OTT Action: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన స్పై యాక్షన్ థ్రిల్లర్- మైండ్ గేమ్‌లు, ఊహకందని ట్విస్టులు- తెలుగులోనే! ఎక్కడంటే?
Special OPS OTT Streaming In Telugu: ఓటీటీలో మైండ్ గేమ్‌లు, మైండ్ బ్లాక్ ట్విస్టులతో సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ స్పెషల్ ఆప్స్. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ సీన్లు, 8.5 రేటింగ్ దక్కించుకున్న ఈ సిరీస్ తెలుగులోనే ఉంది. కచ్చితంగా చూడాల్సిన స్పెషల్ ఆప్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Special OPS OTT Release In Telugu: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై యాక్షన్, స్పై థ్రిల్లర్ కంటెంట్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సస్పెన్స్, మైండ్ గేమ్‌లు ఇష్టపడే సినీ ప్రియులకు ఓటీటీలో ఉన్న స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్ ఒకటి తెగ ఆకట్టుకుంటోంది.

కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్
ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన ఆ వెబ్ సిరీస్ పేరు 'స్పెషల్ ఆప్స్' (Special OPS). ఒక్కసారి చూడటం మొదలుపెడితే చివరి ఎపిసోడ్ వరకు స్క్రీన్‌కు హత్తుకుపోయేలా ఈ ఓటీటీ సిరీస్ సాగుతుంది. మైండ్ గేమ్స్, శత్రువులు వేసే ప్లాన్స్‌ను తిప్పుకొట్టే రా పోలీసులు, ట్విస్టులతో ఈ ఓటీటీ సిరీస్ వీకెండ్‌కు బెస్ట్ ఆప్షన్.
హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ సీక్రెట్ ఆపరేషన్!
భారత అత్యున్నత నిఘా సంస్థ 'రా' (RAW) సీనియర్ అధికారి హిమ్మత్ సింగ్, ఆయన నడిపే సీక్రెట్ టాస్క్ ఫోర్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన తీవ్రవాద కుట్రలను ఛేదించేందుకు హిమ్మత్ సింగ్ వేసే వ్యూహాలు అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తిస్తాయి.
ప్రభుత్వ నిధుల వాడకంపై
ప్రభుత్వ నిధుల వాడకంపై ఆయనపై అంతర్గత విచారణ జరగడం, ఆ ఎంక్వైరీ వేదికగా ఆయన తన రహస్య ఏజెంట్లు సాధించిన విజయాలను వివరిస్తుండడం ఈ సిరీస్ కథనంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
రెండు సీజన్లు.. మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు!
మొదటి సీజన్ 2020లో రాగా, ఇందులో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌ల పేర్లను పాత బాలీవుడ్ చిత్రాల పేర్లతో పెట్టడం విశేషం. ఈ సీజన్ సాధించిన విజయం తర్వాత, హిమ్మత్ సింగ్ గతాన్ని వివరిస్తూ 'స్పెషల్ ఆప్స్ 1.5' పేరుతో ఒక స్పిన్‌ఆఫ్ కూడా తీసుకొచ్చారు.
వారాల పేర్లు
ఆ తర్వాతి క్రమంలో 2025లో ఓటీటీ రిలీజ్ అయిన రెండో సీజన్‌లోనూ 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ రెండో సీజన్ ఎపిసోడ్‌లకు వారాల పేర్లను కేటాయించారు. కథలో వచ్చే ఊహించని మలుపులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి.
కేకే మీనన్ ఒంటిచేతి ప్రదర్శన.. అద్భుత నటన!
ఈ ఓటీటీ సిరీస్‌కు ప్రధాన బలం హిమ్మత్ సింగ్ పాత్రలో జీవించిన సీనియర్ నటుడు కేకే మీనన్. సీరియస్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే, సంభాషణల్లో ఆయన పండించే సమయస్ఫూర్తి, కౌంటర్లు నవ్వులు పూయిస్తాయి. తీవ్రమైన ఉత్కంఠ మధ్య కూడా ఈ తేలికపాటి హాస్యం మంచి వినోదాన్ని ఇస్తుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ఆయనతో పాటు కరణ్ టాకర్, ముజమ్మిల్ ఇబ్రహీం, గౌతమి కపూర్, సయామీ ఖేర్, మెహర్ విజ్, ప్రకాష్ రాజ్ తమ నటనతో అలరించారు. నీరజ్ పాండే, శివమ్ నాయర్ అత్యుత్తమ ప్రమాణాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ స్పెషల్ ఆప్స్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో (IMDb)లో ఏకంగా 8.5 రేటింగ్ ఉంది.
స్పెషల్ ఆప్స్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న స్పెషల్ ఆప్స్ రెండు సీజన్లు ఓటీటీలో తెలుగులో కూడా అదరగొడుతున్నాయి. జియో హాట్‌స్టార్‌లో స్పెషల్ ఆప్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళ ఇతర భాషల్లో కూడా హాట్‌స్టార్‌లో స్పెషల్ ఆప్స్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఉత్కంఠ రేపే ట్విస్టులు, వ్యూహాలతో సాగే ఈ సిరీస్ చూసేందుకు బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


