Gunde Ninda Gudi Gantalu: ఓటీటీ సిరీస్ కోసం గుండె నిండా గుడి గంటలు బాలు- స్టార్ క్యాబ్ డ్రైవర్‌గా విష్ణుకాంత్- ఎక్కడంటే?

Gunde Ninda Gudi Gantalu Balu In OTT Series Part Timers: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలులో బాలుగా ఎంతోమంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్న విష్ణుకాంత్ తెలుగు ఓటీటీ సిరీస్ పార్ట్ టైమర్స్ కోసం రంగంలోకి దిగాడు. మరి ఆ పార్ట్ టైమర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఏంటీ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Aug 26, 2026, 23:47:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Balu In OTT Series Part Timers: తెలుగు బుల్లితెర ప్రపంచంలో అధిక వ్యూస్‌తో దూసుకుపోతున్న సీరియళ్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో హీరో బాలు పాత్రకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

ఓటీటీ సిరీస్ కోసం గుండె నిండా గుడి గంటలు బాలు- స్టార్ క్యాబ్ డ్రైవర్‌గా విష్ణుకాంత్- ఎక్కడంటే?
ఓటీటీ సిరీస్ కోసం గుండె నిండా గుడి గంటలు బాలు- స్టార్ క్యాబ్ డ్రైవర్‌గా విష్ణుకాంత్- ఎక్కడంటే?

బాలుగా విష్ణుకాంత్ క్రేజ్

తండ్రికి బాధ్యతగల కొడుకుగా, భార్యకు ఓ మంచి భర్తగా, ద్వేషించే తల్లిని సైతం ప్రేమగా చూసే కొడుకుగా, క్యాబ్ డ్రైవర్‌గా అన్ని ఎమోషన్స్ పండించే ఈ బాలు పాత్రకు ఎనలేని క్రేజ్ ఉంది. ఆ పాత్రకు అంత క్రేజ్ రావడానికి కారణం నటుడు విష్ణుకాంత్.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలుగా తన నటనతో అనేక మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నాడు విష్ణుకాంత్. అలాంటి విష్ణుకాంత్ తెలుగు ఓటీటీ సిరీస్ కోసం రంగంలోకి దిగాడు. అదే పార్ట్ టైమర్స్. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్, సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సిరీస్ కూడా ఇదే.

లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా

ఈ పార్ట్ టైమర్స్ ఓటీటీ సిరీస్‌లో తనూజతోపాటు టాలీవుడ్ నటి జ్ఞానేశ్వరి కాండ్రేగుల కూడా మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. తనూజ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఇద్దరు మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీసే ఈ పార్ట్ టైమర్స్.

జియో హాట్‌స్టార్‌లో పార్ట్ టైమర్స్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఆగస్ట్ 28 నుంచి హాట్‌స్టార్‌లో పార్ట్ టైమర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పార్ట్ టైమర్స్ కోసం గుండె నిండా గుడి గంటలు బాలు ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా స్టార్ క్యాబ్ డ్రైవర్‌గా.

బ్రాండ్ అంబాసిడర్‌గా బాలు

పార్ట్ టైమర్స్ సిరీస్‌లో ఇద్దరు హీరోయిన్లు ఒక ట్రావెల్ యాప్ రన్ చేస్తారు. అందుకోసం బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ క్యాబ్ డ్రైవర్ అనే పేరున్న బాలును అప్రోచ్ అవుతారు. బాలుతో యాప్ ప్రమోషనల్ షూట్ చేస్తారు. ఇంట్రావర్ట్ అయిన తనూజ పాత్రకు షూట్ నచ్చితే.. ఎక్స్‌ట్రావర్ట్ అయిన జ్ఞానేశ్వరికి నచ్చదు.

తనూజ ఓకే అంటే.. జ్ఞానేశ్వరి కాండ్రేగుల మాత్రం అలా, ఇలా చేయాలంటూ సలహాలు ఇస్తుంది. ఈ క్రమంలోనే తనుజ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఇద్దరు పోట్లాడుతుంటారు. అదంతా చూసిన బాలు మీరు కుదురుగా ఓ ప్రమోషనల్ షూటే చేయలేకపోతున్నారు, ఇద్దరు కలిసి ఓ స్టార్టప్ ఎలా నడుపుతరాని ఎద్దేవా చేస్తాడు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో పార్ట్ టైమర్స్

వాళ్లు నడుపుతామని ధీమాగా చెబుతారు. అది కూడా చూస్తానని బాలు వెళ్లిపోతాడు. అలా పార్ట్ టైమర్స్‌లో తనూజ పుట్టస్వామి, జ్ఞానేశ్వరి కాండ్రేగులతో సాగే కథ ఎలా ఉంటుందో బాలు ద్వారా చెప్పించారు. దీనికి సంబంధించిన 3 నిమిషాల ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలా పార్ట్ టైమర్స్ ఓటీటీ సిరీస్ కోసం గుండె నిండా గుడి గంటలు బాలు రంగంలోకి దిగి ఆకట్టుకున్నాడు. మరి రేపటి (ఆగస్ట్ 28) నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు వెబ్ సిరీస్ పార్ట్ టైమర్స్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More