48 ఏళ్లలో ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు, చేయలేదు.. నటుడిగా నన్ను తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీఆర్: రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్
నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల బ్రహ్మానందంపై నోరు జారి మళ్లీ విమర్శల పాలు అయ్యారు. సఃకుటుంబానాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, నోరు జారడంతో అంతా రాజేంద్ర ప్రసాద్‌ను తప్పు బట్టారు. ఈ క్రమంలో ఆ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం.
ఇటీవల నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ వరుసగా విమర్శల పాలు అవుతున్నారు. తాజాగా నవంబర్ 30న జరిగిన సఃకుటుంబానాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా రాజేంద్ర ప్రసాద్ నోరు జారిన విషయం తెలిసిందే. బ్రహ్మానందంపై రాజేంద్ర ప్రసాద్ నోరు జారడంతో ఇంటర్నెట్‌లో ఆయనపై విమర్శల దాడి జరిగింది.

విమర్శలు, వివాదంలో
ఈ విమర్శలు, వివాదంలో పడిపోయి సఃకుటుంబానాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన విషయాలను పక్కకు పెట్టేశారు. ఈ క్రమంలో ఆ ఈవెంట్‌లో నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్, చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
మరోసారి కలిసి నటించడం
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "సభా సరస్వతికి, నా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మానందంతో మరొకసారి కలిసిన నటించడం, మధు పనిచేసిన వారంతా ఉన్నత స్థాయిలకు అడగడం, వారిని ఈ స్టేజిపై చూడటం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది" అని అన్నారు.
వివిధ యాసలను
"ఒక నటుడు ఎంతో కాలం పాటు చిత్ర పరిశ్రమలో కనిపిస్తూ ఉండటం అనేది ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక నటుడు అలా కనిపించాలి అంటే తాము వేసే పాత్ర ప్రేక్షకులను అంతగా మెప్పించాలి. వివిధ ప్రాంతీయ భాష యాసలను సినిమాలలో మాట్లాడుతూ ప్రతి ప్రాంతం వారికి దగ్గర వాడిని అయ్యాను" అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
48 ఏళ్లలో వినలేదు
"ఒక కొత్త పాత్రతో మా దగ్గరకు కథ వచ్చిన ప్రతిసారి ఆశ్చర్యపోతూ ఉంటాము. సఃకుటుంబానాం వంటి కథ 48 సంవత్సరాలలో నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు. ఈ సినిమా అంత ప్రత్యేకంగా ఉండబోతుంది. నన్ను ఒక నటుడుగా తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర నేర్చుకున్న పని అందరికీ ఉపయోగపడటం గర్వించదగిన విషయం" అని ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్.
ఎలాంటి పాత్ర అయినా
"'ఆ నలుగురు' సినిమాలో నన్ను చూసినవారు అంత రాజేంద్రప్రసాద్ ఎలాంటి పాత్రనైనా చేయగలనుకున్నారు. సఃకుటుంబానాం వంటి సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర చాలా ఛాలెంజ్‌లు ఉన్నాయి. ఒక మనిషికి కుటుంబం ఎంత అవసరం అనేది తెలియజేస్తూ, కుటుంబ నేపథ్యంలో కుటుంబ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతూ రానున్న చిత్రం సఃకుటుంబానాం. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది" అని రాజేంద్ర ప్రసాద్ జోస్యం చెప్పారు.
ఎంతో శ్రద్ధతో నేర్చుకుని
"ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ కిరణ్ ఎంతో శ్రద్ధతో నేర్చుకుని నటించారు. అలాగే ఈ సినిమాలో నటీనటులు అంతా కూడా అద్భుతంగా నటించారు. నిర్మాత మహదేవ్ గౌడ్ గారు ఇటువంటి సినిమాలు మరిన్ని తీయాలని, తరువాత తరాలకు ఉపయోగపడే ఇటువంటి సినిమాలు మరిన్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సఃకుటుంబానాం చిత్రాన్ని థియేటర్‌లో చూడాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాను" అని తన స్పీచ్ ముగించారు రాజేంద్ర ప్రసాద్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


