Zee5 OTT: జీ5 ఓటీటీలో స్టార్ హీరోల కొత్త సినిమాలు- బాలకృష్ణ, వెంకటేష్ నుంచి అల్లరి నరేష్ వరకు- కనక దుర్గ టు వీరప్పన్ 2!

Zee5 OTT Release Movies New Balakrishna To Allari Naresh: తెలుగు ఓటీటీ వినోద రంగాన్ని ఏలేందుకు జీ5 పక్కా వ్యూహంతో ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, అక్కినేని హీరోలు, అల్లరి నరేష్‌ల భారీ సినిమాలతో పాటు క్రేజీ ఓరిజినల్స్, ఏఐ కథలతో సరికొత్త కంటెంట్ లైనప్‌ను సిద్ధం చేసింది.

Published on: Aug 31, 2026, 13:11:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Zee5 OTT Release Movies New Balakrishna To Allari Naresh: డిజిటల్ వినోద ప్రపంచంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా జీ5 (ZEE5) ఓటీటీ సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. దక్షిణాది ఆడియెన్స్ మనసు దోచుకునే నెటివిటీ కథలతో, స్టార్ హీరోల భారీ చిత్రాలతో సరికొత్త కంటెంట్ లైనప్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది జీ5 ఓటీటీ సంస్థ.

జీ5 ఓటీటీలో స్టార్ హీరోల కొత్త సినిమాలు- బాలకృష్ణ, వెంకటేష్ నుంచి అల్లరి నరేష్ వరకు- కనక దుర్గ టు వీరప్పన్ 2!
జీ5 ఓటీటీలో స్టార్ హీరోల కొత్త సినిమాలు- బాలకృష్ణ, వెంకటేష్ నుంచి అల్లరి నరేష్ వరకు- కనక దుర్గ టు వీరప్పన్ 2!

ఇంటర్‌నేషనల్ స్థాయిలో కథలు

నాణ్యమైన కంటెంట్‌ను ఆదరించే తెలుగు ఆడియెన్స్ కోసం ప్రాంతీయ మూలాలను కాపాడుకుంటూనే, అంతర్జాతీయ స్థాయిలో కథలను అందించేలా ఈ సరికొత్త ఓటీటీ సినిమాల వ్యూహాన్ని రచించింది.

స్టార్ హీరోల చిత్రాలతో ఓటీటీలో రచ్చ

ఓటీటీ ప్రేమికులను థ్రిల్ చేసేలా దిగ్గజ హీరోల సినిమాలను జీ5 తమ ఖాతాలో వేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'ఎన్‌బీకే111' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను చేజిక్కించుకుంది. అలాగే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ కలసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'జనవరి 12 విడుదల' కూడా ఈ జాబితాలో ఉంది.

అక్కినేని హీరోలు అఖిల్ నటించిన 'లెనిన్' (దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు), దళపతి విజయ్ జన నాయగన్ ఈపాటికే జీ5లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నాగచైతన్య-మీనాక్షి చౌదరిల హారర్ థ్రిల్లర్ 'వృషకర్మ' (దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు) కూడా జీ5 ఓటీటీలోకే అలరించడానికి వచ్చేయనుంది.

కనక దుర్గ నుంచి వీరప్పన్ 2 వరకు

ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తున్న 'కనక దుర్గ' ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనుంది. వీటితో పాటు 'హాయ్', 'డిమాంటీ కాలనీ 2', 'ఏ క్వీన్', 'వీరప్పన్ 2' వంటి సూపర్ హిట్ డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.

టాప్ బ్యానర్లు.. ఆకట్టుకునే ఒరిజినల్స్

అయితే, పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో జీ5 చేతులు కలిపింది. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్, మనం ఎంటర్‌ప్రైజెస్, బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్, ఉదయ భాను ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లతో కలిసి కంటెంట్ సిద్ధం చేసింది.

ఒరిజినల్ ఓటీటీ సిరీస్ విభాగంలో నివేదా థామస్ ప్రధాన పాత్రలో 'శ్రీమతి', భరత్ నివాస్, శివాజీ రాజా, ఉదయభాను నటించిన 'పంచనామా' సిరీస్‌లు రాబోతున్నాయి. వర్సటైల్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా 'జయమ్ము నిశ్చయమ్మురా 2' టాక్ షో సరికొత్త టాపిక్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

విప్లవాత్మక ఏఐ కథలు.. లైవ్ స్పోర్ట్స్ ధమాకా

సాంకేతికతను జోడిస్తూ ఏఐ (AI) ఆధారిత స్టోరీ టెల్లింగ్‌తో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్. 'గరుడ', 'విక్రమ్ బేతాళ్', 'శివ్ సతి', 'చంద్రకాంత', 'తిరుపతి బాలాజీ', 'నర్మద', 'రామ్ ఆంజనేయ యుద్ధ్' వంటి పురాణ, జానపద కథలను ఏఐ సాంకేతికతతో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

పిల్లల కోసం 'బార్బరీక్', 'కుండక మండక్క' వంటి వినోదాత్మక కంటెంట్‌తో పాటు, క్రీడాభిమానుల కోసం ఫిఫా (FIFA), బుండెస్లీగా, కోప్పా ఇటాలియా, ఐఎల్‌టీ20 (ILT20) వంటి లైవ్ స్పోర్ట్స్ ప్రసారాలను కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఎమోషన్స్‌కు దగ్గరుండే కథలు

"తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ కొత్తదనంతో పాటు భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథలను ఆదరిస్తారు. క్రియేటర్స్, ప్రొడక్షన్ హౌస్‌లతో ఏర్పడిన బంధంతో ఈ లైనప్ రూపొందించాం. వైవిధ్యమైన, ధైర్యమైన కథలను అందించడమే మా లక్ష్యం" అని జీ5 ఓటీటీ సౌత్ బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ స్పష్టం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More