Vijay Rashmika: ఇవాళ సొంతూరికి రష్మికతో విజయ్ దేవరకొండ- 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్- మెరిట్ జాబితా విడుదల!
Vijay Deverakonda Scholarship To 180 Students Today: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి తర్వాత తొలిసారి తమ స్వగ్రామం తుమ్మన్‌పేటకు ఇవాళ (జూన్ 14) వెళ్లారు. 'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 180 మంది ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించనున్నారు.
Vijay Deverakonda Rashmika Mandanna Scholarship To 180 Students Today: వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాము రియల్ హీరోలమని టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిరూపించుకున్నారు. ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన ఈ జంట కేవలం విలాసవంతమైన జీవితానికే పరిమితం కాకుండా, సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.

విజయ్ దేవరకొండ తండ్రి ఊరు
గతంలో తమ ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న శుభ సందర్భంలో ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ నేడు (జూన్ 14) విజయ్ దేవరకొండ తన తండ్రి జన్మస్థలమైన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామానికి రష్మికతో కలిసి వెళ్లారు.
పెళ్లి తర్వాత మొదటిసారిగా తమ సొంతూరికి వచ్చిన ఈ కొత్త దంపతులకు గ్రామస్థులు ఘనస్వాగతం పలకనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా గ్రామాభివృద్ధిపై తనకున్న ప్రణాళికలను పంచుకోవడంతో పాటు, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైన విద్యా పథకానికి వారు నాంది పలికారు.
విజయ్ దేవరకొండ ట్వీట్
"మేము మా నాన్నగారు పుట్టిన చిన్న గ్రామం తుమ్మన్‌పేటకు వెళ్తున్నాము. ఫిబ్రవరిలో రష్మిక, నేను కలిసి ఒక చిన్న కలని ప్రకటించాము. తెలంగాణలోని అచ్చంపేట మండలానికి చెందిన 9, 10 తరగతుల కష్టపడి చదివే విద్యార్థులను సత్కరించాలనేదే మా లక్యం. తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన మెరిట్ విద్యార్థుల జాబితా ఇది" అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
45 ప్రభుత్వ పాఠశాలలకు భరోసా
'ది దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ఈ జంట అధికారికంగా ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
మెరిట్ విద్యార్థుల జాబితా విడుదల
ఈ కార్యక్రమంలో భాగంగా కష్టపడి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థుల జాబితాను సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ విద్యార్థుల పైచదువులకు అయ్యే పూర్తి ఆర్థిక ఖర్చులను 'ది దేవరకొండ ఫౌండేషన్' భరిస్తుందని ఈ దంపతులు హామీ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ తండ్రి చదువుకున్న జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (మొదటి ర్యాంక్), పి. ప్రణీత (ద్వితీయ ర్యాంక్) ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతి నుంచి కె. గణేష్ (మొదటి ర్యాంక్), బి. అనిల్ (ద్వితీయ ర్యాంక్) ప్రతిభ చూపి ఈ సహాయాన్ని అందుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ ఉన్నప్పటికీ, టెన్త్ క్లాస్ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయాల్లో ఈ స్టార్ జంట తీసుకున్న నిర్ణయం ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది.
విజయ్, రష్మికలపై ప్రశంసలు
ఇచ్చిన మాట ప్రకారం సొంత ఊరికి వచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మికల పెద్ద మనసుకు అటు అచ్చంపేట ప్రజలతో పాటు ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


