OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్, అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక- 2 వేర్వేరు కథలు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Im Game OTT Ramba Oorvasi Menaka OTT: నిన్న థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అవే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్, అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక. 2 వేర్వేరు కథలతో సాగే ఈ రెండు సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Im Game And Ramba Oorvasi Menaka OTT Release: థియేటర్లలో సినిమాలు విడుదల అయ్యాయంటే చాలు వాటి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. థియేటర్లలో సినిమాలను ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి బదులుగా ఓటీటీలోకి వచ్చాక ఇంట్లోనే హాయిగా ఫ్యామిలీతో చూసేద్దామనుకునే ఆడియెన్స్ ఎక్కువగానే ఉన్నారు.

థియేటర్లలోకి వచ్చిన సినిమాల ఓటీటీలు
అలాంటి ఆడియెన్స్ కోసమే అన్నట్లుగా ఇలా థియేటర్లలోకి వచ్చిన సినిమాల ఓటీటీ వివరాలు అలా బయటకు వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలోనే నిన్న (సెప్టెంబర్ 4) థియేటర్లలో విడుదలైన రెండు క్రేజీ సినిమాల ఓటీటీ డీటేల్స్ బయటకు వచ్చేశాయి.
ఆ రెండు సినిమాలే ఐయామ్ గేమ్ అండ్ రంభ ఊర్వశి మేనక. రెండు వేర్వేరు కథలతో ఈ సినిమాలు తెరకెక్కాయి. మరి ఈ రెండింటి ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐయామ్ గేమ్ ఓటీటీ
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం, లక్కీ భాస్కర్ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఆయన నటించిన క్రైమ్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఐయామ్ గేమ్.
ఐయామ్ గేమ్ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉందని కామెంట్స్ వచ్చాయి. అంతేకాకుండా సినిమా ఫస్టాఫ్ అంతా చాలా క్రేజీగా మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిందని ప్రశంసలు వచ్చాయి.
ఐయామ్ గేమ్ ఓటీటీ రిలీజ్ డేట్
కానీ, సెకండాఫ్ మాత్రం అనసవరమైన ల్యాగ్‌తో విసిగించేశారని విమర్శలు వస్తున్నాయి. ఫస్టాఫ్ ఎంత కిక్కించిందో సెకండాఫ్ అంత పడుకోబెట్టేసిందని చూసిన ఆడియెన్స్ అంటున్నారు. అలాంటి ఐయామ్ గేమ్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఐయామ్ గేమ్ ఓటీటీ హక్కులను జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసిందని సమాచారం.
ఈ లెక్కన జియో హాట్‌స్టార్‌లో ఐయామ్ గేమ్ ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం వంటి 5 భాషల్లో ఐయామ్ గేమ్ ఓటీటీలో అందుబాటులో ఉండనుందట. అంతేకాకుండా అక్టోబర్ 16 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఐయామ్ గేమ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.
రంభ ఊర్వశి మేనక ఓటీటీ
ఇక సెప్టెంబర్ 4న విడుదలైన మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. అల్లరి నరేష్ హీరోగా సురభి హీరోయిన్‌గా రాశి సింగ్, యాంకర్ విష్ణుప్రియ, ప్రిషా సింగ్ దేవకన్యలుగా నటించిన ఈ సినిమాకు చంద్రమోహన్ చింతడ దర్శకత్వం వహించారు.
కామెడీ రొటీన్‌గా ఉన్నా చాలా వరకు నవ్వించారని, యూనిక్ పాయింట్‌ను రెగ్యులర్ ఫార్మాట్‌లో తీసుకెళ్లారని ఈ సినిమాకు టాక్ వస్తోంది. తెలుగు సోషియో ఫాంటసీ కామెడీ మూవీగా వచ్చిన రంభ ఊర్వశి మేనక ఓటీటీలోకి వచ్చేయనుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. ఇలా చూసుకుంటే అమెజాన్ ప్రైమ్‌లోనే రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే, రంభ ఊర్వశి మేనక ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.
ఇలా ఒకేరోజు థియేటర్లలో విడుదలైన ఈ రెండు సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ రెండు సినిమాల కథలు వేరు అయినప్పటికీ ఫాంటసీ అనే ఒక్క ఎలిమెంట్ సేమ్‌గా ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


