OTT Review: ప్రైమ్ వీడియో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చిన్ననాటి ఫ్రెండ్ హత్య మిస్టరీ.. నిమిషా సజయన్ సినిమా ఎలా ఉందంటే?

OTT Movie Review: ఓటీటీలోకి నేరుగా వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ బబితా సింగ్ రిపోర్టింగ్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో నిమిషా సజయన్ లీడ్ రోల్లో నటించింది. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Published on: Aug 28, 2026, 15:24:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Movie Review: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శుక్రవారం (ఆగస్ట్ 28) ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'బబితా సింగ్ రిపోర్టింగ్' (Babita Singh Reporting) ఆడియన్స్ ను తొలి రోజే ఆకట్టుకుంటోంది. మలయాళ స్టార్ హీరోయిన్ నిమిష సజయన్, పాపులర్ నటుడు బరుణ్ సోబ్టి కాంబోలో వచ్చిన ఈ మూవీ ఓటీటీ లవర్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

OTT Review: ప్రైమ్ వీడియో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చిన్ననాటి ఫ్రెండ్ హత్య మిస్టరీ.. నిమిషా సజయన్ సినిమా ఎలా ఉందంటే?
OTT Review: ప్రైమ్ వీడియో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చిన్ననాటి ఫ్రెండ్ హత్య మిస్టరీ.. నిమిషా సజయన్ సినిమా ఎలా ఉందంటే?

బబితా సింగ్ రిపోర్టింగ్ మూవీ కథేంటి?

ఢిల్లీ క్రైమ్, దహాడ్, ఆర్యనాక్ లాంటి విమెన్ సెంట్రిక్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు ఓటీటీలో ఇప్పటికే చాలానే వచ్చాయి. కానీ డైరెక్టర్ అంబికా పండిత్ తెరకెక్కించిన 'బబితా సింగ్ రిపోర్టింగ్' ఒక రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. బబిత అలియాస్ బేబీ (నిమిష సజయన్).. పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తన తండ్రి డ్యూటీలో చనిపోవడంతో కారుణ్య నియామకాల్లో భాగంగా ఏఎస్ఐ ఉద్యోగం సంపాదిస్తుంది. ఏ తప్పూ చేయకపోయినా సడన్‌గా సస్పెన్షన్‌కు గురైన బబిత.. తన సొంత ఊరికి వెళ్తుంది. అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు బన్సి (బరుణ్ సోబ్టి) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని తెలుస్తుంది. ఈ విషాదం వెనక ఉన్న నిజాన్ని బయటపెట్టడానికి బబిత ఏం చేసింది అనేది మిగతా స్టోరీ.

నిమిష సజయన్ నటనే మూవీకి హైలైట్

ఈ బబితా సింగ్ రిపోర్టింగ్ సినిమాలో ప్రధాన బలం నటీనటుల పర్ఫార్మెన్స్. నిమిష సజయన్ బబిత క్యారెక్టర్‌లో జీవించేసింది. ఎక్కడా సూపర్ పోలీస్ బిల్డప్‌లు లేకుండా, చాలా సాధారణ ఆఫీసర్‌లా నేచురల్ యాక్టింగ్‌తో సీన్స్ పండించింది. బేబీ శరీర ఆకారంపై, బరువుపై చుట్టుపక్కల వాళ్లు చేసే కామెంట్స్‌ను తట్టుకుంటూ ఆమె చేసే ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది.

ఇక బరుణ్ సోబ్టి స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ తన క్యారెక్టర్‌తో మంచి ప్రభావం చూపించాడు. భర్త శరద్ రోల్‌లో అన్షుమాన్ పుష్కర్, అత్తగా సునీతా రాజ్‌వర్, ఎస్ఐ సేఠీగా రాజేష్ శర్మ తమ రోల్స్‌కు పూర్తి న్యాయం చేశారు.

సినిమాలో మైనస్ పాయింట్లు

ఈ మూవీకి ప్రధానంగా మైనస్ పాయింట్ ఎడిటింగ్. దాదాపు 2 గంటల 30 నిమిషాల రన్‌టైమ్ సినిమాకు కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు మళ్లీ మళ్లీ వస్తున్నట్లుగా ఉండి నెమ్మదిగా సాగుతాయి. ఈ సినిమాను కనీసం మరో 15 నిమిషాల వరకు ట్రిమ్ చేసి ఉంటే ఆడియెన్స్ కు ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది.

అయినా కూడా డైరెక్టర్ అంబికా పండిత్ టేకింగ్, కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటాయి. ఎమోషన్స్ ఓవర్‌డోస్ లేకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది.

రెగ్యులర్ క్రైమ్ ప్రొసీజరల్ లాగానే అనిపించినా.. పవర్ ఫుల్ యాక్టింగ్, రియలిస్టిక్ అప్రోచ్ వల్ల 'బబితా సింగ్ రిపోర్టింగ్' మంచి చూడదగిన ఆప్షన్‌గా నిలుస్తుంది. థ్రిల్లర్ సినిమాలు, ఇన్వెస్టిగేటివ్ సిరీస్‌లను ఇష్టపడే ఓటీటీ లవర్స్ ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో కచ్చితంగా చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More