CSK vs MI : ముంబై ఇండియన్స్‌కి 7వ ఓటమి- ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కి వెళ్లగలదా?
Mumbai Indians playoffs : ఐపీఎల్ 2026లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఇది ఈ జట్టుకు 7వ ఓటమి. మరి ప్లేఆఫ్స్‌కి చేరుకునేందుకు ఎంఐకి ఇంకా ఛాన్స్ ఉందా? లేక టోర్నీ నుంచి నిష్క్రమించినట్టేనా?
ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) పరిస్థితి ఈ 2026 సీజన్‌లో మాత్రం అగమ్యగోచరంగా తయారైంది! శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. ఫలితంగా ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ముంబై 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా సేన.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇప్పుడు అద్భుతమే జరగాల్సిందే!

ఐపీఎల్ 2026- పాయింట్ల లెక్కలు: 14 పాయింట్లు సరిపోతాయా?
ముంబై ఇండియన్స్‌కు ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచినా, ఆ జట్టు గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. సాధారణంగా 10 జట్లు ఉన్న ఐపీఎల్ టోర్నీలో 16 పాయింట్లు ఉంటేనే టాప్-4లో చోటు గ్యారెంటీ అని చెప్పవచ్చు. 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్లడం అసాధ్యం కాకపోయినా, అది ఇతర జట్ల గెలుపోటములపై, నెట్ రన్-రేట్‌పై ఆధారపడి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ ముందున్న కఠిన సవాళ్లు..
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే.. ప్రతి మ్యాచ్‌లో కేవలం గెలవడమే సరిపోదు, భారీ విజయాలు నమోదు చేయాలి. అప్పుడే ప్రస్తుతం ఆ జట్టుకు ఉన్న దారుణమైన నెట్ రన్ రేట్ (-0.803) మెరుగుపడుతుంది.
మండే 'డూ ఆర్ డై': మే 4న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఓడిపోతే, అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.
వరుస విజయాలు: మిగిలిన 5 మ్యాచ్‌ల్లో (ఎల్ఎస్జీ, ఆర్సీబీ, పీబీకేఎస్, కేకేఆర్, ఆర్ఆర్) ఖచ్చితంగా గెలవాలి.
ఇతర జట్లపై ఆధారపడటం: టేబుల్ టాప్-4లో ఉన్న పంజాబ్ (13 పాయింట్లు), ఆర్సీబీ, రాజస్థాన్, హైదరాబాద్ (తలా 12 పాయింట్లు) మిగిలిన జట్లపై విపరీతంగా గెలవాలి. తద్వారా 14 పాయింట్ల మార్కును దాటని జట్ల సంఖ్య పెరిగితేనే ముంబైకి అవకాశం ఉంటుంది.
ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్‌లు..
మే 4- ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జీ
మే 10- ఆర్సీబీ వర్సెస్ ఎంఐ
మే 14- పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ
మే 20- కేకేఆర్ వర్సెస్ ఎంఐ
మే 24- ఎంఐ వర్సెస్ ఆర్ఆర్
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్ జట్లు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు తన తలరాతను తానే మార్చుకుంటుందో లేక లీగ్ స్టేజ్‌లోనే ఇంటిబాట పడుతుందో చూడాలి.
అయితే, టోర్నీ నుంచి దాదాపు ఔట్ అయిపోయిన దశ నుంచి కమ్‌బ్యాక్ ఇచ్చి, ట్రోఫీనే కొట్టేసిన ఘనత ఎంఐకి ఉంది కాబట్టి.. రానున్న రోజుల్లో ఈ టీమ్ ఎలాంటి సంచలనాలు చేస్తుందోనని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ముంబై ఇండియన్స్ ఇంకా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉందా?
అవును, లెక్కల పరంగా ముంబైకి ఇంకా స్వల్ప అవకాశం ఉంది. అయితే మిగిలిన 5 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఖచ్చితంగా గెలవాలి, ఇతర జట్ల ఫలితాలు ముంబైకి అనుకూలంగా రావాలి.
2. ముంబైకి ఎన్ని పాయింట్లు వచ్చే అవకాశం ఉంది?
ప్రస్తుతం ముంబై వద్ద 4 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన 5 మ్యాచ్‌లు గెలిస్తే గరిష్టంగా 14 పాయింట్లకు చేరుకుంటుంది.
3. ఏ మ్యాచ్ ఓడిపోతే ముంబై టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది?
మే 4న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోతే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


