Dhanush OM: మమ్ముట్టి అంటేనే థగ్ లైఫ్, చాలా రూడ్ అనుకున్నా.. మెగాస్టార్‌తో 13 ఏళ్ల నాటి సినిమా గురించి చెప్పిన ధనుష్
Dhanush About Mammootty 13 Years Ago Movie: ధనుష్, మమ్ముట్టి కలసి నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'ఓం: ఆపరేషన్ మోల్' ప్రీ-రిలీజ్ వేడుక సందడిగా సాగింది. పదమూడేళ్ల క్రితం మమ్ముట్టిని చూసి దురుసుగా ఉంటారనుకున్నానని, కానీ ఇప్పుడు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి ఫిదా అయ్యానని ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Dhanush About Mammootty 13 Years Ago Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తొలిసారిగా తెరపై కలసి కనిపించబోతున్నారని చాలామంది భావిస్తున్నారు. కానీ, అందులో నిజం లేదు. దాదాపు పదమూడేళ్ల క్రితమే వీరిద్దరూ ఒకే సినిమాలో నటించారు.

ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్
త్వరలో విడుదల కానున్న తమ కొత్త చిత్రం 'ఓం: ఆపరేషన్ మోల్' (OM: Operation Mole) ప్రీ-రిలీజ్ వేడుకలో ధనుష్ ఈ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాడు మమ్ముట్టి ప్రవర్తన చూసి ఆయన చాలా రూడ్‌గా ఉంటారనుకున్నానని ధనుష్ నవ్వుతూ వెల్లడించారు.
'అమరన్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ ఓం చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కీలక పాత్రలు పోషిస్తుండటం, కథ మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరగడం తెలుగు ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తోంది.
మమ్ముట్టి అంటేనే 'థగ్ లైఫ్'
ఓం ప్రీ-రిలీజ్ వేదికపై మమ్ముట్టి గురించి ధనుష్ మాట్లాడుతూ వేడుకలో నవ్వులు పూయించారు. "మమ్ముట్టి సర్ అంటేనే థగ్ లైఫ్.. థగ్ లైఫ్ అంటేనే మమ్ముట్టి సర్" అని ధనుష్ అనగానే పక్కనే ఉన్న మమ్ముట్టి పగలబడి నవ్వారు. ఆయన ఎప్పుడూ సూటిగా సమాధానం చెప్పరని, తనదైన శైలిలో చమత్కరిస్తారని ధనుష్ వివరించారు.
"ఒకసారి నేను ఆయన్ను 'ఎలా ఉన్నారు సర్?' అని అడిగాను. దానికి ఆయన 'నేను ఎలా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు?' అని ఎదురు ప్రశ్నించారు. 'మీరు బాగున్నారనే అనుకుంటున్నాను' అని నేను బదులివ్వగానే.. 'అయితే నేను బాగున్నట్లే లెక్క' అని చమత్కరించారు" అంటూ ధనుష్ ఆసక్తికర సంభాషణను పంచుకున్నారు.
పదమూడేళ్ల క్రితం ఏం జరిగిందంటే?
2013లో విడుదలైన మలయాళ చిత్రం 'ప్రొప్రైటర్స్: కమ్మత్ అండ్ కమ్మత్'లో ధనుష్ ఒక అతిథి పాత్రలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మమ్ముట్టితో తనకు ఎదురైన అనుభవాన్ని ధనుష్ గుర్తుచేసుకున్నారు. "ఆ సమయంలో మమ్ముట్టి సర్‌తో నాకు చాలా తక్కువ పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన మాటతీరు చూసి చాలా దురుసుగా (రూడ్‌గా) ఉంటారని పొరబడ్డాను. ఆయన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఆసక్తితో ఆ తర్వాత ఆయన ఇచ్చిన పాత ఇంటర్వ్యూలు చాలా చూశాను. దురదృష్టవశాత్తూ ఆ సినిమా తర్వాత మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రాలేదు," అని ధనుష్ పేర్కొన్నారు.
అయితే దశాబ్ద కాలం తర్వాత 'ఓం' సినిమా సెట్స్‌లో మమ్ముట్టిని దగ్గరగా చూశాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని ధనుష్ చెప్పారు. "ఆయన్ను కలిసిన మూడు రోజుల్లోనే నా అంచనా తప్పని అర్థమైంది. ఆయన ఎంతో మృదుస్వభావి, వినయం ఉన్న వ్యక్తి. తోటి నటులకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన హాస్యచతురత అద్భుతం" అని ధనుష్ ప్రశంసలు కురిపించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో స్పై థ్రిల్లర్
గతంలో 'రంగూన్', 'అమరన్' చిత్రాలతో ప్రతిభ చాటుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు కథ అందించి దర్శకత్వం వహించారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో ధనుష్ 'పళనివేల్' అలియాస్ ఏజెంట్ డి-402 పాత్రలో కనిపించనున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నడిపే 'బర్మా కార్తికేయన్' అలియాస్ సియా (మమ్ముట్టి) ముఠాలోకి అండర్ కవర్ ఏజెంట్‌గా పళనివేల్ ప్రవేశిస్తాడు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఎదురయ్యే పరిస్థితులు ఆయన విశ్వసనీయతకు పరీక్ష పెడతాయి.
ఓం చిత్రంలో ధనుష్ భార్య రోజా పాత్రలో శ్రీలీల నటించగా, పవర్‌ఫుల్ పోలీస్ అధికారిణి ఏఎస్పీ నిత్యారెడ్డిగా సాయి పల్లవి కనిపించనున్నారు. ఒక బలమైన కారణంతో పళనివేల్ తన మిషన్‌కు వ్యతిరేకంగా మారడం, న్యాయం కోసం ఏఎస్పీ నిత్యారెడ్డి ఆయనను వెంటాడటం వంటి అంశాలతో ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేసింది. నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.
బాక్సాఫీస్ పోటీని తప్పించుకుని..
నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 16నే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే ధనుష్ మాజీ మామయ్య, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించేందుకు విడుదల తేదీని వాయిదా వేశారు.
దీపావళి బరిలో సూర్య నటించిన 'సీన్' చిత్రంతోనూ క్లాష్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు సోలోగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు 'ఓం: ఆపరేషన్ మోల్' సిద్ధమైంది. ఇద్దరు దిగ్గజ నటుల పోటాపోటీ నటన, ఉత్కంఠభరితమైన కథనం వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


