I'm Game Review: ఐయామ్ గేమ్ రివ్యూ.. పీక్ ఫస్టాఫ్.. వీక్ సెకండాఫ్.. మరి బాక్సాఫీస్ గేమ్‌లో దుల్క‌ర్ సల్మాన్ గెలిచాడా?

I'm Game Review: నేచురల్ యాక్టింగ్ తో తెలుగులోనూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన మలయాళ మూవీ ‘ఐయామ్ గేమ్’ తాజాగా థియేటర్లలో రిలీజైంది. మరి మూవీ ఎలా ఉంది? బాక్సాఫీస్ గేమ్ లో దుల్కర్ సల్మాన్ విక్టరీ కొట్టాడా? అనేది ఐయామ్ రివ్యూలో చూసేయండి. 

Published on: Sep 4, 2026, 09:09:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

I'm Game Review:

ఐయామ్ గేమ్ రివ్యూ.. పీక్ ఫస్టాఫ్.. వీక్ సెకండాఫ్.. మరి బాక్సాఫీస్ గేమ్‌లో దుల్క‌ర్ సల్మాన్ గెలిచాడా? (x/DQsWayfarerFilm)
ఐయామ్ గేమ్ రివ్యూ.. పీక్ ఫస్టాఫ్.. వీక్ సెకండాఫ్.. మరి బాక్సాఫీస్ గేమ్‌లో దుల్క‌ర్ సల్మాన్ గెలిచాడా? (x/DQsWayfarerFilm)

సినిమా పేరు: ఐయామ్ గేమ్ (I'm Game)

నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథ్ తదితరులు

డైరెక్టర్: నహాస్ హిదాయత్

ప్రొడ్యూసర్: దుల్కర్ సల్మాన్ (వేఫారర్ ఫిల్మ్స్)

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 03, 2026

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘ఐయామ్ గేమ్’ (I'm Game). ‘ఆర్డీఎక్స్’ (RDX) వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.

టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా తెలుగులో ఆలస్యంగా రిలీజైంది. ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? 'ఆర్డీఎక్స్' స్థాయి యాక్షన్ మ్యాజిక్‌ను నహాస్ మళ్లీ రిపీట్ చేశారా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.

కథేంటంటే?

డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) ఒక గ్యాంబ్లర్. ప్రతి విషయంలో బెట్టింగ్ కాస్తుంటాడు. ఇలా జూదంలో తన దగ్గరున్న సొమ్మంతా పోగొట్టుకుని తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోతాడు. ఎలాగైనా పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించాలనే ఆశతో క్రికెట్ బెట్టింగ్‌లోకి దిగుతాడు. అయితే అక్కడ మిగిలిన కాస్త డబ్బును కూడా పోగొట్టుకుంటాడు. ఆవేశంలో పెద్ద గొడవ చేస్తాడు.

ఆ గొడవలో జాన్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోతాడు. చాలా కాలం తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చిన జాన్ లో ఒక వింతైన మార్పు కనిపిస్తుంది. అసలు జాన్ కు ఏమైంది? తన జీవితంలో ఎదురైన ఊహించని సవాళ్ల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే 'ఐయామ్ గేమ్' మూవీ స్టోరీ.

విశ్లేషణ:

వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో దుల్కర్ సల్మాన్‌ స్టైలే వేరు. స్టోరీ సెలక్షన్ లోనూ అతని రూట్ సెపరేట్. ఇప్పుడు ఐయామ్ గేమ్ విషయంలోనూ దుల్కర్ అదే చేశాడు. ఈ మూవీ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది.

అయితే సినిమా స్టోరీ లైన్ కొత్తగా ఉన్నప్పటికీ, దానిని తెరపై ఆవిష్కరించిన తీరు సాధారణంగా సాగుతుంది. ఐయామ్ గేమ్ సినిమాలో ఫస్టాఫ్ అదిరిపోయింది. మధ్యలో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ పై అంచనాలు పెంచేస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం తుస్సుమనిపించింది.

యాక్షన్ సీన్స్ ఎంటర్ టైన్ చేసినప్పటికీ ఆ తర్వాత ఏం జరగబోతోందో ముందే అర్థమైపోవడంతో మూవీ విసుగు తెప్పిస్తుంది. ఇక క్రికెట్ బెట్టింగ్ నేపథ్యం గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇందులో కొత్త పాయింట్ ఏం చూపించలేదు. సినిమా రన్ టైమ్ మరో సమస్య. దాదాపు మూడు గంటల నిడివి ఈ కథకు అవసరం లేదు.

ఒక 20 నుంచి 30 నిమిషాల సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించి ఉంటే ఐయామ్ గేమ్ మరో లెవల్లో ఉండేది. ముఖ్యంగా దుల్కర్ స్క్రీన్ మీద కనిపించకుండా సాగే లెంగ్తీ సీన్లు మైనస్ గా మారాయి.

ఎవరెలా చేశారంటే?

ఛాలెంజింగ్ రోల్స్ ను దుల్కర్ సల్మాన్ ఈజీగా చేసేస్తుంటాడు. ఈ ఐయామ్ గేమ్ మూవీని కూడా తన భుజాలపై మోశాడు దుల్కర్. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో అతని కష్టం ఆడియన్స్ తో విజిల్స్ కొట్టిస్తుంది.

హీరోయిన్ కాయదు లోహర్ స్క్రీన్‌పై చాలా అందంగా కనిపించింది. దుల్కర్‌తో ఆమె సీన్లు ఆకట్టుకుంటాయి. విలన్ పాత్రలో తమిళ దర్శకుడు, నటుడు మిస్కిన్ తన పాత్రకు న్యాయం చేశాడు. చిన్న పాత్రలోనే కనిపించినా సంయుక్త విశ్వనాథ్ ఆకట్టుకుంది. సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చే ఆంటోనీ వర్గీస్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో మెప్పించారు.

టెక్నికల్ గా

'ఆర్డీఎక్స్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నహాస్ హిదాయత్ ఒక మంచి ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమాను ప్రారంభించినప్పటికీ, దానిని చివరివరకు ఉత్కంఠభరితంగా నడిపించడంలో కొంత తడబడ్డాడు. సెకండాఫ్ లో స్క్రీన్‌ప్లేపై ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది.

జేక్స్ బిజోయ్ అందించిన బీజీఎం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ థియేటర్‌లో మంచి ఎనర్జీ తెచ్చింది. జిమ్షి ఖాలిద్ కెమెరా పనితనం సినిమాను గ్రాండ్‌గా, విజువల్‌గా రిచ్‌గా చూపించింది. ఎడిటర్ చమన్ చాకో ఇంకా బెటర్ గా మూవీని కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉండి సినిమాకు సరైన థియేట్రికల్ లుక్ ఇచ్చాయి.

ఫైనల్ గా

ఫైనల్ గా చెప్పాలంటే.. 'ఐయామ్ గేమ్' సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చినా, ఆర్డినరీ కథనం వల్ల పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. దుల్కర్ సల్మాన్ నటన, సాంకేతిక బృందం శ్రమ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. సెకండాఫ్ దెబ్బకొట్టింది. కొత్త రకం యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లు ఈ మూవీని ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More