Gunde Ninda Gudi Gantalu: షాకింగ్- గుండె నిండా గుడి గంటలు నుంచి మనోజ్ అవుట్- కారణం ఇదే! యశ్వంత్ రెమ్యునరేషన్ ఎంతంటే?

Gunde Ninda Gudi Gantalu Serial Manoj Aka Yashwanth Out: బుల్లితెరపై రికార్డు స్థాయి టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌కు సంబంధించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనోజ్ పాత్ర పోషిస్తున్న నటుడు యశ్వంత్ ఈ సీరియల్ నుంచి తప్పుకోనున్నట్లు టాక్ నడుస్తోంది.

Published on: Jul 12, 2026, 11:34:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Actor Today Episode: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, స్టార్ మా ఛానల్‌లో అత్యధిక రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు'.

షాకింగ్- గుండె నిండా గుడి గంటలు నుంచి మనోజ్ అవుట్- కారణం ఇదే! యశ్వంత్ రెమ్యునరేషన్ ఎంతంటే?
షాకింగ్- గుండె నిండా గుడి గంటలు నుంచి మనోజ్ అవుట్- కారణం ఇదే! యశ్వంత్ రెమ్యునరేషన్ ఎంతంటే?

గట్టి పోటీ ఇచ్చే సీరియల్

ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తూ, 'కార్తీక దీపం 2' వంటి క్రేజీ సీరియల్స్‌కు గుండె నిండా గుడి గంటలు గట్టి పోటీ ఇస్తోంది. ఈ సీరియల్‌లోని ప్రతి పాత్రకూ వీక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. హీరో బాలు నుంచి తల్లి ప్రభావతి పాత్ర వరకు అందరికి ఇంపార్టెన్స్ ఉంటుంది.

అయితే, ప్రతి పాత్రతో మెప్పించే గుండె నిండా సీరియల్ మేకర్స్ తమ అభిమానులకు పెద్ద షాక్ ఇవ్వనున్నారు. ఈ సీరియల్‌లో బాలుకు అన్నగా ప్రభావతి ముద్దుల కొడుకుగా, లక్షలు మింగినోడిగా, చెంపదెబ్బలు తిన్నోడిగా ఎంతగానో మెప్పిస్తోన్న మనోజ్ పాత్ర నటుడు ఇక కనిపించడనే వార్త ప్రచారం సాగుతోంది.

యాక్టర్ పేరు యశ్వంత్ కనిగిరి

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌లో మనోజ్ పాత్రకు ప్రాణం పోసేంతలా నటించిన యాక్టర్ పేరు యశ్వంత్ కనిగిరి (యశ్వంత్ కే సూర్య). ఇది వరకు మనసిచ్చి చూడు సీరియల్‌లో నటించిన యశ్వంత్ గుండె నిండా గుడి గంటలుతో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఎన్నో డిగ్రీలు చదివినప్పటికీ అమాయకుడిగా, కన్నింగ్, స్వార్థమైన మనిషి అయినటువంటి మనోజ్ పాత్రలో జీవించేశాడు యశ్వంత్. అలాంటి యశ్వంత్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి తప్పుకోనున్నాడని సమాచారం.

కళ్ల కట్లు విప్పేసరికి ముఖం మారిపోతుందా?

సీరియల్ కథ ప్రకారం ప్రస్తుతం మనోజ్ ప్రమాదంలో కళ్లు కోల్పోయి, కళ్లకు కట్లతో కనిపిస్తున్నాడు. అయితే, ఆ కట్లు విప్పే సమయానికి మనోజ్ పాత్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, యశ్వంత్ స్థానంలో కొత్త నటుడు ఎంట్రీ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

కథలో సరికొత్త ట్విస్ట్ కోసమే మేకర్స్ ఈ విధమైన ప్రయోగం చేస్తున్నారా లేదా నిజంగానే యశ్వంత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారా అనేది ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో పెద్ద సస్పెన్స్‌గా మారింది. మనోజ్ లాంటి విలక్షణమైన నటనకు ప్రత్యామ్నాయంగా ఇంకొకరిని ఊహించుకోవడం కష్టమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

వెండితెరపై యశ్వంత్ అదృష్టం.. సినిమాల్లో ఎంట్రీ

యశ్వంత్‌కు కేవలం 'గుండె నిండా గుడి గంటలు' మాత్రమే కాకుండా, బుల్లితెరపై మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్‌లో ప్రసారమైన పలు పాపులర్ సీరియల్స్‌లో ఆయన కీలక పాత్రలు పోషించారు. నెగెటివ్, పాజిటివ్ షేడ్స్ రెండింటినీ అద్భుతంగా పండించగల నటుడిగా పేరు తెచ్చుకున్నారు యశ్వంత్.

ప్రస్తుతం ఆయన కేవలం టీవీ రంగానికే పరిమితం కాకుండా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే రెండు క్రేజీ సినిమాల్లో యశ్వంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని, అందుకే గుండె నిండా గుడి గంటలు సీరియల్‌కు స్వస్తి పలుకుతున్నారని టాక్ నడుస్తోంది.

యశ్వంత్ రెమ్యునరేషన్

ఇక యశ్వంత్ ప్రస్తుతం సీరియల్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 20 వేలకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మనోజ్ పాత్రలో యశ్వంత్ కొనసాగుతారా లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్ చూస్తేనే స్పష్టత వస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More