OTT Weekend: ఓటీటీలో చూడాల్సిన టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్స్- వీకెండ్‌కి ది బెస్ట్- ఒక్కోటి ఒక్కోరకం- అన్నీ తెలుగులోనే!
OTT Movies To Watch This Weekend: ఓటీటీ ఈ వీకెండ్‌లో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సోనీ లివ్‌లలో తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న 7 సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్, వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
OTT Movies To Watch This Weekend Telugu: వారమంతా పనులతో అలసిపోయిన సినీ ప్రియులు వీకెండ్‌లో ఓటీటీల్లో మంచి కంటెంట్ కోసం వెతుకుతుంటారు. సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, ఊహించని మలుపులు ఉండే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో ఈ వీకెండ్‌లో తెలుగులో కట్టిపడేసే ది బెస్ట్ 7 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ఓ లుక్కేద్దాం.

1. కిష్కింధ కాండం (Kishkindha Kaandam)- జియో హాట్‌స్టార్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8/10
ఒక ఫ్యామిలీ నేపథ్యంలో సాగే అరుదైన మిస్టరీ డ్రామా ఇది. అసిఫ్ ఆలీ, సీనియర్ నటుడు విజయరాఘవన్ పోషించిన అప్పు, పిళ్లై పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. కథను నడిపించిన తీరు, సీన్స్ మూడ్‌ని సెట్ చేసే నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని ఆద్యంతం అలరిస్తాయి. కథనం కాస్త నెమ్మదిగా సాగడం వల్ల స్లో-బర్న్ సినిమాలు నచ్చని వారి ఓపికను పరీక్షించినట్లుగా అనిపించవచ్చు.
2. బైషే శ్రాబొన్ (Baishe Srabon)- అమెజాన్ ప్రైమ్ వీడియో
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.1/10
బెంగాలీ కవితల ఆధారంగా హత్యలు చేసే ఒక సైకో సీరియల్ కిల్లర్ కథతో ఈ చిత్రం రూపొందింది. ప్రసేన్‌జిత్ ఛటర్జీ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం, అనుపమ్ రాయ్ సంగీతం చిత్రానికి ప్రాణం పోశాయి. సబ్‌టైటిల్స్‌తో చూసే సస్పెన్స్ ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన మాస్టర్‌పీస్.
3. పోర్ తొళిల్ (Por Thozhil)- సోనీ లివ్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8/10
ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ పోలీస్ (ఆర్. శరత్‌కుమార్), భయస్తుడైన యంగ్ ఆఫీసర్ (అశోక్ సెల్వన్) కలిసి ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లే ఈ సినిమా. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, సైకలాజికల్ థ్రిల్ అద్భుతంగా పండాయి. డైలాగ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల కథను నిశితంగా గమనించాల్సి ఉంటుంది.
4. సూక్ష్మదర్శిని (Sookshmadarshini)- జియో హాట్‌స్టార్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.8/10
నజ్రియా నజీమ్, బేసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం డార్క్ హ్యూమర్, సస్పెన్స్ కలగలిపిన కథాంశంతో సాగుతుంది. పక్కింటి వ్యక్తి ప్రవర్తనపై అనుమానంతో మొదలయ్యే కథ, ఊహించని విధంగా ఒక కీలకమైన సామాజిక అంశాన్ని స్పృశిస్తూ ముగుస్తుంది. నిడివి కాస్త ఎక్కువగా ఉండటం మినహా మిగతా అంతా ఆకట్టుకుంటుంది.
5. కన్నూర్ స్క్వాడ్ (Kannur Squad)- జియో హాట్‌స్టార్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.6/10
మమ్ముట్టి నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫిక్షన్ హంగామా లేకుండా, పరిమిత వనరులతో పోలీసులు నేరస్థులను ఎలా పట్టుకుంటారనే నిజమైన పరిస్థితులను ఇందులో సహజంగా చూపించారు. సుశిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపించినా, నేర పరిశోధన చిత్రాలను ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.
6. ఇమైక్కా నొడిగళ్ (Imaikkaa Nodigal)- అమెజాన్ ప్రైమ్ వీడియో
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.3/10
సీబీఐ అధికారిగా నయనతార, క్రూరమైన సీరియల్ కిల్లర్‌గా అనురాగ్ కశ్యప్ మధ్య సాగే మైండ్ గేమ్స్ ఈ చిత్రానికి హైలైట్. విజయ్ సేతుపతి అతిథి పాత్ర, ఊహించని ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. లవ్ ట్రాక్ కథ వేగాన్ని కాస్త తగ్గించినా, క్లైమాక్స్ వరకు ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ సినిమాను అంజలి సీబీఐగా పేరుతో అందుబాటులో ఉంది.
7. తలవన్ (Thalavan)- సోనీ లివ్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.2/10
ఇద్దరు పోలీసు అధికారుల మధ్య ఉండే ఆధిపత్య పోరు, ఈగో ఘర్షణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బిజూ మీనన్, అసిఫ్ ఆలీ తమ పాత్రల్లో జీవించారు. ప్రథమార్థం చాలా వేగంగా సాగుతూ ఆసక్తికరమైన సస్పెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. క్లైమాక్స్ భాగం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, థ్రిల్లర్ ప్రియులకు నచ్చుతుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


