వారిపై అరిచి ఏం సాధిస్తారు? వారూ నిస్సహాయులే.. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందికి రియల్ హీరో సోనూ సూద్ సపోర్ట్

ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందికి రియల్ హీరో, నటుడు సోనూ సూద్ మద్దతుగా నిలిచారు. ఇటీవల ఇండిగో విమానాల్లో తీవ్ర జాప్యాలు, అనుకోని రద్దుల కారణంగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సోనూ సూద్ స్పందించారు. ఆవేశంతో గ్రౌండ్ స్టాఫ్‌పై అరుస్తూ వారిని లక్ష్యంగా చేసుకోవద్దని, వారు కూడా నిస్సహాయులేనని అన్నారు.

Dec 6, 2025, 19:16:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం ఇండిగో ఎయిర్ లైన్స్ హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమానాల జాప్యం, క్యాన్సిలేషన్ వంటివి తలెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇండిగో ఎయిర్ లైన్స్‌పై, వారి సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు.

వారిపై అరిచి ఏం సాధిస్తారు? వారూ నిస్సహాయులే.. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందికి రియల్ హీరో సోనూ సూద్ సపోర్ట్
వారిపై అరిచి ఏం సాధిస్తారు? వారూ నిస్సహాయులే.. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందికి రియల్ హీరో సోనూ సూద్ సపోర్ట్

సోషల్ మీడియాలో వీడియోలు

వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ పరిస్థితి టెర్మినల్స్‌లో తీవ్ర వాగ్వాదాలు, అరుపులకు దారితీసింది. దీనికి సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, విమాన షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కోపోద్రిక్తులైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్న దృశ్యాలు ఈ వీడియోలలో కనిపిస్తున్నాయి.

అయితే, ఈ వ్యవహారంపై రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ రియాక్ట్ అయ్యారు. శనివారం (డిసెంబర్ 06) ఉదయం తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు టాలీవుడ్ విలన్ సోనూ సూద్.

నిరాశ, బాధను అర్థం చేసుకోగలను

విమాన సిబ్బందిపై అరుస్తున్న ప్రయాణికుల ప్రవర్తనను సోనూ సూద్ తప్పుబట్టారు. సుదీర్ఘ జాప్యాల వల్ల కలిగే "నిరాశ", "బాధను" తాను అర్థం చేసుకోగలనని, అయితే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న గ్రౌండ్ స్టాఫ్‌ పట్ల ప్రయాణికులు దయతో ఉండాలని సోనూ సూద్ కోరారు.

"స్నేహితులారా, ఇండిగో విమానాలలో గత 2-3 రోజులుగా కష్టాలు పడుతున్న వారందరి కోసం ఈ చిన్న సందేశం. ఆ విమానాల్లో నా కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించారు. దాదాపు 4.5 నుంచి 5 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాతే విమానం బయలుదేరి గమ్య స్థానానికి చేరుకుంది. చాలా విమానాలు టేకాఫ్ కాలేదు. చాలా రద్దు అయ్యాయి. దీనివల్ల ఎంతోమంది వివాహాలకు వెళ్లలేకపోయారు. ముఖ్యమైన సమావేశాలు, ఈవెంట్‌లు రద్దు అయ్యాయి" అని సోనూ సూద్ చెప్పుకొచ్చారు.

వారి గురించి ఆలోచించండి

"విమానాశ్రయాలలో గ్రౌండ్ స్టాఫ్‌పై ప్రజలు అరుస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ, బాధ కలగడం సహజమే. ఆ కోపాన్ని ఎవరో ఒకరిమీద చూపించాలనిపిస్తుంది. కానీ, ఒక్కసారి వారి గురించి ఆలోచించండి. వారు కూడా నిస్సహాయులే. విమానాల భవిష్యత్తు షెడ్యూల్ గురించి, ఫ్లైట్‌ల టేకాఫ్, రద్దు గురించి వారికి కూడా తెలియదు. పైనుంచి వచ్చే సందేశాలను మాత్రమే వారు మీకు చేరవేయగలరు. వారిపై అరిచి ఏం సాధిస్తాం" అని ఇండిగో సిబ్బందికి సోనూ సూద్ సపోర్ట్‌గా నిలిచారు.

"బాధ్యతాయుతమైన పౌరులుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, వారు నిస్సహాయులు, వారి వద్ద సమాధానాలు లేవు. కాబట్టి, మనం వారిపై ఆగ్రహం వ్యక్తం చేయకూడదు. దయచేసి శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి, వారిని గౌరవించండి" అని సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు.

నలుగురు సభ్యులతో కమిటీ

ఇదిలా ఉండగా, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం, ఏర్పడిన అంతరాయాలకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. అందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఉన్నత స్థాయి, నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కాగా, ఈ ఇండిగో ఎయిర్ లైన్స్ బాధితుల్లో తెలుగు నటుడు వీకే నరేష్ కూడా ఉన్న విషయం తెలిసిందే. 90ల కాలం మాదిరిగా ప్రస్తుత విమాన ప్రయాణాలు సరదాగా, సురక్షితంగా లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More