కీర్తి సురేష్, కృతి శెట్టి చేయి పట్టుకుని లాగిన రాఘవేంద్రరావు- వెంకటేష్ కల్యాణ్ రామ్ మూవీ లాంచ్‌లో రాజుకున్న వివాదం!
Raghavendra Rao Behaviour With Keerthy Suresh Krithi Shetty: దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభోత్సవంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రవర్తన వివాదాస్పదమైంది. ముహూర్తపు షాట్ తీసే సమయంలో కీర్తి సురేష్, కృతి శెట్టిల చేతులు పట్టుకుని లాగడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Raghavendra Rao Behaviour With Keerthy Suresh Krithi Shetty: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రం ముహూర్తం వేడుకలో ఊహించని వివాదం రేగింది. చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సీనియర్ దర్శకుడు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.

నందమూరి కల్యాణ్ వెంకటేష్ మూవీ
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా (#VenkyAnil5 - #NKRAR2) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజులతో పాటు 84 ఏళ్ల దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు.
ముహూర్తపు షాట్‌కు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, గౌరవ సూచకంగా రాఘవేంద్రరావు మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. అయితే, ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సరికొత్త వివాదం రాజుకుంది.
వైరల్ వీడియో.. అసలు ఏం జరిగిందంటే?
ముహూర్తపు షాట్ డైరెక్ట్ చేసే క్రమంలో కెమెరా వెనుక నిల్చున్న రాఘవేంద్రరావు.. అక్కడ ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ చేయి పట్టుకుని తన వైపునకు గట్టిగా లాగారు. ఆ తర్వాత వెంటనే మరో హీరోయిన్ కృతి శెట్టి చేయి పట్టుకుని ముందుకు లాగుతూ.. హీరోలు వెంకటేష్, కల్యాణ్ రామ్‌ల భుజాలపై చేతులు ఎలా వేయాలో యాక్ట్ చేసి చూపించారు.
హీరోయిన్ల పట్ల ఆయన అంతగా చొరవ తీసుకుంటూ చేతులు పట్టుకుని లాగడం అక్కడి వారిని కాస్త ఇబ్బందికి గురిచేసింది. ఈ వీడియో కాస్తా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు దర్శకేంద్రుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. పాత విషయాలు గుర్తుచేస్తూ..
"ఆడవారి అనుమతి లేకుండా వారిని అలా తాకే హక్కు ఈ ముసలాయనకు ఎవరు ఇచ్చారు?" అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. "అసలు ఇలా ప్రవర్తించడం ఏంటి? హీరోయిన్లను తాకకుండానే సీన్ ఎలా చేయాలో వివరించవచ్చు కదా.. ఇది చూడ్డానికి చాలా అసభ్యంగా ఉంది" అని మరొకరు కామెంట్ చేశారు.
గతంలో నటి నిహారిక కొణిదెల విషయంలో కూడా రాఘవేంద్రరావు ఇలాగే ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నారని, అయినా ఆయన తన పద్ధతి మార్చుకోలేదని కొందరు గుర్తుచేస్తున్నారు. "ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆయన చేసినవన్నీ చెల్లిపోయాయి.. కానీ ఈ డిజిటల్ రోజుల్లో కూడా హీరోయిన్లతో ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకోరు" అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.
మరోవైపు సినిమా ప్రారంభంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. "థియేటర్లలో ప్రేక్షకులను అలరించడం కంటే నాకు పెద్ద ఆనందం మరొకటి లేదు. ఎంతో సంతోషం, కృతజ్ఞత, బాధ్యతతో ఈ రోజు మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. వేడుకకు విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు" అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
తాప్సీ పాత కామెంట్స్ మళ్లీ ట్రెండింగ్
ఈ వివాదం నడుస్తుండగానే, గతంలో హీరోయిన్ తాప్సీ పన్ను దర్శకేంద్రుడిపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2017లో ఒక టాక్ షోలో తాప్సీ మాట్లాడుతూ, తన మొదటి సినిమా 'ఝుమ్మంది నాదం' (2010) షూటింగ్ సమయంలో రాఘవేంద్రరావు తన నడుముపై పండ్లు, కొబ్బరికాయలు వేయడంపై సెటైర్లు వేశారు.
"నా నడుముపై కొబ్బరికాయ కొట్టడంలో ఉన్న రొమాన్స్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు" అని తాప్సీ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపగా, తాను కేవలం నిజాలు మాత్రమే మాట్లాడానని తాప్సీ సమర్థించుకున్నారు.
నేటి తరం డిజిటల్ మీడియా కాలంలో ఇలాంటి ప్రవర్తనను ప్రేక్షకులు అస్సలు అంగీకరించడం లేదని తాజా వివాదం నిరూపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


