Water: చుక్క నీరు లేక దారుణ పరిస్థితులు, పీరియడ్స్‌లో ఎంత నరకం అనుభవించాలో? నీటి కొరతపై కింగ్‌డమ్ విలన్ వెంకటేష్ ఆవేదన

Venkitesh VP On Water Crisis: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రంలో విలన్‌గా నటించిన మలయాళ నటుడు వెంకటేష్ వీపీ రియల్ హీరో అనిపించుకున్నాడు. కేరళలోని నీటి కొరతపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. స్థానికులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా వీడియో తాగునీటి కరువుపై అధికారులను ప్రశ్నించాడు.

Published on: Jun 23, 2026, 09:57:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kingdom Villain Venkitesh VP On Water Crisis: తాగునీరు అనేది ప్రతి మనిషి కనీస అవసరం. దానికోసం కూడా జనం అల్లాడిపోతుంటే చూస్తూ ఊరుకోలేం అని చాలామంది భావిస్తుంటారు. కేరళ రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రం) నగరంలో ప్రస్తుతం ఇలాంటి దారుణమైన పరిస్థితే నెలకొంది.

చుక్క నీరు లేక దారుణ పరిస్థితులు, పీరియడ్స్‌లో ఎంత నరకం అనుభవించాలో? నీటి కొరతపై కింగ్‌డమ్ విలన్ వెంకటేష్ ఆవేదన
చుక్క నీరు లేక దారుణ పరిస్థితులు, పీరియడ్స్‌లో ఎంత నరకం అనుభవించాలో? నీటి కొరతపై కింగ్‌డమ్ విలన్ వెంకటేష్ ఆవేదన

ప్రజల తాగునీటి కష్టాలపై

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన టాలీవుడ్ చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు, విలన్ వెంకటేష్ వీపీ (Venkitesh VP) అక్కడి ప్రజల తాగునీటి కష్టాలపై సోషల్ మీడియా ద్వారా గళమెత్తారు. తన నివాస ప్రాంతంలో చుక్క నీరు రాక జనం పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

అర్ధరాత్రి వచ్చే నీళ్లు కూడా బంద్.. మహిళల ఆవేదన

నటుడు వెంకటేష్ వీపీ తిరువనంతపురంలోని ‘ఫోర్ట్ వార్డ్’ కాలనీలో నివసిస్తున్నారు. గత ఆరు, ఏడు నెలలుగా తమ ప్రాంతంలో నీటి సరఫరా దారుణంగా తయారైందని ఆయన ఆరోపించారు. పగలు మొత్తం నీళ్లు రాకుండా, కేవలం అర్ధరాత్రి వేళల్లో మాత్రమే కొద్దిసేపు నీటిని సరఫరా చేసేవారని, గత వారం రోజులుగా ఆ అర్ధరాత్రి సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు.

"పక్కనే ఉన్న తమిళనాడులో కూడా ఇంతటి నీటి కరువు ఉండదేమో! అసలు నీళ్లు లేకపోతే పీరియడ్స్ సమయంలో మహిళలు ఎంత నరకం అనుభవించాలో అధికారులు ఆలోచిస్తున్నారా?" అని ఆ వీడియోలో ఒక మహిళా నివాసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో నటుడు వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగి జనం గొంతుకగా మారారు.

మంత్రి సమాధానం.. ఎల్ నినో ప్రభావమే కారణం

కేరళలోని తీవ్ర విద్యుత్ కొరత, జలాశయాల్లో అడుగంటిన నీటి మట్టాలపై ఆ రాష్ట్ర మంత్రి సన్నీ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో (El Niño) ప్రభావం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు.

"జూన్ 2025లో మన జలాశయాల్లో నీటి మట్టం 47 శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ నాటికి అది కేవలం 21 శాతానికి పడిపోయింది" అని మంత్రి సన్నీ జోసెఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ లాంటి నదులు, పచ్చదనంతో నిండిన రాష్ట్రంలోనే జలాశయాలు ఈ స్థాయిలో ఎండిపోవడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది.

ముఖ్యమంత్రి, మేయర్‌లకు ట్యాగ్ చేసిన నటుడు

ఈ సమస్య కేవలం తన కాలనీకే పరిమితం కాలేదని, తిరువనంతపురం నగరంలోని శ్రీవరాహం, శ్రీకంటేశ్వరం, మణకాడు, కమలేశ్వరం, వల్లక్కడవు వంటి మరో 13 వార్డులలో ప్రజలు చుక్క తాగునీటి కోసం అల్లాడుతున్నారని వెంకటేష్ తెలిపారు. సమస్య తీవ్రతను వివరిస్తూ ఆయన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నగర మేయర్, జిల్లా కలెక్టర్‌లను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. తక్షణమే స్పందించి తాగునీటి ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు.

‘మిళి తురక్కు’ సినిమాతో

2014లో ‘మిళి తురక్కు’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వెంకటేష్, ఆ తర్వాత ‘లవ్‌ఫుల్లీ యువర్స్ వేద’ (2023) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2024లో జీవీ ప్రకాష్ కుమార్ సరసన ‘రెబెల్’ సినిమాతో కోలీవుడ్‌లో మెరిశారు.

విలన్ కాదు హీరో

ఇక 2025లో తెలుగులో భారీ తారాగణంతో వచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమాలో విలన్ పాత్ర పోషించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ మూవీలో విలన్‌గా చేసి సమాజంలో సామాన్యుల సమస్యలపై గళమెత్తి రియల్ హీరో అనిపించుకున్నారు వెంకటేష్ వీపీ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More