Riyan Parag: ఐపీఎల్ లో డ్రెస్సింగ్ రూమ్‌లో స్మోకింగ్.. వివాదంలో రియాన్ పరాగ్.. జైలు శిక్ష తప్పదా?
Riyan Parag: పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో పరాగ్ ఈ-సిగరెట్ (వేప్) కాలుస్తూ కెమెరాకు చిక్కడం పెను వివాదంగా మారింది.
Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్ వరుస విజయాలకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. అయితే, మైదానంలో జట్టు సాధించిన విజయం కంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రవర్తనే ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉండాల్సిన రాజస్థాన్ రాయల్స్, పరాగ్ చేసిన చిన్న పొరపాటు వల్ల సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది.

కెమెరాకు చిక్కిన రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్ లో 16వ ఓవర్లో లైవ్ కెమెరాలు డ్రెస్సింగ్ రూమ్ వైపు మళ్లాయి. ఆ సమయంలో రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ (వేపింగ్) కాలుస్తూ స్పష్టంగా కనిపించాడు. ఈ దృశ్యాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో ఐపీఎల్ 2026 మ్యాచ్ లో మైదానంలో జట్టు కనబరిచిన అద్భుత ప్రదర్శన పక్కకు వెళ్లిపోయి, పరాగ్ క్రమశిక్షణపై చర్చ మొదలైంది. ఒక బాధ్యతాయుతమైన కెప్టెన్ హోదాలో ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
భారత చట్టాలు ఏం చెబుతున్నాయి?
రియాన్ పరాగ్ చర్య కేవలం స్టేడియం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, ఇది భారత చట్టాల ప్రకారం కూడా నేరం. సాధారణంగా స్టేడియం ప్రాంగణంలో లేదా డ్రెస్సింగ్ రూమ్‌లలో ధూమపానం చేయడం నిషిద్ధం. అయితే, దీనికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భారతదేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం ఉంది.
"ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) - 2019" ప్రకారం.. దేశంలో వేప్స్ లేదా ఈ-సిగరెట్ల ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు, దిగుమతి, ఎగుమతి, ప్రకటనలు పూర్తిగా నిషేధం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ (1940) పరిధిలోకి ఇవి రాకపోవడంతో, 2019 సెప్టెంబర్ 18 నుండి వీటిపై కేంద్రం కఠిన నిషేధం విధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
వివాదాలు కొత్తేమీ కాదు
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ నిబంధనలకు విరుద్ధంగా డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ దొరికిపోయాడు.
బిసీసీఐ (BCCI) యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) హెడ్ శరద్ కుమార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని భిందర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశాడు. దీనిపై ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో, నిబంధనల ఉల్లంఘన కింద అతనికి రూ. 1 లక్ష జరిమానా విధించడంతో పాటు అధికారిక హెచ్చరికను జారీ చేశారు.
ఇప్పుడు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకోవడంతో బిసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఒకవైపు ఐపీఎల్ నిబంధనలు, మరోవైపు దేశీయ చట్టాలు రెండింటినీ ఉల్లంఘించినట్లవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న రియాన్ పరాగ్ చేసిన తప్పేమిటి?
జవాబు పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ (వేప్) కాలుస్తూ కెమెరాకు చిక్కాడు. ఇది స్టేడియం నిబంధనలకు విరుద్ధం.
ప్రశ్న భారత్‌లో ఈ-సిగరెట్లపై నిషేధం ఉందా?
జవాబు అవును. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) 2019 ప్రకారం, భారతదేశంలో వేప్స్ లేదా ఈ-సిగరెట్ల వాడకం, విక్రయం, దిగుమతి చట్టరీత్యా నేరం.
ప్రశ్న రియాన్ పరాగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
జవాబు నిబంధనల ప్రకారం జరిమానా విధించడమే కాకుండా, భారత చట్టాలను ఉల్లంఘించినందుకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


