OTT Telugu: ఓటీటీలో 300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్- తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌కు పార్ట్ 2- ప్రతివారం 5 ఎపిసోడ్స్
Veerabhadruni Rahasyam 2 OTT Streaming: ఓటీటీలో 300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో రికార్డు సృష్టించిన తెలుగు డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా సిరీస్ వీరభద్రుని రహస్యం పార్ట్ 2 రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రతి వారం 5 ఎపిసోడ్లతో వీరభద్రుని రహస్యం 2 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.
Veerabhadruni Rahasyam 2 OTT Release: డిజిటల్ వినోద ప్రపంచంలో తెలుగు ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' సరికొత్త మైలురాయిని చేరుకుంది. జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌పై ప్రసారమవుతున్న ఈ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ మొదటి భాగం బంపర్ హిట్ సాధించింది.

ఓటీటీలోకి వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 కూడా
ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ ఆదరణతో ఇప్పుడు వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. తాజాగా వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం డిజిటల్ కంటెంట్‌లో సస్పెన్స్, దైవిక అంశాలతో కూడిన మిస్టరీ కథలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అదే కోవలో లాంగ్ ఫార్మాట్‌లో రూపుదిద్దుకున్న 'వీరభద్రుని రహస్యం' వీక్షకులను కట్టిపడేస్తోంది. మొదటి భాగంలో ప్రసారమైన 30 ఎపిసోడ్లు ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి.
300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సంచలనం
వీరభద్రుని రహస్యం సీజన్ 1 ఓటీటీ రిలీజ్ అయిన అతి స్వల్ప కాలంలోనే ఏకంగా 300 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదు చేసి, ఈ ఏడాది డిజిటల్ స్పేస్‌లో అత్యధికంగా చూసిన లాంగ్ ఫార్మాట్ వెబ్ సిరీస్‌గా రికార్డు సృష్టించింది.
ఇకపై ప్రతివారం 5 ఎపిసోడ్లు
ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ మేకర్స్ కొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి జీ5 ఓటీటీలోకి వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ పార్ట్ 2లో ప్రతి వారం బుధవారం రోజున ఏకంగా 5 ఎపిసోడ్లను ఒకేసారి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.
దీనికి సంబంధించిన సరికొత్త వీరభద్రుని రహస్యం పార్ట్ 1 ట్రైలర్‌ను శుక్రవారం (సెప్టెంబర్ 4) విడుదల చేశారు. 90ల కాలంలో బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఐకానిక్ సీరియల్ 'మర్మదేశం' తరహాలో ఈ సిరీస్‌ను రీ-క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అదృశ్య శక్తులు, రహస్యాల చుట్టూ తిరిగే ఈ కథనాన్ని దర్శకుడు భీమగాని శ్రీవర్థన్ రెడ్డి ఎంతో ఆసక్తికరంగా మలిచారు.
ఓటీటీ సిరీస్‌పై ప్రశంసలు
ఈ ఓటీటీ సిరీస్ సాధించిన విజయానికి సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాత నిహారిక కొణిదెల స్పందిస్తూ.. "కి మీడిగయా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కల్కి రాజా నిర్మించిన ఈ సిరీస్ అందరినీ అలరిస్తోంది. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన షో ఇది" అని పేర్కొన్నారు.
"జీ5 సమర్పణలో కల్కి రాజా నిర్మించిన 'వీరభద్రుని రహస్యం' అద్భుతంగా ఉంది. ప్రతీ వారం వస్తున్న ఎపిసోడ్లు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. 90వ దశకంలో ఆకట్టుకున్న 'మర్మదేశం' సీరియల్‌ను మళ్లీ చూస్తున్న భావన కలిగింది. థ్రిల్ కోరుకునే వారు తప్పక చూడాల్సిన సిరీస్ ఇది" అని మెగా బ్రదర్ నాగబాబు కొనియాడారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


