OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ టు బిగ్ బాస్ తనూజ సిరీస్!
OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాల జాబితా గురించి ఇక్కడ తెలుసుకుందాం. అందులో సుమంత్, జగపతి బాబుల క్రైమ్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా నుంచి బిగ్ బాస్ తనూజ సిరీస్ వరకు, ఈటీవీ విన్ నుంచి నెట్‌ఫ్లిక్స్ దాకా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
Top 7 OTT Movies To Watch This Week: ఈ వారం ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. కానీ, వాటిలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈటీవీ విన్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

న్యూటన్స్ థర్డ్ లా- ఈటీవీ విన్ ఓటీటీ
తెలుగులో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా న్యూటన్స్ థర్డ్ లా. హీరోలు సుమంత్, జగపతి బాబు మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా ఓ క్రైమ్ చుట్టూ సాగుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన న్యూటన్స్ థర్డ్ లా ఈటీవీ విన్‌లో ఆగస్ట్ 27న ఓటీటీ రిలీజ్ కానుంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీ సినిమాలు
ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా మూవీ): మలయాళ స్టార్ హీరో, వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఐ, నోబడీ ఆగస్టు 25న అంటే ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది బ్యాంక్ క్రైమ్, హీస్ట్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన థ్రిల్లర్. బ్యాంకు దోపిడీ వ్యవహారంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి చిక్కుకునే కథగా తెరకెక్కింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.
పార్ట్ టైమర్స్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్): బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రన్నరప్ తనూజ పుట్టస్వామి ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సిరీసే ఇది. తనూజతోపాటు జ్ఞానేశ్వరి కండ్రేగుల మరో ప్రధాన పాత్ర పోషించిన పార్ట్ టైమర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఈవారమే కానుంది. జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి ఆగస్ట్ 28న ఈ సిరీస్ రిలీజ్ కానుంది. వ్యాపార రంగంలో ఎదగాలని కలలు కనే ఇద్దరు సహోద్యోగుల కథ ఇది. కెరీర్, లక్ష్యాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఈ ఓటీటీ సిరీస్‌లో చూపించనున్నారు.
ఆల్ఫా- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఆల్ఫా (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాట్ బ్యూటీ శార్వరి వాఘ్ మెయిన్ లీడ్ రోల్స్‌నటించిన యశ్ రాజ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీ మూవీ ఆల్ఫా. బాబీ డియోల్ విలన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో, హృతిక్ రోషన్ కెమియో అలరించిన ఆల్ఫా ఆగస్ట్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఆకలిరాజ్యం- ఆహా ఓటీటీ
ఆకలిరాజ్యం 2026 (తెలుగు సోషల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్): నేటి తరం నిరుద్యోగ యువత కథలను కళ్లకు కట్టేలా రూపొందించిన తెలుగు వెబ్ సిరీసే ఆకలి రాజ్యం. ఆహాలో ఈ నెల 28న ఆకలిరాజ్యం ఓటీటీ రిలీజ్ కానుంది. వికాస్ వశిష్ట, గీత్ సైనీ, రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. 'ఒక డిగ్రీ, ఒక కల, వెయ్యి రిజెక్షన్స్. ముగ్గురు ఫ్రెండ్స్. ఒకే కల. ఇంకా టైం రాలేదని చెప్పే ప్రపంచం' అంటూ నిరుద్యోగుల చుట్టూ సాగే కథగా ఈ సిరీస్ తెరకెక్కించారు.
జీ5 ఓటీటీలో బందర్
బందర్ (హిందీ డార్క్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ): యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బందర్ ఆగస్ట్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటించారు. ఓ మహిళ చేసిన ఆరోపణతో ఓ వ్యక్తి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. మీడియా తీర్పులు, సామాజిక ఒత్తిడి అతడి జీవితంపై చూపించే ప్రభావాన్ని ఈ సినిమాలో చూపించారు.
సోనీ లివ్ ఓటీటీలో రోజా అన్బే డయానా
అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం): తెలుగు సీనియర్ హీరోయిన్, నటి ఆర్కే రోజా చాలా కాలం గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. పరి ఎలవళగన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. భిన్నమైన నేపథ్యాలకు చెందిన ఇద్దరి ప్రేమకథ చుట్టూ సినిమా సాగుతుంది. వారి ప్రేమకు కుటుంబాల నుంచి ఎదురయ్యే సమస్యలు కథలో ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో ఆగస్ట్ 28న అన్బే డయానా రిలీజ్ అవనుంది.
ఒక్కరోజే 5, తెలుగులో 5
ఇలా ఈ వారం (ఆగస్ట్ 24 నుంచి 30) సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి బిగ్ బాస్ తనూజ సిరీస్, ఆర్కే రోజా రొమాంటిక్ డ్రామా వరకు చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో ఒక్క ఆగస్ట్ 28 నుంచే 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కావడం విశేషం. అలాగే, ఇందులో తెలుగులో కూడా 5 సినిమాలు ఓటీటీలో అలరించనున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


