Malayalam OTT: ఇవాళ ఒకేసారి 5 ఓటీటీల్లోకి వచ్చేసిన మలయాళ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. సునీల్, అజయ్, రెజీనా కీ రోల్స్!

Malayalam OTT: ఓ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ఒకేసారి ఏకంగా 5 ఓటీటీల్లోకి వచ్చేసింది. ఈ రోజు డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో తెలుగు నటులు సునీల్,  అజయ్ తో పాటు రెజీనా కూడా కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ పూర్తి ఓటీటీ వివరాలను ఇక్కడ చూసేయండి. 

Published on: Sep 2, 2026, 13:44:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Malayalam OTT: కోలీవుడ్ వర్సటైల్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ (Ananthan Kaadu) ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో జూన్ 25న విడుదలై హిట్ గా నిలిచిన ఈ మూవీ.. ఒకేసారి 5 ఓటీటీల్లో రిలీజైంది. జియేన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో టాలీవుడ్ నటుడు సునీల్, రెజీనా కసాండ్రా, అజయ్ కీలక పాత్రలు పోషించారు.

ఇవాళ ఒకేసారి 5 ఓటీటీల్లోకి వచ్చేసిన మలయాళ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. సునీల్, అజయ్, రెజీనా కీ రోల్స్!
ఇవాళ ఒకేసారి 5 ఓటీటీల్లోకి వచ్చేసిన మలయాళ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. సునీల్, అజయ్, రెజీనా కీ రోల్స్!

5 ఓటీటీల్లో రిలీజ్

సాధారణంగా సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ హక్కులు పొందుతాయి. కానీ ‘అనంతన్ కాడు’ చిత్రం ఆడియన్స్‌కు విస్తృతమైన యాక్సెస్ కల్పిస్తూ ఒకేసారి ఐదు ఓటీటీలలో డిజిటల్ ప్రిమియర్ కావడం విశేషం.

ప్రైమ్ వీడియో (Amazon Prime Video), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play), మనోరమ మ్యాక్స్ (ManoramaMAX), సింప్లీ సౌత్ (Simply South), ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో ఈ మూవీ ఈ రోజు (సెప్టెంబర్ 2) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళంలోనూ

యాక్షన్ థ్రిల్లర్ అనంతన్ కాడు తమిళం, మలయాళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. ఈ యాక్షన్ డ్రామాను సౌత్ ఆడియన్స్ కోసం సబ్‌టైటిల్స్, డబ్బింగ్ ఆడియోలతో ఓటీటీలలో అందుబాటులో ఉంచారు.

అదే ట్విస్ట్

అనంతన్ కాడు సినిమా కథాంశం సాధారణ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు భిన్నంగా 90ల నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగుతుంది.

1990ల కాలంలో తిరువనంతపురంలో జరిగే ఘటనల ఆధారంగా కథ నడుస్తుంది. స్థానిక వీధి రౌడీలు ఒక ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు శ్రీలంక తమిళ తిరుగుబాటుదారుడితో చేతులు కలపడం ఈ చిత్రంలోని ముఖ్యమైన ట్విస్ట్.

శ్రీలంకన్ తమిళన్‌గా ఆర్య!

ఈ చిత్రంలో ఆర్య ‘శ్రీలంకన్ తమిళన్’ పాత్రలో కనిపించారు. ఆయన లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అండ్ విలన్ సునీల్, రెజినా కసాండ్రా, అజయ్, నిఖిలా విమల్, దేవ్ మోహన్, ఇంద్రన్స్, విజయరాఘవన్, అచ్యుత్ కుమార్, శాంతి బాలచంద్రన్ వంటి సీనియర్ నటులు అనంతన్ కాడు కీలక పాత్రలు పోషించారు.

‘తియాన్’ కాంబో రీ-యూనియన్

పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘తియాన్’ (Tiyaan) చిత్రం తర్వాత దర్శకుడు జియేన్ కృష్ణకుమార్, రచయిత మురళి గోపి మళ్లీ కలిసి పనిచేసిన ప్రాజెక్ట్ ఇది.

‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

వాళ్లకు పర్ఫెక్ట్

థియేట్రికల్ రన్‌కు, డిజిటల్ వాచింగ్‌కు చాలా తేడా ఉంటుంది. రా పీరియాడిక్ డ్రామాలు, శ్రీలంకన్ ఇష్యూస్, గ్యాంగ్‌స్టర్ పొలిటికల్ డ్రామాలను ఇంట్లో ప్రశాంతంగా చూసే ఓటీటీ వీక్షకులకు ‘అనంతన్ కాడు’ ఒక మంచి సీరియస్ యాక్షన్ వాచ్‌గా మారే అవకాశం ఉంది.

తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న సునీల్, అజయ్, రెజీనా డిఫరెంట్ రోల్స్‌లో కనిపించడం వల్ల టాలీవుడ్ ఓటీటీ ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై ఆసక్తి వ్యక్తమవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More