గ్లోబల్ ట్రెండ్ సెట్టర్‌గా చికిరి సాంగ్.. రామ్ చరణ్ స్టెప్పులతో విదేశీ భామల వీడియోలు.. ఇంటర్నెట్‌లో రచ్చ
పెద్ది మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘చికిరి’ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ మామూలుగా లేదు. గ్లోబల్ వైడ్ గా ఈ పాట ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. ఈ పాటకు రామ్ చరణ్ స్టెప్పులను వేస్తూ ఫారెనర్లు వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చికిరి చికిరి.. ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది ఈ పాట. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజైన చికిరి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ గా మారుతోంది. ఈ సాంగ్ కు ఫారెనర్లు ముఖ్యంగా విదేశీ అమ్మాయిలు చేస్తున్న డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

రామ్ చరణ్ స్టెప్స్
పెద్ది మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘చికిరి’ ఇన్ స్టంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీలోని పాటగా చరిత్ర నమోదు చేసింది. ఈ పెప్పీ మెలోడీలో రామ్ చరణ్ స్టెప్స్ అదిరిపోయాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న పెద్ది మూవీలో నుంచి వచ్చిన చికిరి సాంగ్ ను మోహిత్ చౌహాన్ పాడాడు. ఆ పాట, స్టెప్స్ కలిసి వైరల్ గా మారాయి.
విదేశీ భామలు
చికిరి ఫీవర్ ఇండియాకే పరిమితం కాలేదు. గ్లోబల్ వైడ్ గా ఇది అదరగొడుతోంది. విదేశీ భామలు ఈ సాంగ్ కు రామ్ చరణ్ లా వేస్తున్న హుక్ స్టెప్స్ వీడియోలు ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయిదుగురు ఫారెన్ అమ్మాయిలు కలిసి చికిరి సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను పెద్ది మూవీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
‘‘చికిరి వైబ్ అన్ స్టాపబుల్. రూరల్ బీట్స్. పాన్ వరల్డ్ వైబ్’’ అనే క్యాప్షన్ తో ఆ వీడియోను పోస్టు చేశారు.
నేపాలీ అమ్మాయి
చికిరి పాటకు ఎంతో క్యూట్ గా నేపాలీ అమ్మాయి చేసిన డ్యాన్స్ అయితే తెగ ఆకట్టుకుంటోంది. నోట్లో బీడీతో అచ్చం రామ్ చరణ్ లా ఈ భామ స్టెప్పులు వేసింది. అందం, గ్రేస్ తో అదరగొట్టింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
రియాక్షన్స్ వైరల్
చికిరి పాటకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రియాక్షన్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ఫారెనర్లు ఈ సాంగ్, స్టెప్స్ చూసి అదిరిపోయిందనే కామెంట్లు పెడుతున్నారు. వాళ్ల రియాక్షన్ కూడా అదే రకంగా ఉంది. ఈ వీడియోను కూడా పెద్ది ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ 2026, మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


