మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో నెంబర్ వన్‌గా చైల్డ్ యాక్టర్- స్టార్ హీరోలు, హీరోయిన్లను దాటేసిన చిన్నోడు!

IMDB Most Popular Indian Celebrity List: ప్రముఖ సినీ డేటాబేస్ సంస్థ ఐఎమ్‌డీబీ తాజాగా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో ఒక చైల్డ్ యాక్టర్ సంచలనం సృష్టించాడు. స్టార్ హీరోలు, గ్లోబల్ ఐకాన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆ కుర్రాడు వైరల్‌గా మారాడు.

Published on: May 28, 2026, 14:12:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IMDB Most Popular Indian Celebrity List: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఫాలో అయ్యే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ-IMDb) ప్రతి వారం అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తుంది. వెండితెరపై లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఏ నటీనటుల సినిమాలు ట్రెండ్ అవుతుంటాయో, సాధారణంగా వారికే ఈ లిస్టులో అగ్రస్థానం దక్కుతుంది.

మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో నెంబర్ వన్‌గా చైల్డ్ యాక్టర్- స్టార్ హీరోలు, హీరోయిన్లను దాటేసిన చిన్నోడు!
మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో నెంబర్ వన్‌గా చైల్డ్ యాక్టర్- స్టార్ హీరోలు, హీరోయిన్లను దాటేసిన చిన్నోడు!

ఆశ్చర్యపరిచిన ఐఎమ్‌డీబీ టాప్ 30 సెలబ్రిటీ జాబితా

కానీ, ఈ వారం ఐఎమ్‌డీబీ ఇండియా ప్రకటించిన టాప్ 30 సెలబ్రిటీల జాబితా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండస్ట్రీని ఏలుతున్న అగ్ర హీరోలు, అంతర్జాతీయ వేదికలపై మెరిసిన స్టార్ హీరోయిన్లను కాదని, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా మొదటి స్థానంలో నిలిచాడు.

అందరినీ దాటేసిన యుధ్‌వీర్ అహ్లావత్

ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న 'కర్తవ్య' సినిమాలో నటించిన యుధ్‌వీర్ అహ్లావత్ ఈ ఘనత సాధించాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో యుధ్‌వీర్ ఒక కీలకమైన పాత్ర పోషించాడు.

ఓటీటీ స్ట్రీమింగ్ మూవీ కర్తవ్యలో 14 ఏళ్ల మైనర్ బాలుడిగా, పరిస్థితుల ప్రభావంతో ఒక సుపారీ కిల్లర్‌గా మారే పాత్రలో యుధ్‌వీర్ అహ్లావత్ చూపించిన నటన విమర్శకులను సైతం మెప్పించింది. మే 15 నుంచి కర్తవ్య నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో, ఈ కుర్రాడి నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు అతడి వివరాల కోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికారు. దాంతో ఐఎమ్‌డీబీలో యుధ్‌వీర్ ప్రొఫైల్ సందర్శనల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

హర్యానా కుర్రాడి ప్రస్థానం

హర్యానాకు చెందిన యుధ్‌వీర్ అహ్లావత్ 2019లో వచ్చిన 'సాండ్ కీ ఆంఖ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'లవ్ హాస్టల్' అనే సినిమాతో పాటు 'కో-ఎడ్' అనే ఓటీటీ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. అయితే, 'కర్తవ్య' సినిమాలో 14 ఏళ్ల చిన్న పిల్లాడిగా కనిపించినప్పటికీ, నిజ జీవితంలో తనేమీ మైనర్ కాదని, కేవలం తన లుక్స్ మాత్రమే చిన్న పిల్లాడిలా ఉంటాయని యుధ్‌వీర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

నెటిజన్ల ప్రశంసలు.. టాప్ 30 లో ఎవరెవరు ఉన్నారంటే?

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసి మూడో స్థానంలో నిలిచిన గ్లోబల్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, తమిళనాడు రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టి నాలుగో స్థానంలో నిలిచిన స్టార్ హీరో దళపతి విజయ్‌లను సైతం ఈ కుర్రాడు వెనక్కి నెట్టడం విశేషం. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో 24వ స్థానంలో నిలవగా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈసారి టాప్ 30 లో చోటు దక్కించుకోలేకపోయారు.

యుధ్‌వీర్ నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకొచ్చిన ఈ నటుడికి ఈ గౌరవం దక్కడం వంద శాతం కరెక్ట్ అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 'మాసూమ్' సినిమాలో హన్సరాజ్, 'జఖ్మ్' లో కునాల్ ఖేము ప్రదర్శించిన నటనతో యుధ్‌వీర్‌ను పోలుస్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ జాబితాను ఐఎమ్‌డీబీ ఎలా రూపొందిస్తుంది?

ప్రపంచవ్యాప్తంగా నెలకు 25 కోట్ల మందికి పైగా ఉన్న సినీ అభిమానులు ఐఎమ్‌డీబీ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసే డేటా ఆధారంగా ఈ లిస్టు తయారవుతుంది. నటీనటులు, దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, రచయితల ప్రొఫైల్స్‌ను వీక్షకులు ఎంత ఎక్కువగా సందర్శిస్తే వారి రేంజ్ అంతగా పెరుగుతుంది. అలా ఈ వారం ఇండియన్ స్టార్స్ అందరిలోకి యుధ్‌వీర్ ప్రొఫైల్ అత్యధిక వ్యూస్ దక్కించుకుని టాప్ ప్లేస్‌కు చేరింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈ వారం ఐఎమ్‌డీబీ (IMDb) టాప్ సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు?

ఇటీవల విడుదలైన 'కర్తవ్య' సినిమాలో అద్భుత నటన కనబరిచిన యువ నటుడు యుధ్‌వీర్ అహ్లావత్ ఐఎమ్‌డీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

2. యుధ్‌వీర్ అహ్లావత్ నటించిన 'కర్తవ్య' సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?

సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో మే 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

3. ఈ జాబితాలో ఐశ్వర్యా రాయ్, దళపతి విజయ్ ఏ స్థానాల్లో నిలిచారు?

కేన్స్ వేడుకల్లో మెరిసిన ఐశ్వర్యా రాయ్ మూడో స్థానంలో నిలవగా, పొలిటికల్ ఎంట్రీతో వార్తల్లో నిలిచిన తమిళ స్టార్ హీరో విజయ్ నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

4. ఐఎమ్‌డీబీ సెలబ్రిటీల పాపులారిటీ లిస్టును ఏ ప్రాతిపదికన తయారుచేస్తారు?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 కోట్లకు పైగా సినీ అభిమానులు ప్రతి వారం ఐఎమ్‌డీబీ వెబ్‌సైట్‌లో సెలబ్రిటీల ప్రొఫైల్స్‌ను ఎంత ఎక్కువగా సందర్శిస్తారనే వ్యూస్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More