సీన్ రివర్స్- భర్తను భయపెట్టే భార్య-నవ్వించేలా తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతి: ట్రైలర్-ఈ నెలలోనే రిలీజ్

తరుణ్ భాస్కర్ ఓ వైపు డైరెక్షన్ కొనసాగిస్తూనే మరోవైపు లీడ్ రోల్ లో సినిమాలు చేస్తున్నాడు. అతను తాజాగా నటించిన మూవీ ఓం శాంతి శాంతి శాంతి:. ఇవాళ రిలీజైన ఈ మూవీ ట్రైలర్ నవ్విస్తోంది. ఈ చిత్రం ఇదే నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది. 

Published on: Jan 23, 2026, 19:03:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తరుణ్ భాస్కర్.. యూత్ సినిమాలను అందించే డైరెక్టర్ మాత్రమే కాదు మంచి నటుడు కూడా. ఇప్పటికే తన యాక్టింగ్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకున్నాడు తరుణ్. ఇప్పుడు అతను హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతి:’. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్. ఇవాళ (జనవరి 23) ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఓం శాంతి శాంతి శాంతి: సినిమాలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ (youtube)
ఓం శాంతి శాంతి శాంతి: సినిమాలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ (youtube)

ఓం శాంతి శాంతి శాంతి: ట్రైలర్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ఓం శాంతి శాంతి శాంతి:. ఈ మూవీ ట్రైలర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఫుల్ నవ్విస్తోంది ఈ ట్రైలర్. ఈ మూవీకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ ఏమో ఏఆర్ సజీవ్. సృజ‌న్‌, ఆదిత్య, వివేక్, అనూప్, సాధిక్, నవీన్ నిర్మిస్తున్నారు. జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది మలయాళం సూపర్ హిట్ మూవీ ‘జయ జయ జయ జయహే’కు రీమేక్.

నవ్వించేలా

ట్రైలర్ ను బట్టి చూస్తే ఓం శాంతి శాంతి శాంతి: సినిమాను ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. ఇందులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వీళ్ల పెళ్లి చూపుల సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చేపల పేర్లతోనే సీన్లు సాగుతాయి. హీరో, హీరోయిన్ కు పెళ్లి తర్వాత ట్రైలర్ కాస్త ఊపందుకుంది.

భార్యను కొట్టడం

ప్రతి చిన్న విషయానికి హీరో క్యారెక్టర్ ఏమో భార్యను కొడుతుంటాడు. సిగరేట్ తాగుతూ, మందు కొడుతూ కనిపిస్తాడు. మధ్యలో రిప్ అంటే రిచ్ ఇన్ పర్సనాలిటీ అనే డైలాగ్ నవ్విస్తుంది. ఇంట్లో పనులన్నీ చేస్తూ హీరోయిన్ రోజులు గడిపేస్తుంది. కానీ ఆమెను హీరో కొడుతుండటంతో నెక్ట్స్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీ కలుగుతుంది.

సీన్ రివర్స్

భర్త చేతిలో దెబ్బలు తిని విసుగెత్తి పోయిన భార్య ఒక్కసారిగా రెచ్చిపోతుంది. భర్త మీదకు పడిపోతుంది. కొట్టబోతున్న చేతిని ఆపి, ఆమె కొట్టడం స్టార్ట్ చేస్తుంది. దీంతో సీన్ రివర్స్ అవుతుంది. భార్యకు భయపడతాడు భర్త. ప్రశాంతత కోసం ధ్యానం చేస్తుండటంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది.

రిలీజ్ డేట్

ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ఇదే నెలలో థియేటర్లకు రాబోతుంది. జనవరి 30న రిలీజ్ కానుంది. మరోవైపు ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు తరుణ్ భాస్కర్. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో కార్తీక్ క్యారెక్టర్ చేసిన సుశాంత్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. అయినా మూవీలో ఆ క్యారెక్టర్ ఉంటుందని తరుణ్ భాస్కర్ క్లారిటీనిచ్చాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More