Prabhas Mahesh: వారణాసిలో పరశురాముడిగా ప్రభాస్- మహేశ్ బాబుతో యుద్ధం- సీతగా మ్యాచ్ కానీ కీర్తి సురేష్-2 వేల కోట్లు పక్కా!

Prabhas In Mahesh Babu Varanasi As Parashurama Video: రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఒకే స్క్రీన్‌పై పౌరాణిక పాత్రల్లో తలపడితే ఎలా ఉంటుందో కళ్లకూట్టినట్లు చూపించింది ఒక వీడియో. వారణాసిలో అత్యంత క్రోధ పరశురాముడిగా ప్రభాస్.. రాముడి పాత్రలోని మహేశ్ బాబుతో చేసే పోరాటం ఆకట్టుకుంటోంది.

Published on: Jun 12, 2026, 10:33:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prabhas In Mahesh Babu Varanasi As Parashurama Video: తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలైన రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ప్రతి సినీ అభిమానికి ఉంటుంది.

వారణాసిలో పరశురాముడిగా ప్రభాస్- మహేశ్ బాబుతో యుద్ధం- సీతగా మ్యాచ్ కానీ కీర్తి సురేష్-2 వేల కోట్లు పక్కా!
వారణాసిలో పరశురాముడిగా ప్రభాస్- మహేశ్ బాబుతో యుద్ధం- సీతగా మ్యాచ్ కానీ కీర్తి సురేష్-2 వేల కోట్లు పక్కా!

మహేశ్, ప్రభాస్ కాంబో

మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ రావడం ఖాయం. అయితే, నిజ జీవితంలో ఈ కలయిక ఎప్పుడు సాధ్యమవుతుందో తెలియదు కానీ, సోషల్ మీడియా ప్రపంచంలో మాత్రం అభిమానులు తమ ఊహాశక్తికి పదును పెట్టి సరికొత్త విజువల్స్ సృష్టిస్తున్నారు.

తాజాగా వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో వీరిద్దరూ పౌరాణిక పాత్రల్లో ఎదురెదురుపడిన ఒక ఫ్యాన్ మేడ్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దాన్ని ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కుస్తున్న వారణాసి టీజర్ గ్లింప్స్‌గా నెట్టింట్లోకి వదిలారు.

పరశురాముడిగా ప్రభాస్.. రాముడిగా మహేశ్!

ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేసిన ఈ వీడియోలో ప్రభాస్‌ను అమిత క్రోధంతో ఊగిపోయే పరశురాముడిగా చూపించారు. అలాగే శాంతికి, ధర్మానికి నిలువెత్తు రూపమైన శ్రీరాముడి పాత్రలో మహేశ్ బాబు విజువల్స్‌ను అద్భుతంగా అమర్చారు. ఇక సీతగా కీర్తి సురేష్‌ను చూపించినట్లుగా క్యాప్షన్ క్రెడిట్స్‌లో చెప్పారు.

రామాయణంలో సీతా స్వయంవరం సందర్భంగా శివధనస్సు విరిచిన తర్వాత, శ్రీరాముడిని హెచ్చరించడానికి పరశురాముడు వచ్చే ఘట్టం ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. అదే సన్నివేశాన్ని ఈ తరం ఇద్దరు స్టార్ హీరోల ముఖ చిత్రాలతో ఎడిట్ చేసి, పవిత్ర కాశీ క్షేత్రంలోని గంగా ఘాట్ల నేపథ్యంలో చూపించిన తీరు వావ్ అనిపించేలా ఉంది.

పౌరాణిక లుక్స్‌లో పర్ఫెక్ట్ మ్యాచ్

ప్రభాస్ ఇదివరకే 'ఆదిపురుష్' సినిమాలో రాఘవుడిగా నటించి మెప్పించారు. ఆయనకున్న భారీ కటౌట్, గంభీరమైన వాయిస్ పరశురాముడి లాంటి ఉగ్రరూప పాత్రలకు వంద శాతం సరిపోతాయని ఈ ఎడిటింగ్ వీడియో నిరూపించింది.

మరోవైపు మహేశ్ బాబు తనదైన దైవిక, ప్రశాంతమైన లుక్స్‌తో కోదండ రాముడి పాత్రకు సరిగ్గా సరిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పరశురాముడి పాత్రలో ప్రభాస్ క్రోధం, రాముడిగా మహేశ్ బాబు శాంతింపజేసే ఆ విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. ఇది చూసిన ఇరు హీరోల ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

కాగా, ప్రస్తుతం మహేశ్ బాబు గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ అడ్వెంచర్ యాక్షన్ సినిమా వారణాసి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో కూడా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రామాయణానికి సంబంధించిన కొన్ని పరోక్ష ఛాయలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఇలాంటి హై-వోల్టేజ్ పౌరాణిక విజువల్స్ బయటకు రావడం ఫ్యాన్ బేస్‌లో పూనకాలు తెప్పిస్తోంది.

సోషల్ మీడియాను ఊపేస్తున్న కామెంట్లు

అత్యాధునిక ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, ఏఐ (కృత్రిమ మేధస్సు) టూల్స్ సాయంతో ఫ్యాన్స్ చేస్తున్న ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు ఇండస్ట్రీ క్రియేటర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం కొన్ని గంటల్లోనే ఈ గ్లింప్స్ లక్షలాది వ్యూస్, వేల కొద్దీ షేర్లతో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విభాగాన్ని శాసిస్తోంది.

"ఇలాంటి కాంబినేషన్‌లో నిజంగా సినిమా వస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 2000 కోట్ల వసూళ్లు గ్యారెంటీ" అని ఒక అభిమాని కామెంట్ సెక్షన్‌లో రాసుకొచ్చారు. "రాజమౌళి గారు దయచేసి ఈ వీడియో చూడండి, మన టాలీవుడ్‌లో ఇలాంటి ఒక పౌరాణిక యుద్ధం పడితే చూడాలని ఉంది" అని మరో నెటిజన్ తన తన కోరికను వ్యక్తపరిచారు.

సీతగా మ్యాచ్ కానీ కీర్తి సురేష్

ఈ వైరల్ వీడియో టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ట్రీట్ ఇస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, సీత పాత్రలో కీర్తి సురేష్ పోలికలు సరిగ్గా మ్యాచ్ కాకపోవడం ఒకింత నిరాశపరిచే విషయం కావడం గమనార్హం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More