OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం హారర్ కామెడీ మూవీ.. రూ.144 కోట్ల వసూళ్లు.. ఐఎండీబీలో 8 రేటింగ్

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మలయాళం హారర్ కామెడీ మూవీ సర్వం మాయ వచ్చేస్తోంది. ప్రేమమ్ హీరో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8 రేటింగ్ రాగా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.130 కోట్లు వసూలు చేయడం విశేషం.

Published on: Jan 23, 2026, 15:20:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రేమమ్ హీరో గుర్తున్నాడా? ఈ సెన్సేషన్ రొమాంటిక్ డ్రామాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు నివిన్ పాలీ. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న అతనికి సర్వం మాయ రూపంలో ఓ బ్లాక్‌బస్టర్ దక్కింది. గతేడాది చివర్లో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం హారర్ కామెడీ మూవీ.. రూ.144 కోట్ల వసూళ్లు.. ఐఎండీబీలో 8 రేటింగ్
OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం హారర్ కామెడీ మూవీ.. రూ.144 కోట్ల వసూళ్లు.. ఐఎండీబీలో 8 రేటింగ్

సర్వం మాయ ఓటీటీ రిలీజ్ డేట్

గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైన మలయాళ హారర్ కామెడీ మూవీ సర్వం మాయ (Sarvam Maya). ఈ సినిమా జనవరి 30 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళ వెర్షనే రానుండటం కాస్త నిరాశ కలిగించేదే.

కానీ త్వరలోనే ఇతర భాషల గురించి కూడా ఆ ఓటీటీ సమాచారం ఇవ్వనుంది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సర్వం మాయ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ రూ.144 కోట్లు వసూలు చేసింది. ఇక ఐఎండీబీలోనూ 8 రేటింగ్ సొంతం చేసుకోవడం చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

సర్వం మాయ సినిమా హైలైట్స్

నివిన్ పాలీ లీడ్ రోల్లో నటించిన ఈ సర్వం మాయ ఓ హారర్ కామెడీ. ప్రభేందు నంబూతిరి (నివిన్ పాలీ) అనే వ్యక్తికి తన సొంత ఊరిలో ఒక దెయ్యంతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళ మధ్య జరిగే ఫన్నీ, భయపెట్టే సంఘటనలే ఈ సినిమా కథ.

ఇందులో రియా షిబు (డెలూలు పాత్రలో), అజు వర్గీస్, జనార్దనన్ కూడా నటించారు. నివిన్-అజు వర్గీస్ కామెడీ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన బలం. 2025లో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో (లోకా, ఎంపురాన్, తుడరుమ్) ఈ 'సర్వం మాయ' చేరిపోయింది.

అలాంటి సినిమా ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇప్పటికే నివిన్ పాలీ నటించిన ఫార్మా అనే వెబ్ సిరీస్ ఇదే ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను తెలుగులోనూ చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More