థీమ్ వీడియోతోనే సంచలనం.. రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబో.. ఇక సినిమా వస్తే పూనకాలే!
థీమ్ వీడియోతోనే అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ రికార్డుల దుమ్ముదులుపుతున్నారు. వీళ్ల కాంబినేషన్లో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. 23 థీమ్ పేరుతో రిలీజైన ఈ వీడియో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
పుష్ప సినిమాలతో పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో రికార్డులు తిరగరాస్తున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో మూవీ అంటే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. అదే హైప్ ను కొనసాగిస్తూ అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చే మూవీ అనౌన్స్ మెంట్ థీమ్ వీడియోనే హిస్టరీ క్రియేట్ చేసేసింది.

ఏఏ23 థీమ్ వీడియో
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. దీనిపై ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చింది. 23థీమ్ పేరుతో ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అడవిలో జంతువులతో సాగుతూ, చివర్లో గుర్రంపై హీరో ఎంట్రీతో ఉండే ఈ థీమ్ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇప్పుడు కొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
కొత్త హిస్టరీ
అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూవీ థీమ్ వీడియో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా 23థీమ్ వీడియోపై ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ప్లస్ రీల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 1 మిలియన్ రీల్స్ అందుకున్న ఫస్ట్ మూవీ థీమ్ వీడియో ఇదే అని ప్రకటించింది.
‘‘అనౌన్స్ మెంట్ వీడియోతోనే సోషల్ మీడియాలో ఫైర్ పుట్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైెరెక్టర్ లోకేష్. 23థీమ్ వీడియోకు ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ప్లస్ రీల్స్. మిలియన్ రీల్స్ అందుకున్న ఫస్ట్ థీమ్ వీడియో. 2026లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’అని ఎక్స్ లో మైత్రి మూవీ మేకర్స్ పోస్టు చేసింది.
2026లో షూటింగ్
లోకేష్ కనగరాజ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ను 2026లోనే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మరో తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ మూవీ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ కోసం బన్నీ రెడీ కాబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బన్నీవాస్ వర్క్స్ నిర్మిస్తున్నాయి. అనిరుధర్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
అల్లు అర్జున్ లైనప్
అల్లు అర్జున్ లైనప్ క్రేజీగా ఉంది. ఇప్పుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. అనంతరం సుకుమార్ తో పుష్ప 3 ఉంటుందని అంటున్నారు. ఇక సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్ట్ పై రీసెంట్ గా ప్రొడ్యూసర్ క్లారిటీనిచ్చాడు. సినిమా ఉంటుందని పేర్కొన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


