...
...
Next Story

అమితాబ్ బచ్చన్ బ్లాక్‌బస్టర్ సినిమాను ఇబ్బంది పెట్టిన ఓ అండర్‌వేర్ బ్రాండ్.. ఆ మూవీ ఏదో తెలుసా?

అమితాబ్ బచ్చన్ కెరీర్లో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన మూవీ డాన్. అయితే ఈ సినిమాకు ఓ అండర్‌వేర్ బ్రాండ్ వల్ల ఇబ్బందులు తలెత్తాయన్న విషయం మీకు తెలుసా? ఇంతకీ అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోండి.

Published on: Oct 23, 2025, 18:43:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ మూవీ 1978లో విడుదలైన విషయం తెలుసు కదా. ఈ సినిమా అనేక విధాలుగా రికార్డులను బద్దలు కొట్టింది. సినిమా కథ నుండి దాని పాత్రలు, డైలాగ్స్ వరకు అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా చాలా కారణాల వల్ల హెడ్‌లైన్స్‌లో నిలిచింది. కానీ కొన్ని వింత కారణాల వల్ల కూడా ఈ సినిమా గుర్తుండిపోయింది. అలాంటి విచిత్రమైన కారణాలలో ఒకటి ఈ సినిమా టైటిల్. సినిమా పేరు 'డాన్' అని నిర్ణయించినప్పుడు, చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను తీసుకోవడానికి నిరాకరించారు. వారు అలా చేయడానికి గల కారణం కొంచెం వింతగా ఉంది.

డాన్ టైటిల్‌తో ఇబ్బందులు

అమితాబ్ బచ్చన్ బ్లాక్‌బస్టర్ సినిమాను ఇబ్బంది పెట్టిన ఓ అండర్‌వేర్ బ్రాండ్.. ఆ మూవీ ఏదో తెలుసా?
అమితాబ్ బచ్చన్ బ్లాక్‌బస్టర్ సినిమాను ఇబ్బంది పెట్టిన ఓ అండర్‌వేర్ బ్రాండ్.. ఆ మూవీ ఏదో తెలుసా?

అమితాబ్ బచ్చన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన సినిమా డాన్. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమాకు ఓ అండర్‌వేర్ బ్రాండ్ వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఆ రోజుల్లో ఒక అండర్‌వేర్ బ్రాండ్ బాగా ఫేమస్ అయింది. ఆ అండర్‌వేర్ బ్రాండ్‌కు కూడా 'డాన్' అనే పేరే ఉంది. సినిమా పేరు కూడా డాన్ అని పెట్టడంతో.. డిస్ట్రిబ్యూటర్లకు ఆ సినిమాను ఆ అండర్‌వేర్ బ్రాండ్‌తో పోల్చి చూస్తారేమోనని భయం పట్టుకుంది. అందుకే వారు సినిమా కొనేందుకు భయపడ్డారు.

కానీ సినిమా విడుదలయ్యాక అమితాబ్ బచ్చన్ నటన, అతని స్టైల్ ప్రేక్షకుల హృదయాలను ఎంతగా ఆకట్టుకున్నాయంటే.. దశాబ్దాల పాటు బిగ్ బీ నటన, అతడు చెప్పిన డైలాగులను ఎవరూ మరచిపోలేదు. మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. అప్పటి వరకూ ఉన్న బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే..

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు జీనత్ అమన్, ప్రాణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎంత పాపులర్ అంటే చాలా మంది దీనిని చాలాసార్లు చూశారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూడకపోతే.. జీ5 (Zee5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది చూసేయండి.

అమితాబ్ నటించిన డాన్ మూవీని షారుక్ రీమేక్ చేశాడు. ఆ తర్వాత డాన్ 2 కూడా రాగా.. అందులోనూ అతడే లీడ్ రోల్లోనటించాడు. అయితే ఇప్పుడు డాన్ 3 కూడా వస్తోంది. ఇందులో షారుక్ స్థానంలో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్లో రాబోతున్నాడు. ఫర్హాన్ అక్తర్ డాన్ మూడో భాగాన్ని రూపొందించబోతున్నాడు. అమితాబ్, షారుక్ లాంటి నటుల తర్వాత డాన్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ కనిపించనుండటంపై అభిమానులు పెదవి విరిచారు. ఈ ఐకానిక్ రోల్లో షారుక్ కొనసాగి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe