రామాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు. కిరణ్, శ్రీ గౌరీ ప్రియల మధ్య ఉండే ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మణిశర్మ మ్యాజిక్ కూడా ప్లస్

మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌గా నిలిచాయి. కథలోని ఎమోషన్‌ను తన పవర్‌ఫుల్ మ్యూజిక్ తో మణిశర్మ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీన్లలో రీ-రికార్డింగ్ థియేటర్లలో సీట్‌ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ చెన్నై నగరాన్ని, బీచ్ లొకేషన్స్‌ని చాలా కలర్‌ఫుల్‌గా విజువలైజ్ చేసింది. డైరెక్టర్ రవి నంబూరి లవ్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్ రాసుకోవడంలో తన ప్రతిభను చాటుకున్నాడు.

ప్లస్‌లు, మైనస్‌లు ఏంటంటే?

ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల పరిచయం, క్యూట్ రొమాంటిక్ మోమెంట్స్, కిరణ్ అబ్బవరం కామెడీ మార్క్ సీన్స్‌తో చాలా ఫాస్ట్‌గా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లోకి వచ్చాక కథనం కొంచెం స్లో అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హీరోయిన్ కన్ఫ్యూజన్ సీన్స్, కొన్ని డ్రామా సీన్లను ఎక్కువగా సాగదీయడం వల్ల రన్ టైమ్ పెరిగినట్లు అనిపించిందని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. అయితే ప్రీ-క్లైమాక్స్, లాస్ట్ 20 మినిట్స్ ఎమోషనల్ సీన్స్ మళ్లీ సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాయని ఆడియన్స్ చెబుతున్నారు. రొటీన్ మాస్ ఎలివేషన్స్ కాకుండా క్యారెక్టర్ బేస్డ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి 'చెన్నై లవ్ స్టోరీ' ఒక మంచి ఛాయిస్.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More