Lalitha Movie: మూడోసారి దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు- గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదంటున్న లలిత!
Lyricist Jonnavithula Ramalingeswara Rao Lalitha Movie: ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మరోసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న చిత్రం 'లలిత'. నందిని, అభిలాష్, అఖిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సామాజిక చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే!
Lyricist Jonnavithula Ramalingeswara Rao Lalitha Movie: తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశాలకు, సామాజిక స్పృహతో కూడిన చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు అదే బాటలో ప్రముఖ గేయ రచయిత (లిరిసిస్ట్) జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సరికొత్త అవతారమెత్తారు.

అద్భుతమైన పాటలు రాసి
ఇన్నాళ్లూ తన కలంతో ఎన్నో అద్భుతమైన పాటలు రాసి అలరించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఇప్పుడు మరోసారి దర్శకుడిగా మారి ‘లలిత’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు దర్శకుడిగా పెళ్లాం పిచ్చోడు (హీరోగా రాజేంద్ర ప్రసాద్), సోంబేరి (అలీ) సినిమాలను తెరకెక్కించారు.
విలక్షణమైన క్యాప్షన్.. నారీ శక్తి కథాంశం
ఇప్పుడు జొన్నవిత్తులు మూడోసారి దర్శకత్వం వహిస్తున్న లలిత సినిమాను కాస్మిక్ పవర్ క్రియేట్స్ ఎల్ఎల్‌పీ (Cosmic Power Creates LLP) బ్యానర్‌పై పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పెట్టిన ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు...’ అనే ట్యాగ్‌లైన్ టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని సున్నితమైన సమస్యలను, వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ కథను సిద్ధం చేశారు. తన నమ్మకం, వ్యక్తిత్వం, హక్కుల కోసం ఒక సాధారణ మహిళ ఎలాంటి పోరాటం చేసిందనే అంశాన్ని జొన్నవిత్తుల ఎంతో పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నారు.
ఈ లలిత చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రాయడంతో పాటు ఆయనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలను భుజాన వేసుకోవడం విశేషం. ఇన్నాళ్లూ ఆయన సామాజిక అంశాలపై రాసిన పాటలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూసిన వారికి.. ఈ సినిమా కచ్చితంగా ఆలోచింపజేసేలా ఉంటుందనే నమ్మకం కలుగుతోంది.
కొత్త ప్రతిభకు పట్టాభిషేకం
‘లలిత’ చిత్రంతో ముగ్గురు సరికొత్త ప్రతిభావంతులను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. నందిని ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా అరంగేట్రం చేస్తున్నారు. నూతన నటీనటులతో పాటు టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టులు రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వీరందరి నటన సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. వీరితో పాటు డీడీ శ్రీనివాస్, వి. ఝాన్సీ మేఘనా, సురేష్ దామరపల్లి, శ్రీవాణి త్రిపురనేని, జయశ్రీ రాచకొండ, మహేంద్రనాథ్, కిరణ్ కళ్యాణ్ కొండ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.
కళారత్న నాగరాజు వేణుగాన స్వరాలు
ఈ చిత్రానికి మ్యూజికల్ డ్యుయో మణి, నాగరాజు సంగీతాన్ని అందిస్తున్నారు. వీరిలో నాగరాజు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ వేణువాదకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ‘కళారత్న’, ‘వేణుగాన విశారద’ పురస్కారాలను అందుకున్న ఆయన అందించే స్వరాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
సీనియర్ డీవోపీ టి. సురేంద్ర రెడ్డి కెమెరా బాధ్యతలను నిర్వహించగా, కె. రమేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా నాని తంగేటి, కొరియోగ్రాఫర్‌గా బిగ్ బాస్ బ్యూటీ శ్రేష్టి వర్మ పనిచేస్తున్నారు. చిత్ర నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సహ నిర్మాతలు టి. సాయి చైతన్య, పి. గోపితో కలిసి నిర్మాతలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
త్వరలో లలిత టీజర్, ట్రైలర్
కొల్లి రామ గోపాల్ చౌదరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా వేములమడ శ్రీనివాస్ పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన లలిత టీజర్, ట్రైలర్ విడుదల తేదీలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


