Dhanush: ధనుష్‌కి నేను వీరాభిమానిని.. అతనితో కలిసి నటించడం గొప్ప గౌరవం: అమితాబ్ బచ్చన్
Dhanush: అమితాబ్ బచ్చన్ తాను హోస్ట్ చేస్తున్న ప్రముఖ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' వేదికపై కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 2015లో వచ్చిన 'షమితాబ్' (Shamitabh) సినిమాలో ధనుష్‌తో కలిసి నటించడాన్ని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, ధనుష్‌కు పెద్ద అభిమానినని వెల్లడించారు.
Dhanush: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లెజెండ్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నోటి నుంచి ఒక్క ప్రశంస వస్తే చాలు, ఏ నటుడికైనా అది ఆస్కార్ తో సమానం. అలాంటి బిగ్ బీ.. కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ పై మరోసారి తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో, ధనుష్ నటన, డ్యాన్స్ ప్రతిభను ఆకాశానికెత్తారు.

"నీకూ నాకూ ఒకే పోలిక ఉంది.. నేను కూడా ధనుష్ ఫ్యాన్నే!"
తాజాగా విడుదలైన కేబీసీ ప్రోమోలో, హాట్ సీట్లో కూర్చున్న ఒక కంటెస్టెంట్ తాను తమిళ స్టార్ హీరో ధనుష్‌కు వీరాభిమానినని అమితాబ్‌తో చెప్పాడు. దీనికి అమితాబ్ ఎంతో ఆప్యాయంగా స్పందిస్తూ.. “నువ్వు ధనుష్‌కు పెద్ద అభిమానివని చెప్పావు కదా.. నీకూ నాకూ మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. నేను కూడా ధనుష్‌కు చాలా పెద్ద అభిమానినే” అని అన్నారు.
ధనుష్‌తో కలిసి నటించే అవకాశం మీకు దక్కినందుకు నాకు మీపై అసూయగా ఉందని ఆ కంటెస్టెంట్ సరదాగా అనడంతో అమితాబ్ నవ్వుతూ.. “నేను ధనుష్‌తో తప్పకుండా మాట్లాడతాను, కానీ ఆయన ఫోన్ నంబర్ మాత్రం నీకు ఇవ్వను” అంటూ చమత్కరించారు.
"ధనుష్ ఒక అసాధారణ కళాకారుడు.. తనతో నటించడం నా అదృష్టం"
2015లో ఆర్. బాల్కీ దర్శకత్వంలో వచ్చిన 'షమితాబ్' (Shamitabh) చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధనుష్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ బిగ్ బీ భావోద్వేగంతో మాట్లాడారు.
“నిజాయితీగా చెప్పాలంటే ధనుష్ ఒక అసాధారణమైన కళాకారుడు. ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా, అందులో పూర్తిగా లీనమైపోయి జీవిస్తాడు. అంతేకాకుండా ఆయన చాలా అద్భుతమైన డ్యాన్సర్ కూడా” అని అన్నారు.
“'షమితాబ్' సినిమాలో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నాకు దక్కింది. అది నాకు దక్కిన గొప్ప గౌరవంగా, అదృష్టంగా భావిస్తాను. ఆయన్ను కలవకముందు ధనుష్ గురించి చాలా విన్నాను. కానీ నేరుగా కలిసి పనిచేసిన తర్వాతే ఆయన ప్రతిభ ఏంటో కళ్లారా చూశాను” అని అమితాబ్ ప్రశంసించారు.
'షమితాబ్' జ్ఞాపకాలు.. ధనుష్, బిగ్ బీ తాజా ప్రాజెక్టులు
మాటలు రాని ఒక యువ నటుడికి (ధనుష్), అత్యద్భుతమైన గంభీరమైన గొంతు ఉన్న ఒక వ్యక్తి (అమితాబ్) తన వాయిస్‌ను అరువుగా ఇవ్వడం అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన 'షమితాబ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అక్షర హాసన్ హీరోయిన్గా నటించింది.
ఇక ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ధనుష్ వరుస పాన్-ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర', ఆనంద్ ఎల్ రాయ్ 'తేరే ఇష్క్ మే', తానే స్వయంగా దర్శకత్వం వహించిన 'ఇడ్లీ కడై' చిత్రాలతో అలరించారు.
ఈ ఏడాది 'కర' చిత్రంతో పాటు, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షాలతో కలిసి నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఓం: చాప్టర్ 1 - ఉధిరం - ది బ్లడ్ వుడ్' (OM: Chapter 1) చిత్రంతో నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోవైపు అమితాబ్ బచ్చన్ 'కల్కి 2898 AD', రజనీకాంత్ 'వేట్టయాన్' చిత్రాల తర్వాత కేబీసీ షోతో బిజీగా ఉన్నారు. కల్కి సీక్వెల్ లోనూ నటిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


