బాలీవుడ్ నుంచి మరో సంచలనం-24 గంటల్లోనే రూ.2.5 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్ సేల్స్-ధురంధర్ ను దాటి-29 ఏళ్లకు సీక్వెల్

బాలీవుడ్ నుంచి మరో సంచలన సినిమా దూసుకొస్తోంది. సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న 'బోర్డర్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ లో అదరగొడుతోంది బోర్డర్ 2. ధురంధర్ ను దాటేసింది. 

Jan 20, 2026, 11:06:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్ బంపర్ విజయంతో బాలీవుడ్ లో కొత్త జోష్ నిండుకుంది. ఇప్పుడు ఆ మూవీ ఇండస్ట్రీ నుంచి మరో సంచలన సినిమా దూసుకోస్తోంది. సన్నీ డియోల్ నటించిన ‘బోర్డర్ 2’ ఈ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించే దిశగా దూసుకుపోతోంది. సోమవారం ప్రారంభమైన ఈ చిత్రం అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో అదరగొడుతోంది.

బోర్డర్ 2లో సన్నీ డియోల్
బోర్డర్ 2లో సన్నీ డియోల్

బోర్డర్ 2 అడ్వాన్స్ కలెక్షన్లు

సన్నీ డియోల్, వరుణ్ ధావన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన బోర్డర్ 2 మూవీ అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో సత్తాచాటుతోంది. కేవలం 24 గంటల్లోనే సన్నీ డియోల్ గత బ్లాక్‌బస్టర్ 'జాట్' మొత్తం అడ్వాన్స్ బుకింగ్‌ను బోర్డర్ అధిగమించింది. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’, పాన్-ఇండియా యాక్షన్ చిత్రం 'వార్ 2' లను కూడా ఇది దాటేసింది.

టికెట్ సేల్స్

సోమవారం (జనవరి 19) ఇండియాలో 'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. మంగళవారం నాటికి, ప్రారంభమైన 24 గంటలు గడిచిన కొద్దిసేపటికే సక్నిల్క్ ప్రకారం ప్రకారం మొదటి రోజు అడ్వాన్స్ టికెట్ సేల్స్ తో కలెక్షన్ రూ.2.5 కోట్లు దాటింది. ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం దేశవ్యాప్తంగా 11000 షోలలో 73 వేల టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి మరిన్ని షోలు తెరిచినప్పుడు, ఈ వేగం మరింత పెరుగుతుంది.

గంటలకు 2 వేలు

మంగళవారం (జవనరి 20) ఉదయం నాటికి బుక్ మై షోలో గంటకు 2 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి, ఈ వేగం ప్రతి గంటకు పెరుగుతోంది. బోర్డర్ 2 మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు సన్నీ డియోల్ గత మూవీ 'జాట్' చిత్రాన్ని ఇప్పటికే దాటిపోయాయి. జాట్ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లో రూ.2.4 కోట్లు వసూలు చేసి, రూ.9 కోట్లతో ఓపెనింగ్ సాధించింది.

ధురంధర్ వెనక్కి

బోర్డర్ 2 మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సేల్స్ లో ధురంధర్ ను దాటేసింది. రణ్ వీర్ సింగ్ ధురంధర్ అడ్వాన్ టికెట్స్ తో ఫస్ట్ డే రూ.1 కోటి సాధించింది. ఇప్పుడు బోర్డర్ 2 రూ.2.4 కోట్లు ఖాతాలో వేసుకోనుంది. సన్నీ డియోల్ గత బ్లాక్‌బస్టర్ 'గదర్ 2' సుమారు రూ.2.2 కోట్లు వసూలు చేసింది.

బోర్డర్ 2 గురించి

జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ 'బోర్డర్' చిత్రానికి బోర్డర్ 2 సీక్వెల్. 2026లో రాబోతున్న ఈ చిత్రం, అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక వార్ డ్రామా మూవీ. చిత్రంలో సన్నీ డియోల్ తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. బోర్డర్ 2 ను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More