Sign in

TG20: టీజీ20 వివాదం- వెంకటేష్, విజయ్ దేవరకొండ టీసీఏ లీగల్ నోటీసులు- ఆ స్టార్ క్రికెటర్స్‌కి కూడా- అసలు ఏమైందంటే?

TG20 Controversy Venkatesh Vijay Deverakonda Get Legal Notices: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించతలపెట్టిన ‘TG20 లీగ్’ చుట్టూ చట్టపరమైన వివాదం ముసురుకుంది. హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లతో పాటు ముగ్గురు స్టార్ క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు జారీ చేసింది.

Published on: Jun 18, 2026, 06:22:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG20 Controversy Venkatesh Vijay Deverakonda Get Legal Notices: తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకుంటున్న సరికొత్త టీ20 టోర్నమెంట్ ‘TG20 లీగ్’ ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడింది.

టీజీ20 వివాదం- వెంకటేష్, విజయ్ దేవరకొండ టీసీఏ లీగల్ నోటీసులు- ఆ స్టార్ క్రికెటర్స్‌కి కూడా- అసలు ఏమైందంటే?
టీజీ20 వివాదం- వెంకటేష్, విజయ్ దేవరకొండ టీసీఏ లీగల్ నోటీసులు- ఆ స్టార్ క్రికెటర్స్‌కి కూడా- అసలు ఏమైందంటే?

హీరోలు, క్రికెటర్లకు నోటీసులు

ఈ టోర్నీతో సంబంధాలు కలిగి ఉన్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సహా టీమిండియా అగ్ర క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, మాజీ ఆటగాడు అంబటి రాయుడులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) షాక్ ఇచ్చింది. వీరందరికీ టీసీఏ లీగల్ నోటీసులు పంపినట్లు జాతీయ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ వెల్లడించింది.

బీసీసీఐ అనుమతి లేదంటూ అభ్యంతరం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌సిఏ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీసీఎ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ సంస్థలతో కలిసి లీగ్‌ను నడపడం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ లీగ్‌ను ప్రమోట్ చేయడం ద్వారా సెలబ్రిటీలు కూడా బాధ్యులు అవుతారని హెచ్చరించింది. గతంలో ఈ టోర్నీకి తెలంగాణ ప్రీమియర్ లీగ్, టీటీఎల్, టీజీ20 ప్రీమియర్ లీగ్ అని పేర్లు మారుస్తూ వచ్చారని, ఇప్పుడు స్పాన్సర్లు, పేర్లు మార్చినా నిబంధనల ఉల్లంఘన సమస్య అలాగే ఉందని స్పష్టం చేసింది.

సాధారణంగా బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఏ రాష్ట్ర అసోసియేషన్ అయినా సొంతంగా కమర్షియల్ లీగ్స్ పెట్టాలంటే బోర్డు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అలా లేని పక్షంలో అందులో ఆడే క్రికెటర్ల కెరీర్‌పై కూడా నిషేధం విధించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీల ఎండార్స్‌మెంట్లపై టీసీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే కోర్టును ఆశ్రయించడానికైనా వెనకాడబోమని హెచ్చరించింది.

షూటింగ్‌లలో హీరోలు బిజీ.. స్పందించని తారలు

ఈ లీగల్ నోటీసుల వ్యవహారంపై అటు హీరోలు కానీ, ఇటు క్రికెటర్లు కానీ ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వెంకటేష్, విజయ్ దేవరకొండ ఇద్దరూ తమ తాజా చిత్రాల షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆదర్శ కుటుంబం' చిత్రంలో నటిస్తున్నారు.

మరోవైపు విజయ్ దేవరకొండ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ మాస్ ఎంటర్‌టైనర్ 'రౌడీ జనార్ధన' అనే సినిమాను కూడా విజయ్ పట్టాలెక్కించారు.

సొంత ఊరిలో విజయ్-రష్మిక సేవా కార్యక్రమాలు

ఇదిలా ఉంటే, గత ఆదివారం విజయ్ దేవరకొండ తన భార్య, హీరోయిన్ రష్మిక మందన్నాతో కలిసి తెలంగాణలోని అచ్చంపేట మండలం తుమ్మన్‌పేట గ్రామంలో సందడి చేశారు. విజయ్ తండ్రి పుట్టిన ఊరైన తుమ్మన్‌పేటలోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం వీరిద్దరూ కలిసి ఒక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అచ్చంపేట మండలంలోని 9, 10 తరగతుల విద్యార్థులకు సాయం చేయాలనేది తమ చిన్న నాటి కల అని, అందులో భాగంగా మొదటి విడతగా తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన 180 మంది పిల్లలకు ఆర్థిక సాయం అందించారు.

తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలనేది

"ఈ చిన్న స్కాలర్‌షిప్ కానుక చాలా చిన్నదే కావచ్చు. కానీ, మాకు ఇది ఎంతో ముఖ్యం. మీ జీవితాల్లో నేను ఒక భాగం కావాలనుకుంటున్నాను. నా సొంత గ్రామం తర్వాత మెల్లగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలనేదే నా కల" అని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.

ఒకవైపు సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలిచిన రౌడీ హీరో, మరోవైపు ఈ క్రికెట్ లీగ్ నోటీసుల వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More