ఇండిగో ఎయిర్ లైన్స్ బాధితుల్లో నటుడు నరేష్- 90ల కాలం నాటి ప్రయాణాలు మళ్లీ కావాలంటూ అసంతృప్తి- సెల్ఫీలంటూ ఫ్యాన్స్ గోల!

ఇండిగో ఎయిల్ లైన్స్ బాధితుల్లో హీరో మహేష్ బాబు సోదరుడు, నటుడు వీకే నరేష్ కూడా ఉన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సాంకేతిక లోపం కారణంగా విమాన ప్రయాణంలో ఎదురైన తీవ్ర ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా నరేష్ పంచుకున్నారు. '90ల నాటి సురక్షితమైన, సరదా ప్రయాణాలు మళ్లీ కావాలి' అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published on: Dec 6, 2025, 14:53:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ మహేశ్ బాబు సోదరుడు నరేష్ ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కుదిపేసిన సాంకేతిక లోపంపై తన అసంతృప్తిని, నిరాశను వ్యక్తం చేశారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ బాధితుల్లో నరేష్ కూడా ఒకరని తెలిసింది.

ఇండిగో ఎయిర్ లైన్స్ బాధితుల్లో నటుడు నరేష్- 90ల కాలం నాటి ప్రయాణాలు మళ్లీ కావాలంటూ అసంతృప్తి- సెల్ఫీలంటూ ఫ్యాన్స్ గోల!
ఇండిగో ఎయిర్ లైన్స్ బాధితుల్లో నటుడు నరేష్- 90ల కాలం నాటి ప్రయాణాలు మళ్లీ కావాలంటూ అసంతృప్తి- సెల్ఫీలంటూ ఫ్యాన్స్ గోల!

సాంకేతిక లోపం కారణంగా

ఇండిగో ఎయిర్ లైన్స్ సాంకేతిక లోపం కారణంగా అనేక విమానాలు రద్దు కావడంతో పాటు, భారీగా ఆలస్యం అయ్యాయి. ఈ విషయంపై ఇటీవల నటుడు నరేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ రోజుల్లో విమాన ప్రయాణం ఎంత కష్టంగా మారిందో, '90ల నాటితో పోలిస్తే' ప్రస్తుత సమస్యలు ఎలా ఉన్నాయో ఆయన వివరించారు.

నరేష్‌కు చేదు అనుభవం

తాజాగా నరేష్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో మూసివేసిన బోర్డింగ్ గేట్ల వద్ద భారీగా గుమిగూడిన ప్రయాణీకులు కనిపిస్తున్నారు. మరొక ఫోటోలో ఆయన మాస్క్ ధరించి ఉన్నారు. ఈ వీడియోను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పంచుకుంటూ అసంతృప్తి తెలిపారు.

"విమాన ప్రయాణంలో ఉండే సరదా 90ల కాలానికే పరిమితమైపోయింది. ఉదయం 8:15 గంటలకు హైదరాబాద్ ఇండిగో టెర్మినల్‌కు సమయానికి చేరుకున్నాను. కానీ అన్ని ఇండిగో విమానాలు ఆలస్యం అయ్యాయి. అప్పటికే ఫ్లైట్‌లో తినడానికి ఆహారం ప్యాక్ చేసుకున్నాను" అని నరేష్ తెలిపారు.

అపరిశుభ్రత తప్ప

"అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.. గ్రౌండ్ సిబ్బందికి, ప్రయాణీకులకు మధ్య పూర్తిస్థాయి ఘర్షణ జరుగుతోంది. భయంకరమైన రద్దీ, అపరిశుభ్రత తప్ప మరొకటి లేదు. దుకాణాల దగ్గర షాపింగ్ చేసి తిరిగి రద్దీ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా అక్కడ అలాగే గందరగోళంగా ఉంది" అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు నరేష్.

సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గోల

ఇదే వీడియోలో, కొందరు అభిమానులు సెల్ఫీ కోసం వీగే నరేష్‌ను సమీపించడం కూడా కనిపించింది. ఈ అంశంపై కూడా నరేష్ స్పందించారు. "పరిస్థితి ఇంకా దారుణంగా మారిందంటే.. మనుషుల్లో ఇప్పుడు కొత్త స్కానర్లు అభివృద్ధి అయ్యాయి. వారు సన్‌ గ్లాసెస్, మాస్క్‌లు ధరించిన నటులను కూడా సులభంగా గుర్తించగలుగుతున్నారు. ఏకాంతానికి అసలు చోటు లేదు" అని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

"నాకు ఒక టైమ్ మెషిన్ ఉండి ఉంటే.. నేను తిరిగి 90లకు వెళ్లిపోయేవాడిని. అప్పటి భారతీయ ఎయిర్‌లైన్స్ సురక్షితంగా, బాగుండేవి. ఇప్పుడు విమానాలు అన్నీ బ్యాక్టీరియా కేంద్రాలుగా మారిపోయాయి. అందుకే మాస్క్‌లు తప్పనిసరి" అంటూ తన పోస్ట్‌ను ముగించారు నటుడు వీగే నరేష్.

నరేష్ పర్సనల్ లైఫ్

ఇదిలా ఉంటే, నటుడు నరేష్ తల్లి విజయ నిర్మల, హీరో మహేష్ బాబు తండ్రి సూపర్ కృష్ణకు రెండో భార్య అని తెలిసిన విషయమే. నరేష్ పూర్తి పేరు విజయ కృష్ణ నరేష్. నరేష్‌ మొదటి భార్య రమ్య రఘుపతి కాగా నటి పవిత్ర లోకేష్‌ను 2023లో మరో వివాహం చేసుకున్నారు.

హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టిన నరేష్ ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. చివరిగా రవితేజ-శ్రీలీల జంటగా నటించిన మాస్ జాతర సినిమాలో కనిపించారు నటుడు నరేష్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More