Thriller Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్కీమ్ పేరుతో భారీ స్కామ్..

Thriller Web Series: సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ సామాన్యులను ఎలాంటి కష్టాల్లోకి నెడుతుందో కళ్లకు కట్టేలా అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. 'ది పిరమిడ్ స్కీమ్' పేరుతో వస్తున్న ఈ సిరీస్ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Published on: May 25, 2026, 14:43:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Thriller Web Series: ఈ రోజుల్లో రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే అత్యాశ చాలామందిలో కనిపిస్తోంది. కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలని షార్ట్‌కట్స్ వెతుకుతుంటారు. కానీ ఆ ఈజీ మనీ వెనుక ఎంత పెద్ద మోసం దాగి ఉందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

Thriller Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్కీమ్ పేరుతో భారీ స్కామ్..
Thriller Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్కీమ్ పేరుతో భారీ స్కామ్..

ఇలాంటి మోసాలనే ఇతివృత్తంగా తీసుకుని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక సరికొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అదే 'ది పిరమిడ్ స్కీమ్' (The Pyramid Scheme).

ది పిరమిడ్ స్కీమ్ ఓటీటీ రిలీజ్ డేట్

"సులువుగా వచ్చే డబ్బు.. అంత సులువుగా చేతికి రాదు" (Easy money doesn't come so easily) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ప్రైమ్ వీడియో ఈ వెబ్ సిరీస్‌ను అధికారికంగా ప్రకటించింది. జూన్ 5వ తేదీ నుంచి ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఫైనాన్షియల్ క్రైమ్స్, స్కామ్‌ల నేపథ్యంలో వచ్చే కథలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే ఈ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేయడంతో పాటు ఉత్కంఠకు గురిచేస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ తీసుకొచ్చిన పోస్టర్ కూడా ఆసక్తి రేపుతోంది. పేపర్లలో వచ్చిన స్కామ్ వార్తలను బ్యాక్‌గ్రౌండ్ లో ఉంచి.. ఆపైన ఈ సిరీస్ లో లీడ్ రోల్స్ పోషిస్తున్న పాత్రలను పరిచయం చేసినట్లుగా పోస్టర్ ఉంది.

పిరమిడ్ స్కీమ్ వల ఎలా ఉంటుంది?

మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), చైన్ సిస్టమ్ పేరుతో జనాలను బురిడీ కొట్టించే మోసాలనే ఆర్థిక పరిభాషలో పిరమిడ్ స్కీమ్స్ అంటారు. ముందుగా చేరిన వారు తమ కింద మరికొంతమందిని చేర్పించడం, వారి ద్వారా పెట్టుబడులు పెట్టించడం ద్వారా భారీ కమీషన్లు వస్తాయని ఆశచూపుతారు.

నెట్‌వర్క్‌లో పైన ఉన్న కొద్దిమంది మాత్రమే లాభపడే ఈ స్కామ్‌లో, కింద స్థాయిలో చేరే సామాన్యులు నిండా మునుగుతారు. ఇలాంటి రియల్ లైఫ్ స్కామ్‌లను ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ కథను అల్లినట్లు తెలుస్తోంది.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ల ట్రెండ్

గతంలో పలు ఆర్థిక కుంభకోణాల నేపథ్యంతో వచ్చిన వెబ్ సిరీస్‌లు ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అమాయక ప్రజల ఆశను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు ఎలా పబ్బం గడుపుకుంటారో ఆ కథలు కళ్లకు కట్టాయి. ఇప్పుడు రాబోతున్న 'ది పిరమిడ్ స్కీమ్' కూడా అదే తరహాలో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈజీ మనీ ఆశ చూపి అమాయకులను వలలో వేసుకునే గ్యాంగ్స్, వారి బారిన పడి జీవితాలు నాశనం చేసుకునే బాధితుల ఎమోషన్స్ చుట్టూ ఈ సిరీస్ సాగనుంది.

సస్పెన్స్, క్రైమ్, ఫైనాన్షియల్ థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది. జూన్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ఇంకెన్ని చీకటి నిజాలను బయటపెడుతుందో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

'ది పిరమిడ్ స్కీమ్' వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుంది?

ఈ సరికొత్త వెబ్ సిరీస్ జూన్ 5వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది పిరమిడ్ స్కీమ్ వెబ్ సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది?

ప్రముఖ ఓటీటీ వేదిక 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ది పిరమిడ్ స్కీమ్ వెబ్ సిరీస్ కథాంశం దేని చుట్టూ సాగుతుంది?

సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ, చైన్ సిస్టమ్ లేదా మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్‌ల చుట్టూ అల్లిన ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More