Bigg Boss 10: ఇవాళే బిగ్ బాస్ తెలుగు 10 లాంచ్- 16 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ- రైతుబిడ్డ నుంచి సీరియల్ హీరో వరకు!
Bigg Boss 10 Telugu Contestants Full List: బిగ్ బాస్ 10 తెలుగు ఇవాళ చాలా గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 10కి 16 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. వీరంతా బిగ్ బాస్ స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చి హౌజ్‌లోకి ఎంటర్ అయిపోయారు. రైతుబిడ్డ నుంచి సీరియల్ హీరో వరకు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.
Bigg Boss 10 Telugu Contestants Full List: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున ముగ్గురు హీరోలు హోస్ట్‌గా రాణించిన ఈ బిగ్ బాస్ షో మరో సీజన్‌కు సమయం ఆసన్నమైంది.

ఇవాళ సాయంత్రం 7 గంటలకు
ఇవాళ (సెప్టెంబర్ 6) మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్‌గా లాంచ్ కానుంది. సాయంత్రం 7 గంటలకు అటు స్టార్ మా టీవీ ఛానెల్‌లో ఇటు జియో హాట్‌స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు 10 ప్రసారం కానుంది. ప్రతిసారి సరికొత్త థీమ్‌తో బిగ్ బాస్ షో వస్తోన్న విషయం తెలిసిందే.
ఈసారి బిగ్ బాస్ షో దశవతారం కాన్సెప్ట్‌తో వస్తోంది. ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరా అనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఎన్నో ఊహగానాలు, రూమర్స్ ప్రచారం అయ్యాయి.
ఇదివరకే షూటింగ్ పూర్తి
కానీ, తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‌లోకి అడుగుపెట్టిన ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకొచ్చేసింది. ఈపాటికే అంటే సెప్టెంబర్ 5నే బిగ్ బాస్ 10 తెలుగు లాంచ్ షూటింగ్‌ను మొదలుపెట్టేశారు మేకర్స్. దీంతో ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 10 స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చిన 10 మంది కన్ఫర్మ్‌డ్ కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది.
వారిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ద్వారా సెలెక్ట్ అయిన రైతుబిడ్డ ఝాన్సీ నుంచి సీరియల్ హీరో ముఖేష్ గౌడ వరకు ఉన్న కామనర్స్, సెలబ్రిటీలు ఎవరెవరో, ఎవరు ఎప్పుడు అడుగుపెట్టారో ఆర్డర్ ప్రకారం ఇక్కడ తెలుసుకుందాం.
తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ హీరోయిన్
బిగ్ బాస్ తెలుగు 10లోకి మొదట అడుగుపెట్టిన కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్. ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ దేబ్జానీ మొదటి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చింది.
రెండో కంటెస్టెంట్ పేరు అదిత్ ఈశ్వరన్. నిజానికి అదిత్ ఈశ్వరన్ పేరుతో హీరో ఉన్నాడు. అతనికే త్రిగుణ్ అని కూడా పేరు. ఇటీవలే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పేరు అదిత్ ఈశ్వరన్ అని వినిపిస్తోంది. మరి ఇతను సినిమా హీరో త్రిగుణ్ ఏనా కాదా అనేది తెలియాలాంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.
తొలి కామనర్ కంటెస్టెంట్‌గా ఝాన్సీ
బిగ్ బాస్ 10లోకి మూడో కంటెస్టెంట్‌గా రైతుబిడ్డ ఝాన్సీ అడుగుపెట్టింది. అగ్ని పరీక్ష 2లో టాస్క్‌ల్లో గెలిచి డైరెక్ట్ హౌజ్ ఎంట్రీ టికెట్ దక్కించుకున్న కామనర్ కోటా కంటెస్టెంట్ ఝాన్సీ. నాలుగో కంటెస్టెంట్‌గా మరో కామనర్ అమన్ అడుగుపెట్టాడు. ఇతనికి ఆడియెన్స్ నుంచి అధికంగా ఓటింగ్ రావడం వల్ల సెలెక్ట్ చేసినట్లుగా హోస్ట్ నాగార్జున చెప్పారని సమాచారం.
జబర్దస్త్ షోలో తన ఆటో పంచ్‌లతో నవ్వించిన ఆటో రామ్ ప్రసాద్ ఐదో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టాడు. ఆరో సభ్యుడిగా రోహిత్, ఏడో కంటెస్టెంట్‌గా మరో సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చారు. అత్తారింట్లో అక్కాచెళ్లెల్లు సీరియల్‌లో హీరోయిన్‌గా చైత్ర రాయ్ తెగ పాపులర్ అయింది.
టెంపర్ వంశీ-జబర్దస్త్ నరేష్
ఇక 8వ కంటెస్టెంట్‌గా టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ అడుగుపెట్టాడు. ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటుడిగా టెంపర్ వంశీ మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. 9వ సభ్యుడిగా మరో జబర్దస్త్ కమెడియన్ నరేష్ అడుగుపెట్టాడు.
బిగ్ బాస్ సీజన్ నెంబర్ 10వ కంటెస్టెంట్‌గా బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 11వ కంటెస్టెంట్‌గా కామనర్ చరణ్ అధికంగా ఓటింగ్‌తో సెలెక్ట్ అయ్యాడు. 12వ కంటెస్టెంట్‌గా అధాన్ టాక్స్ యాంకర్ సుధీర్ రెడ్డికి అవకాశం వచ్చింది.
నవదీప్, శ్రీముఖి సెలెక్ట్ చేసిన కామనర్స్
13వ కంటెస్టెంట్‌గా మరో కామనర్ శాలినికి అగ్ని పరీక్ష 2 జడ్జిగా నవదీప్ అవకాశం ఇవ్వగా, 14వ సభ్యుడిగా నటుడు కృష్ణుడు అడుగుపెట్టాడు. విలేజ్‌లో వినాయకుడు సినిమాలో హీరోగా, హ్యాపీడేస్ మూవీలో సీనియర్‌గా కృష్ణుడు అందరికి సుపరిచితమే. ఇక 15వ కంటెస్టెంట్‌గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.
16వ కంటెస్టెంట్‌గా కామనర్ అయిన శ్రష్టిని అగ్ని పరీక్ష 2 హోస్ట్ శ్రీముఖి సెలెక్ట్ చేసిందని సమాచారం. ఇలా ఇప్పటివరకు బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‌లోకి 16 మంది ఫైనల్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అయితే, అగ్ని పరీక్ష 2లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన రామకృష్ణ, అపూర్వలను వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


