IPL 2026 points table : డూ ఆర్​ డై పోరులో గెలిచిన ముంబై ఇండియన్స్- ఐపీఎల్​ పాయింట్స్​ టేబుల్​ ఇలా..

MI vs Lucknow : లక్నోతో జరిగిన పోరులో గెలిచి ఐపీఎల్​ 2026 ప్లేఆఫ్స్​ రేసును సజీవంగా ఉంచుకుంది ముంబై ఇండియన్స్​. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ అనంతరం ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో మార్పులను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 5, 2026, 06:44:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mumbai Indians Lucknow Super Giants : ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించింది. 10 మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని నమోదు చేసిన ముంబై, 6 పాయింట్లతో ప్లేఆఫ్స్​ ఆశలను సజీవం చేసుకుంది.

ముంబై ఇండియన్స్​ ఓపెనర్​ రోహిత్​ శర్మ.. (AP)
ముంబై ఇండియన్స్​ ఓపెనర్​ రోహిత్​ శర్మ.. (AP)

ఈ మ్యాచ్​ అనంతరం ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్ ఇలా​..

సర్పంచ్​ శ్రేయస్​ అయ్యర్​ నేతృత్వంలోని పంజాబ్​ కింగ్స్​.. అనేక వారాలుగా ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో టాప్​లో నిలుస్తోంది. ఈ సీజన్​లో ఇప్పటివరకు అతి తక్కువ మ్యాచ్​లు ఓడిపోయిన జట్టు కూడా ఇదే. మొత్తం మీద ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన ఈ టీమ్ 13 పాయింట్లతో (1 మ్యాచ్​ వర్షం వల్ల జరగలేదు), 0.85 రన్​రెట్​తో నెంబర్​.1లో ఉంది.

ఇక డిఫెండింగ్​ ఛాంపియన్స్​గా బరిలో దిగిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు పాయింట్స్ టేబుల్​లో రెండో స్థానంలో కొనసాగుతోంది. 9 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు దక్కించుకుంది. ఈ సీజన్​లో మెరుగైన నెట్​ రన్​రేట్​ (1.420) ఉన్న జట్టు ఇదే.

ఇక కావ్య మారన్​కి చెందిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ 3వ స్థానంలో కొనసాగుతోంది. 10 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు దక్కించుకుంది. కాగా ఆర్సీబీ కన్నా నెట్​ రన్​రేట్​ తక్కువగా ఉండటంతో (0.64) 3వ స్థానంలో ఉంది.

మరోవైపు సీజన్​ ప్రారంభంలో అదరగొట్టి నెం.1లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్​.. ఇప్పుడు కాస్త వెనకంజలో ఉంది. 10 మ్యాచులు, 6 గెలుపులు, 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ జట్టు రన్​రేట్​ 0.510గా ఉంది.

వారం రోజులుగా వరుస విజయాలతో గుజరాత్​ టైటాన్స్​ మంచి జోరు మీద కనిపిస్తోంది. 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో, -0.14 నెట్​ రన్​రేట్​తో 5వ స్థానానికి చేరింది.

ఎంఎస్​ ధోనీ లేని చెన్నై సూపర్​కింగ్స్​.. ఐపీఎల్​ 2026లో ఎదురీదుతోంది. 9 మ్యాచుల్లో 4 విజయాలతో, 8 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈ జట్టు నెట్​ రన్​రేట్​ 0.005గా ఉంది.

ఇక దిల్లీ క్యాపిటల్స్​ 7వ స్థానానికి పరిమితం అయ్యింది. 9 మ్యాచుల్లో 4 విజయాలతో, 8 పాయింట్లతో (-0.89) 7వ స్థానంలో ఉంది.

ఐపీఎల్​ 2026ని అత్యంత పేలవంగా ప్రారంభించిన 3టైమ్​ ఐపీఎల్​ ఛాంపియన్ కోల్​కతా నైట్​రైడర్స్.. గత కొన్ని మ్యాచుల్లో కోలుకుంది! ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 3సార్లు గెలిచింది. వర్షం వల్ల ఆగిపోయిన మ్యాచ్​లో ఒక పాయింట్​ రావడంతో ఈ జట్టుకు ఇప్పుడు మొత్తం మీద 7 పాయింట్లు (-0.53 రన్​రేట్​) ఉన్నాయి. టేబుల్​లో 8వ స్థానంలో ఉంది.

ఐదుసార్లు ఐపీఎల్​ ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్.. సోమవారం ఎల్​ఎస్​జీతో జరిగిన 'డూ ఆర్​ డై' పోరులో గెలిచి ప్లేఆఫ్స్​ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొత్తం మీద ఈ జట్టు 10 మ్యాచుల్లో 3 విజయాలతో 9వ స్థానంలో ఉంది. ఈ టీమ్​ నెట్​ రన్​రేట్​- 0.64గా ఉంది.

ఇక లక్నో సూపర్​ జెయింట్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.​ 9 మ్యాచుల్లో రెండే విజయాలతో 4 పాయింట్లు సాధించి 10వ ప్లేస్​లో ఉంది. అయితే, ఈ జట్టు నెట్​ రన్​రేట్​ (-1.07) దారుణంగా ఉండటం మరొక ఆందోళనకర విషయం. ఐపీఎల్​ 2026 ప్లేఆఫ్స్​ రేసు నుంచి ఈ జట్టు దాదాపు ఔట్​ అయిపోయినట్టే!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More