Heroines: కఠినమైన ఆహార నియమాలు పాటించా: హీరోయిన్ రాశి సింగ్, సీట్లో నుంచి లేచి డ్యాన్స్ చేస్తారు: విష్ణుప్రియ కామెంట్స్

Rambha Oorvasi Menaka Title Song Launch Event: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ నలుగురు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ముగ్గురు హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Aug 31, 2026, 18:46:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rambha Oorvasi Menaka Title Song Launch Event: కామెడీ హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ కామెడీ ఫాంటసీ సినిమా 'రంభ ఊర్వశి మేనక'. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మించారు.

కఠినమైన ఆహార నియమాలు పాటించా: హీరోయిన్ రాశి సింగ్, సీట్లో నుంచి లేచి డ్యాన్స్ చేస్తారు: విష్ణుప్రియ కామెంట్స్
కఠినమైన ఆహార నియమాలు పాటించా: హీరోయిన్ రాశి సింగ్, సీట్లో నుంచి లేచి డ్యాన్స్ చేస్తారు: విష్ణుప్రియ కామెంట్స్

రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ లాంచ్

రంభ ఊర్వశి మేనక సినిమాలో సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ నలుగురు హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంభ ఊర్వశి మేనక సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ముగ్గురు హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నేను చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా టీజర్‌కి, ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్. తప్పకుండా దీనికి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.

"థియేటర్‌లో ఈ సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది. అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అల్లరి నరేష్ గారితో నటించడం చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది" అని రాశి సింగ్ తెలిపింది.

కఠినమైన ఆహార నియమాలు

"రంభ ఊర్వశి మేనక సినిమా కోసం ఆహార నియమాలు చాలా కఠినంగా పాటించాను. ఈ సినిమా షూటింగ్ కూడా మాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్స్‌లో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అని బ్యూటిఫుల్ రాశి సింగ్ పేర్కొంది.

యాంకర్ విష్ణుప్రియ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ పాట మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్‌లో ఈ పాట మీ అందరినీ సీట్లో నుంచి లేచి డాన్స్ చేసేలా చేస్తుంది. తప్పకుండా సెప్టెంబర్ 4వ తేదీన థియేటర్‌లో కలుద్దాం. తప్పకుండా ఈ సినిమాని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.

డ్యాన్స్‌కి రావడమే చూశాం

"ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘రంభ ఊర్వశి మేనక’ చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటివరకు రంభ, ఊర్వశి, మేనకలను ఒక డ్యాన్స్‌కి లేకపోతే ఒక సన్నివేశానికి రావడం చూశాము. కానీ ఈ కథ మాత్రం చుట్టూ రంభ, ఊర్వశి, మేనకల చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి సినిమా చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అల్లరి నరేష్ గారి కామెడీ టైమింగ్ అడిరిపోతుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ" అని విష్ణుప్రియ చెప్పింది.

మరో హీరోయిన్ ప్రిషా సింగ్మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సాంగ్‌కి అందరూ డ్యాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఈ పాట నచ్చుతుంది. సెప్టెంబర్ 4న అందరూ ఈ సినిమాని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించింది.

డిఫరెంట్ కాస్టూమ్ వేసుకుని

"ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుని యాక్టింగ్ చేయడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అల్లరి నరేష్ గారితో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది" అని హీరోయిన్ ప్రిషా సింగ్ వెల్లడించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More