Illu Illalu Pillalu: బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేస్థాయికి పడిపోయిన బుల్లితెర మెగాస్టార్-ఇల్లు ఇల్లాలు పిల్లలు రామరాజుపై అలా!
Illu Illalu Pillalu Prabhakar Review On Bigg Boss Telugu 10: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో రామరాజుగా అలరిస్తున్న నటుడు, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. నటుడిగా మంచి క్రేజ్ ఉన్న ప్రభాకర్ ఇటీవల బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్స్ ఆట తీరుపై రివ్యూ ఇవ్వడంపై పలురకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.
Illu Illalu Pillalu Prabhakar Review On Bigg Boss 10 Telugu: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫ్యామిలీ డ్రామాతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది.

ఫ్యామిలీ డ్రామాకు మంచి రేటింగ్
రామరాజు కుటుంబం, నలుగురు కొడుకులు, కోడళ్లు, కూతుళ్లతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాకు రేటింగ్ కూడా బాగా వస్తోంది. ఈ సీరియల్‌లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని, అన్షు రెడ్డి వంటి పాపులర్ స్టార్స్ ఉండటం, వారి నటన హైలెట్‌గా కావండతో ఈ ధారావాహికకు మంచి క్రేజ్ పెరుగుతోంది.
ఇదిలా ఉంటే, బుల్లితెర మెగాస్టార్‌గా నటుడు ప్రభాకర్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ ఉంది. ఈటీవీ నుంచి స్టార్ మా వరకు ఎన్నో సీరియల్స్‌లో హీరోగా, నటుడుగా మెప్పిస్తూ వస్తున్నారు. పలు సినిమాల్లో కీ రోల్స్ సైతం పోషించారు. సీరియల్స్‌లో అతనికి వచ్చిన క్రేజ్‌తో బుల్లితెర మెగాస్టార్ అని ముద్దుగా పిలిచేవారు.
బిగ్ బాస్‌పై ప్రభాకర్ రివ్యూ
అలాంటి ప్రభాకర్ ఇటీవల కాలంలో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లోని కంటెస్టెంట్స్ ఆట తీరుపై రివ్యూ ఇవ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా బిగ్ బాస్‌పై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రామరాజు రివ్యూలు ఇవ్వడాన్ని కొంతమంది మెచ్చుకుంటే మరికొంతమంది విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
సీనియర్ సీరియల్ నటుడు ప్రభాకర్ ఇప్పటికీ బిగ్ బాస్ 10 తెలుగులోని రోహిత్, త్రిగుణ్, శాలిని, సృష్టిల ఆట తీరుపై రివ్యూలు ఇచ్చాడు. అవి కూడా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ షూటింగ్ సెట్ నుంచే ఇచ్చినట్లు ఆ వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది.
రోహిత్ గ్రాఫ్ పడిపోతుంది
రెండు వారాల క్రితం రోహిత్ నాయుడు ఆట తీరుపై ప్రభాకర్ రివ్యూ ఇచ్చాడు. "రోహిత్ గ్రాఫ్ పడిపోతుంది.. అని నేనెందుకు అంటున్నానంటే.. నిన్న టాస్క్‌లో వెళ్లినప్పుడు శాలిని అంది తన (సృష్టి) చేయి పట్టుకుని లాగేద్దామనుకున్నాను. కానీ కుదర్లేదు అని బాధపడింది. క్లియర్‌గా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పింది" అని ప్రభాకర్ చెప్పాడు.
"గేమ్ కోసమే చేసింది తను. గేమ్‌లో చేసిన తప్పులేదేమో కావచ్చు. మనం గెలవాలనుకున్నప్పుడు ఒక్కోసారి అలా చేస్తాం. అది తనను కిందపడేలాని, ఏదో హార్మ్ చేయాలని కాదు. తను కిందపడితే బజర్ దొరుకుతుందనేమో అని శాలిని అలా చెప్పింది" అని ప్రభాకర్ అన్నాడు.
గ్రూప్ అందరికి ఇవ్వరుగా
"ఆ విషయంతో సృష్టిని మైండ్‌ని కూడా పాడు చేశాడు రోహిత్. సృష్టి ఏమాట్లాడుకుండానే తనే మాట్లాడి నువ్వు గెలిచినందుకు హ్యాపీ. కానీ, శాలిని అలా అనడం నాకు నచ్చలేదు. మనలో మనం అలా చేసుకోవడం ఏంటీ అన్నాడు. ఇది బిగ్ బాస్ ఇండివిడ్యువల్ గేమ్. గ్రూప్ గేమ్ కాదు. బజర్ కొడితే ఒక్కరికే ఇస్తారు. గ్రూప్ అందరికి ఇస్తారా లేదుగా" అని ప్రభాకర్ ప్రశ్నించాడు.
"సో తను చెప్పింది కరెక్టే. జెన్యూన్‌గా చెప్పింది. దాన్ని ఇలా నెగెటివ్‌గా చేసి సృష్టికి ఇలా ఇంజెక్ట్ చేయడం నాకు నచ్చలేదు. దానివల్ల అతని గ్రాఫ్ పడిపోతుంది అంటున్నాను. బట్ ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది గేమ్ చూద్దాం" అని రామరాజు రివ్యూ ఇచ్చాడు.
రివ్యూ చెప్పే స్థాయికి దిగిపోయారా
దీనిపై పలువులు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "మరి సెలబ్రిటీలు ఆడేదేంటీ గ్రూప్ గేమ్ కాదా", "ఈ మాటలతో నీ గ్రాఫ్ పడిపోతుంది ప్రభాకర్", "సెలబ్రిటీస్ అంతా ఒకే గ్రూప్ కదా సార్", "సీరియల్ బ్యాచ్", "చివరికి ప్రభాకర్ గారి పరిస్థితి ఇలా ఉందా? బిగ్ బాస్‌కి రివ్యూ చెప్పే స్థాయికి దిగిపోయారా?" అని కామెంట్స్ చేస్తున్నారు.

"మీకు ఎందుకు అవసరమా.. మీ రివ్యూ కరెక్టుగా లేదు సార్. మీరు చీప్ అయిపోతున్నారు సార్", "మీ సెలబ్రిటీలంతా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు కదా సార్", "సెలబ్రిటీలంతా సెలబ్రిటీలకే సపోర్ట్" అంటూ బుల్లితెర ప్రభాకర్ రివ్యూను విమర్శిస్తున్నారు నెటిజన్స్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


