నెలకు 17 లక్షల అద్దె, 68 లక్షల అడ్వాన్స్- గర్ల్‌ఫ్రెండ్‌కు మాత్రం 75 వేలకే రెంట్- హీరో హృతిక్ రోషన్ రియల్ ఎస్టేట్ దందా!

Hrithik Roshan Lease For 17 Lakh Rent: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముంబై అందేరీ వెస్ట్‌లోని తన కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌ను 'క్లియర్‌సింత్ ల్యాబ్స్' సంస్థకు ఐదేళ్ల కాలానికి అద్దెకు ఇచ్చారు. ఈ డీల్ ద్వారా ఆయనకు మొదటి మూడేళ్లు నెలకు రూ.17 లక్షల చొప్పున భారీ ఆదాయం రానుంది. ఇది హాట్ టాపిక్ అవుతోంది.

Published on: Aug 2, 2026, 15:59:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hrithik Roshan Lease For 17 Lakh Rent: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కేవలం వెండితెరపైనే కాక, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ తన సత్తా చాటుతున్నారు. సినిమాల ద్వారా వచ్చే సంపాదనను సురక్షితమైన వాణిజ్య ఆస్తుల్లో (Commercial Properties) పెట్టుబడిగా పెడుతూ స్థిరమైన అద్దె ఆదాయాన్ని గడిస్తున్నారు.

నెలకు 17 లక్షల అద్దె, 68 లక్షల అడ్వాన్స్- గర్ల్‌ఫ్రెండ్‌కు మాత్రం 75 వేలకే రెంట్- హీరో హృతిక్ రోషన్ రియల్ ఎస్టేట్ దందా!
నెలకు 17 లక్షల అద్దె, 68 లక్షల అడ్వాన్స్- గర్ల్‌ఫ్రెండ్‌కు మాత్రం 75 వేలకే రెంట్- హీరో హృతిక్ రోషన్ రియల్ ఎస్టేట్ దందా!

రూ.17 లక్షల అద్దె.. రూ.68 లక్షల అడ్వాన్స్!

ఇందులో భాగంగానే ముంబైలోని అత్యంత ఖరీదైన అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న తన ఆఫీస్ స్పేస్‌ను భారీ అద్దెకు ఇచ్చి వార్తల్లో నిలిచారు హృతిక్ రోషన్. అందేరీ వెస్ట్‌లోని న్యూ లింక్ రోడ్డులో ఉన్న 'లోటస్ నిల్ కమల్ బిజినెస్ పార్క్'లో హృతిక్ రోషన్‌కు ఏడు ఆఫీస్ యూనిట్లు ఉన్నాయి.

సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీని 'క్లియర్‌సింత్ ల్యాబ్స్ లిమిటెడ్' అనే సంస్థకు ఐదేళ్ల కాలపరిమితికి అద్దెకు ఇచ్చారు. ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డేటా అనాసిస్ సంస్థ 'సిఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) అందించిన పత్రాల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి.

మొదటి మూడేళ్లకు

ఈ ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2029 వరకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.17 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తారు. చివరి రెండేళ్ల కాలానికి (2029 నుంచి 2031 వరకు) అద్దె రూ.19.55 లక్షలకు పెరుగుతుంది.

ఈ డీల్ కోసం సదరు సంస్థ రూ.68 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించడమే కాకుండా, ఏడు కార్ పార్కింగ్ స్లాట్లను కూడా పొందింది. ఈ అద్దె ఒప్పందం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 29న పూర్తయింది.

రియల్ ఎస్టేట్‌పై రోషన్ ఫ్యామిలీ ఫోకస్

బాలీవుడ్‌లో సంపాదించిన సొమ్మును వ్యాపారాల్లో మళ్లించడం కొత్తేమీ కాదు. హృతిక్ రోషన్ సైతం ఇటీవల కాలంలో స్థిరమైన పాసివ్ ఇన్‌కమ్ ఇచ్చే కమర్షియల్ ప్రాపర్టీలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ముంబైతో పాటు పూణేలో కూడా పలు ఆఫీస్ స్పేస్‌లను కార్పొరేట్ కంపెనీలకు అద్దెకు ఇస్తూ క్రమం తప్పకుండా రాబడి పొందుతున్నారు.

రోషన్ కుటుంబం కూడా రియల్ ఎస్టేట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. గతంలో హృతిక్, ఆయన తండ్రి రాకేష్ రోషన్, తల్లి ప్రమీలా రోషన్ సంయుక్తంగా అందేరీ వెస్ట్‌లోనే రూ.28 కోట్లు వెచ్చించి 10 ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు.

5 కమర్షియల్ యూనిట్స్

దీనికి అదనంగా రాకేష్ రోషన్ దంపతులు మరో రూ.19.68 కోట్లతో 5 కమర్షియల్ యూనిట్లను సొంతం చేసుకున్నారు. కమర్షియల్ స్పేస్‌పై ఆసక్తి చూపిస్తూనే, అందేరీలో ఉన్న తమ మూడు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లను రూ.6.75 కోట్లకు వీరు విక్రయించడం విశేషం.

గర్ల్‌ఫ్రెండ్‌కు మాత్రం తక్కువ అద్దెకే ఇల్లు!

వ్యాపార రీత్యా కమర్షియల్ ప్రాపర్టీల నుంచి లక్షల్లో సంపాదిస్తున్న హృతిక్, తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటారు. జుహులోని తన విలాసవంతమైన సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌కు నెలకు కేవలం రూ.75,000 నామమాత్రపు అద్దెకే కేటాయించి వార్తల్లో నిలిచారు.

సినిమా అవకాశాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని గ్లామర్ ఫీల్డ్‌లో, ఈ రకమైన కమర్షియల్ లీజింగ్ మోడల్స్ సెలబ్రిటీల ఆర్థిక భద్రతకు ఎంతగానో తోడ్పడతాయి. వ్యాపారవేత్తగా హృతిక్ వేస్తున్న ఈ ముందడుగులు ఆయన ఆర్థిక తెలివితేటలకు అద్దం పడుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More