LIK OTT Official: ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ- 26 రోజుల్లోనే- ఎక్కడ చూడాలంటే?
Love Insurance Kompany OTT Release Announced Officially: విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ రోమాంటిక్ కామెడీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఎల్ఐకే ఓటీటీ రిలీజ్ కానుంది.
సౌత్‌లో మంచి క్రెజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్ఐకే). ఈ మూవీలో ప్రదీప్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి నటించింది. 'లవ్ టుడే' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్‌కు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ప్రదీప్ సినిమాల కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా ఎల్ఐకే చిత్రం కేవలం 60.23 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ప్రదీప్ గత చిత్రాలైన 'డ్రాగన్' (రూ. 151 కోట్లు), 'డ్యూడ్' (రూ. 114 కోట్లు) వంద కోట్ల క్లబ్‌లో చేరగా, ఈ సినిమా ఆ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విఫలమైంది.
ఈ సినిమాకు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. విఘ్నేష్ శివన్ మార్క్ కామెడీ, ఎస్.జె. సూర్య నటన ఉన్నప్పటికీ, కథలో వేగం లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. భవిష్యుత్తులో ప్రేమ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ లవ్ రొమాంటిక్ కామెడీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాన్ని తెరకెక్కించారు.
అసలు కథేంటంటే?
2040వ సంవత్సరం నేపథ్యంలో సాగే ఈ కథలో భవిష్యత్తు టెక్నాలజీని చూపించారు. డేటింగ్ యాప్స్ ద్వారా పార్ట్నర్లను వెతుక్కునే కాలంలో, సహజంగా ప్రేమలో పడాలని కోరుకునే ఒక యువకుడి ప్రయాణమే ఈ సినిమా.
2019లోనే శివకార్తికేయన్‌తో ఈ సినిమాను విఘ్నేష్ శివన్ ప్రారంభించాల్సి ఉన్నా, పలు కారణాలతో వాయిదా పడుతూ చివరకు ప్రదీప్ రంగనాథన్ హీరోగా గతేడాది పట్టాలెక్కింది. ఇందులో యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఐఎమ్‌డీబీలో పదికి 6.9 రేటింగ్ అందుకున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీలోకి వచ్చేయనుంది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ రిలీజ్ డేట్
ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఎల్ఐకే సినిమా, కేవలం 26 రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ రిలీజ్ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
మే 6 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ వంటి 5 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. "పాత పద్ధతులు వర్సెస్ ఆధునిక రూల్స్ మధ్య జరిగే ఈ ప్రేమ యుద్ధం" అంటూ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఎల్ఐకే ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ప్రదీప్ కెరీర్‌లో చూడకుండా వదిలేయాల్సిన మొదటి సినిమా ఇదే" అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు తలనొప్పి కలిగించే సినిమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రదీప్ రంగనాథన్‌కి ఉన్న క్రేజ్ వల్ల లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, అవి అందుకోవడంలో విఘ్నేష్ శివన్ విఫలమయ్యారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ, డిఫరెంట్ అటెంప్ట్‌గా వచ్చిన ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవాళ్లు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు?
ఈ సినిమా మే 6, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
2. ఈ సినిమా ఏ భాషల్లో అందుబాటులో ఉంటుంది?
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
3. 'లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ' సినిమాలో హీరోయిన్ ఎవరు?
ఈ చిత్రంలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది.
4. ఈ సినిమా దర్శకుడు ఎవరు?
ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


