OTT: అఫీషియల్.. ధనుష్ రొమాంటిక్ డ్రామా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్.. తెలుగులోనూ..

ధనుష్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో నటించిన రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. గతంలోనే ఈ డేట్ కన్ఫమ్ అయినా.. అఫీషియల్ గా ఇప్పుడే వెల్లడించారు.

Published on: Jan 22, 2026, 15:07:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గతేడాది హిందీలో వచ్చి మంచి హిట్ సాధించిన సినిమాల్లో ధనుష్ నటించిన రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే కూడా ఒకటి. ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.

OTT: అఫీషియల్.. ధనుష్ రొమాంటిక్ డ్రామా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్.. తెలుగులోనూ..
OTT: అఫీషియల్.. ధనుష్ రొమాంటిక్ డ్రామా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్.. తెలుగులోనూ..

తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్ డేట్

బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేసిన తేరే ఇష్క్ మే (Tere Ishq Mein) సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. గతేడాది నవంబర్ 28న థియేటర్లలోకి రాగా.. శుక్రవారం అంటే జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గురువారం ఆ ఓటీటీ అధికారికంగా తెలిపింది.

“హృదయాలను కలిపేదే కాదు.. బ్రేక్ చేసేది కూడా అయిన ఆ ప్రేమ వచ్చేస్తోంది. తేరే ఇష్క్ మే నెట్‌ఫ్లిక్స్ లోకి రేపే రానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమా తెలుగులో అమర కావ్యంగా వచ్చింది. ఇప్పుడీ వెర్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. అలాగే తమిళంలోనూ అందుబాటులో ఉంటుంది.

తేరే ఇష్క్ మే మూవీ విశేషాలు

ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన తేరే ఇష్క్ మే మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు సాధించింది. రూ.95 కోట్లతో తెరకెక్కగా.. రూ.150 కోట్ల వరకు వసూలు చేసింది. ధురంధర్ మూవీ సునామీని తట్టుకొని మరీ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. వీటిలో హిందీ వెర్షన్ నుంచే చాలా వరకు వసూళ్లు వచ్చాయి. తెలుగు, తమిళ వెర్షన్లలో పెద్దగా సక్సెస్ కాలేదు.

తన ప్రవర్తన కారణంగా సస్పెండైన ఓ ఎయిర్‌ఫోర్స్ పైలట్, అతన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించే ఓ సైకాలజిస్ట్ స్టూడెంట్ లవ్ స్టోరీయే ఈ తేరే ఇష్క్ మే మూవీ. ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులు పడినా.. ఓవరాల్ గా సినిమాకు అంతగా పాజిటివ్ రివ్యూలు రాలేదు. అయితే ఐఎండీబీలో మాత్రం 7.5 రేటింగ్ నమోదైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయితే ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More