Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ నుంచి వెళ్లిపో, అప్పుడే హీరో అవుతావ్- అంబటి రాయుడు సలహా- ఎందుకంటే?

Ambati Rayudu Advice To Yashasvi Jaiswal To Leave RR: ఐపీఎల్ టీమ్‌ను ఓపెనర్ యశస్వి జైస్వాల్ మార్చడం బెటర్ అని, అప్పుడే తాను హీరోగా అవుతాడని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైస్వాల్ తన కెరీర్ కోసం రాజస్థాన్ జట్టును వీడి ముంబై ఇండియన్స్‌లో చేరడం మంచిదని సూచించారు.

Published on: May 28, 2026, 12:31:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ambati Rayudu Advice To Yashasvi Jaiswal To Leave RR IPL Team: భారత టెస్ట్ క్రికెట్‌లో బెస్ట్ ఓపెనర్‌గా ఎదిగిన ఆటగాడు యశస్వి జైస్వాల్. ఇప్పటివరకు టీమిండియా తరఫున 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతడి సొంతం. ఐపీఎల్‌లో ఇది అతడికి ఏడో సీజన్. మరోవైపు వైభవ్ సూర్యవంశీ కేవలం టీ20 ఫార్మాట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక కొత్త మోన్‌స్టర్.

యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ నుంచి వెళ్లిపో, అప్పుడే హీరో అవుతావ్- అంబటి రాయుడు సలహా- ఎందుకంటే? (PTI)
యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ నుంచి వెళ్లిపో, అప్పుడే హీరో అవుతావ్- అంబటి రాయుడు సలహా- ఎందుకంటే? (PTI)

సూర్యవంశీకే ఎక్కువ పాపులారిటీ

టీమిండియాలోకి ఇంకా అడుగుపెట్టని సూర్యవంశీకి ఇది కేవలం రెండో ఐపీఎల్ సీజన్ మాత్రమే. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ ఇద్దరిలో యశస్వి కంటే సూర్యవంశీనే ఎక్కువ పాపులారిటీ, పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

జైస్వాల్ 15 మ్యాచ్‌ల్లో 426 పరుగులు చేసి పర్వాలేదనిపించినా, వైభవ్ సూర్యవంశీ ఏకంగా 680కి పైగా పరుగులు సాధించి రికార్డులు తిరగరాస్తున్నాడు. ఏకంగా విరాట్ కోహ్లీ క్రేజ్‌ను సైతం దాటేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

సూర్యవంశీ నీడలో జైస్వాల్!

రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఈ ఇద్దరి మధ్య ఫామ్ పరంగా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఒకే జట్టులో సూర్యవంశీ అంతలా రెచ్చిపోతుంటే, సీనియర్ ఓపెనర్ అయిన జైస్వాల్ ఒత్తిడికి లోనవుతున్నాడని ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే జైస్వాల్‌కు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఒక కీలకమైన సలహా ఇచ్చారు.

2020 నుంచి రాజస్థాన్ జట్టుకు ప్రధాన పిల్లర్‌గా ఉన్న జైస్వాల్, ఇకపై ఆ ఫ్రాంచైజీని వీడి మరో జట్టులోకి వెళ్తేనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని రాయుడు స్పష్టం చేశారు. సూర్యవంశీ నీడ నుంచి బయటకు వస్తేనే జైస్వాల్ మళ్లీ హీరో కాగలడని విశ్లేషించారు. యశస్వి జైస్వాల్ వేరే జట్టుకు మారాల్సిన అవసరం ఎందుకు ఉందో వివరిస్తూ రాయుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'ప్రతి మ్యాచ్‌లోనూ అతడే హైలైట్ అవుతున్నాడు'

"జైస్వాల్ తక్షణమే తన ఐపీఎల్ జట్టును మార్చాలి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ జైస్వాల్ మరుగున పడిపోతున్నాడు. జైస్వాల్ కూడా ఒక స్టార్ ఆటగాడే. అతడు వేరే జట్టుకు వెళ్తే ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు" అని ప్రశంసించారు అంబటి రాయుడు.

"అతడికి ఆ స్వేచ్ఛ, ప్రత్యేకమైన వేదిక అవసరం. సూర్యవంశీ ఆడే తీరుకు ఇతరులు హైలైట్ అవ్వడం కష్టం. కాబట్టి సూర్యవంశీ పక్కన ఒక సీనియర్ భాగస్వామి ఉండి, అతడి పరుగులను చూసి సంతోషపడేవాడు ఉండాలే తప్ప, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉండి పోటీ పడేవాడు ఉండకూడదు" అని అంబటి రాయుడు స్పష్టం చేశారు.

జైస్వాల్ తదుపరి జట్టు ముంబై ఇండియన్సేనా?

రాజస్థాన్ రాయల్స్‌ను వీడితే జైస్వాల్‌కు సరిపోయే తదుపరి జట్టు ఏది అనే ప్రశ్నకు రాయుడు వద్ద స్పష్టమైన సమాధానం ఉంది. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ (MI) జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం లేకపోవడం, పైగా టీమిండియా వన్డే జట్టులో రోహిత్ స్థానానికి జైస్వాల్ నేరుగా పోటీ పడుతుండటంతో అతడు ముంబై ఫ్రాంచైజీకి వెళ్లడమే కరెక్ట్ అని రాయుడు భావిస్తున్నారు.

అంతేకాకుండా జైస్వాల్ తన దేశవాళీ క్రికెట్ (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ) అంతా ముంబై జట్టు తరఫునే ఆడాడు. కాబట్టి అతడికి ముంబై హోమ్ గ్రౌండ్ లాంటిది. జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్ అత్యంత అనుకూలమైన జట్టు అని రాయుడు తేల్చి చెప్పారు. ఈ మెగా ట్రేడింగ్ గనుక నిజమైతే రాబోయే సీజన్లలో ఐపీఎల్ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయమని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More