మళ్లీ నోరుజారిన రాజేంద్ర ప్రసాద్.. ఈ సారి బ్రహ్మానందాన్ని అంత మాట అనేశారు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారారు. ఇటీవల తరచూ అసభ్య పదాలు వాడుతూ ఆయన వివాదాలు కొనితెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ అనకూడని మాట అన్నారు. 

Published on: Nov 30, 2025, 14:10:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల మూవీ ఈవెంట్లలో పబ్లిక్ గానే రాజేంద్ర ప్రసాద్ నోరు జారుతూ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఆ తర్వాత క్షమాపణలు చెబుతున్నారు. మళ్లీ రాజేంద్ర ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. సకుటుంబాయణం ట్రైలర్ లాంచ్‌లో బ్రహ్మానందాన్ని 'ముసలి' అని సంబోధిస్తూ అసభ్య పదం వాడటంతో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ విమర్శలు పాలయ్యారు. అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

బ్రహ్మనందం గురించి నోరు జారిన రాజేంద్రప్రసాద్
బ్రహ్మనందం గురించి నోరు జారిన రాజేంద్రప్రసాద్

రాజేంద్ర ప్రసాద్ కామెంట్

సకుటుంబాయణం ట్రైలర్ లాంచ్ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత తన ప్రసంగం చేయాలని రాజేంద్ర ప్రసాద్‌ను అడిగారు. మైక్ అందుకున్న ఆయన.. "పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్లు మాట్లాడాలా?" అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అప్పుడు బ్రహ్మానందం.. "ఏంటి? మీ శిష్యుడినే కదా, మీ కంటే పెద్దవాడిని అయినా" అని అన్నారు. దానికి రాజేంద్ర ప్రసాద్.. "కానీ ముసలి **** కొడుకువి కదా నువ్వు" అని అన్నారు. బ్రహ్మానందం ఆశ్చర్యంగా "ఎవరు?" అని అడగడంతో, ఆయన మాట మార్చి "నేను నా గురించి మాట్లాడుతున్నాను" అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

ఫ్యాన్స్ ఫైర్

రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందాన్ని సరదాగానైనా సరే అసభ్య పదంతో సంబోధించడం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక ఎక్స్ (ట్విట్టర్) యూజర్ ఆ వీడియోను షేర్ చేస్తూ.. "పబ్లిక్ ఈవెంట్లకు రావద్దని అతన్ని మర్యాదగా అడగాల్సిన సమయం ఆసన్నమైంది" అని రాజేంద్ర ప్రసాద్ గురించి రాశారు. మరొకరు.. "క్రమశిక్షణా చర్యల దృష్ట్యా, సినిమా ఆఫర్లను వెనక్కి తీసుకోవాలి" అని అన్నారు. ఇంకొకరు "ప్రతిసారి రాజేంద్ర ప్రసాద్ పబ్లిక్ స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు, బాలయ్య ఆయనలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది" అని బాలకృష్ణ పేరును మధ్యలోకి తీసుకొచ్చారు.

రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు

అయితే రాజేంద్ర ప్రసాద్ అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఒక అభిమాని.. "ఇది అంత చెడ్డది కాదు, ఒక స్నేహితుడు మరొకరిని 'ముసలి ****' అని పిలవడం గోదావరి జిల్లాల్లో అంత పెద్ద తప్పు కాదు. స్టేజ్‌పై కొంచెం అనుచితంగా అనిపించినా, నేను ఇంకా ఘోరమైనవి చూశాను" అని రాశారు.

నటుడిని ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి, ఒక ఎక్స్ యూజర్ సానుభూతిని కోరుతూ.. "రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె ఇటీవల మరణించారు. ఆయన ఇంకా ఆ బాధ నుండి కోలుకుంటుండవచ్చు. మన తాతను ఎలా చూసుకుంటామో, ఆయనను కూడా అలాగే చూద్దాం" అని రాశారు. మరికొందరు ఆయన కుమార్తె గాయత్రి 2024లో మరణించిందని, ఆయనను ట్రోల్ చేయడం తెలివైన పని కాదని కూడా పేర్కొన్నారు.

వార్నర్ ను

రాజేంద్ర ప్రసాద్ నటించిన అనేక చిత్రాలలో బ్రహ్మానందం హాస్య పాత్రలు పోషించారు. వాటిలో 'ఆహా నా పెళ్ళంట', 'అంతా మన మంచికే', 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' వంటివి ఉన్నాయి. అయితే రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో డేవిడ్ వార్నర్‌ను వర్ణిస్తూ ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించినందుకు ఆయన క్షమాపణలు చెప్పారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More